అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ – Part 5

ప్రియ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉండిపోయాను. తనకి ఒక మెసేజ్ చేద్దాం అనుకుని, మళ్ళా ఇప్పుడే వద్దు, ఒక వారం తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అయితే ఫేస్బుక్ ఓపెన్ చేసి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. నా ఫోన్లో సేవ్ చేసిన తన ఫొటోస్ అలాగే చూస్తూ, అలాగే ఏదో దొరికిన ప్రేమ కథ పుస్తకం online లో డౌన్లోడ్ చేసి చదువుతూ సమయం గడిపేశాను.

మరుసటి రోజు అందరూ ఆఫీస్ లో అందరూ నేనుందుకు ఈ రోజు చాల సంతోషంగా ఉన్నాను అని అడిగారు. నేను స్వీట్స్ తేవటం మరచిపోయాను. లంచ్ టైములో, బయటకు వెళ్లి స్వీట్స్ కొనుక్కొని వచ్చాను. అందరికి ఆఫీస్ లో పంచాను. అందరూ పెళ్లి ఎప్పుడు అని అడిగారు.

ఎంగేజ్మెంట్ కోసం శుభలేఖలు ప్రియ వాళ్ళే తాయారు చేయించి మాకు ఒక 10 కార్డులు పంపిస్తారు. కేవలం 20-30 మంది మాత్రమే వస్తారు. అటు వైపు ఒక 10 మంది ఇటు వైపు ఒక 10 మంది. ఒక చిన్న హోటల్ లో ప్రియ వాళ్ళ ఊరిలో చేసుకుంటున్నాము. పెళ్లి విషయంలో మంచి శుభలేఖలు తయారు చేయించి. అందరికి పంచాలి. కొంచెం గ్రాండ్ గా చేయాలి అనుకున్నాం కాబట్టి, చాలా పనులు ఉంటాయి.

నేను పదే పదే నా ఫోన్ లో ఫేస్బుక్ చూసుకుంటూ ఉండిపోయాను. చివరకి సాయంత్రం ఇంటికి వెళ్లి డిన్నర్ చేసే ముందు నోటిఫికేషన్ వచ్చింది నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ప్రియ accept చేసినట్లు. నేనెందుకు ప్రియ గురించి ఇంత ఆతృతగా ఉన్నానో నాకే అర్థం కాలేదు.

ఒక మూడు రోజుల తర్వాత ఆఫీస్ లో ఉన్న టైములో ఫోన్ మోగింది. స్క్రీన్ పై “ప్రియా డార్లింగ్” అని ఉంది. వెంటనే ఫోన్ ఎత్తాను:

“హలో” అని అటు వైపు తీయని గొంతు

“ప్రియ”

“సంజయ్ గారు, ఎంగేజ్మెంట్ కి కార్డ్స్ తాయారు అయ్యాయి, కొంచెం మీ వైపు ఎవరెవరికి పోస్ట్ చేయాలో వారి పేర్లు అడ్రస్ లు ఇవ్వగలరా ??”

నాకు ఎం చెప్పాలో అర్థంకాలేదు.

“సరే ప్రియ, కొంచెం టైం ఇవ్వు, వాట్సాప్ చేస్తాను”

“సరే సంజయ్ గారు” అని ఫోన్ కట్ చేయబోతుండగా.

“ప్రియ ……. ” అని అన్నాను

“షాపింగ్ కు ఎప్పుడు అని ఎమన్నా అనుకున్నారా ?? అమ్మ నాన్నను ఊరికి పిలవాలి”

“ఇంకా లేదండి, వచ్చే వారం అన్నారు అమ్మ నాన్న. ఇంకా డబ్బులు అరెంజ్ చేసుకుంటున్నారు”

“మీరు ఏమి అనుకోకపోతే…… టికెట్స్ బుక్ చేయాలి కదా అమ్మ కి నాన్న కి కొంచెం డేట్ చెప్తే….. ”

“సరే సంజయ్ గారు…… నేను మీకు మళ్ళా ఫోన్ చేస్తాను”

“సరే ప్రియ”

ఫోన్ కట్ అయ్యింది. ఎందుకో ప్రియ తో మాట్లాడక చాలా ఆనందం కలిగింది. తన గొంతు వినగానే చెప్పలేని అనుభూతి. ప్రేమంటే ఇలాగె ఉంటుందా అనిపించింది.

తాను మళ్ల సాయంత్రం ఫోన్ చేసింది:

“హలొ ”

“ప్రియ….. ”

“అడిగానండి అమ్మ నాన్న గురువారం చెప్పారు, కానీ నాకు లీవ్ దొరకలేదు, అందుకే శుక్రవారం అనుకుంటున్నాము, మీకు ఓకేనా ??”

“ఒకే……. నో ప్రాబ్లెమ్”

“సంజయ్ గారు, పేర్లు అడ్రస్లు పంపిస్తాను అన్నారు, ఎంగేజ్మెంట్ కార్డ్స్ కోసం”

నేను అసలు వాటి సంగతే మరచిపోయాను.

“రేపటిలోపల పంపిస్తానండి”

“పర్లేదండి…..”

“ప్రియ……. నువ్వు ఏమి అనుకోనంటే….. ”

“పర్లేదు చెప్పండి……”

“మనం ఒకసారి ఈ వీకెండ్ కలుద్దామా ఎక్కడైనా బయట??”

అటు వైపు సైలెంట్ అయిపోయింది కొంచెంసేపు.

“నేనే నిన్ను పికప్ చేసుకుంటాను డ్రాప్ చేస్తాను……”

“సంజయ్ గారు మీరు ఏమి అనుకోనంటే…………”

తను ఏమి చెప్పాలనుకుంటుందో అని నేను వెయిట్ చేసాను

“…….. కావాలంటే షాపింగ్ అయ్యాక ఒకసారి కలుధ్ధాం…….”

కొంచెం సైలెంట్ అయ్యింది రెండు వైపులు కూడా

“పర్లేదండి……. అర్ధం చేసుకోగలను……. ఏదో ఒకసారి కలిస్తే బాగుంటుంది కదా అని అడిగాను….. అయితే తర్వాత కలుద్దాం”

“సంజయ్ గారు థాంక్స్ అర్థం చేసుకున్నందుకు…….. ఒక అమ్మాయి గా నా గురించి కొంచెం మీరు ఆలోచించాలి”

“లేదు లేదు నాకు అర్థమయిందిలెండి……. ఎనీవే థాంక్స్ అండి….. ”

“సరే సంజయ్ గారు, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం”

టు బి కంటిన్యూడ్…….