ఒక వారం రోజులు బాగా టార్చర్ అనుభవించాను. తర్వాత పెళ్లి మాటల కోసం అందరం కలిసాము. ప్రియని వారం తర్వాత చూస్తున్న. మాత్రం బయటకు బాగానే ఉన్న లో లోపల మాత్రం తీరని ప్రేమ దాహం. పెళ్లి మాటల్లో పెద్దలు అన్ని విశేషాలు మాట్లాడుకున్నారు. ఎవరు ఏమి మాట్లాడుకున్నారో చిన్న చీటీలో రాశి వాటిని ఒకరికి ఒకరు మార్చుకున్నారు.
నేను, అమ్మ నాన్నలకి అపార్ట్మెంట్ గురించి చెప్పాను. అక్కడ మాటల్లో ఈ ప్రస్తావన వచ్చింది. అయితే ప్రియా ఒకటే కూతురు కాబట్టి, కట్నం బాగానే ఇస్తున్నారు. ఒక కొత్త స్విఫ్ట్ కారు, ఒక 10 ఎకరాల పొలం, 5 లక్షల డబ్బు, మా కొత్త ఇంటి కోసం మంచాలు, సోఫా, వంట సామాన్లు వాగేరా అలాగే పెళ్లి ఖర్చులు.
అమ్మకి కట్నం లాంటివి నచ్చవు. మా అమ్మకి డాక్టర్ చదవాలని బాగా కోరిక ఉండేది కానీ ఆ రోజుల్లో అమ్మ చదువు ఆపించేసి మొత్తం డబ్బు తాత గారు అమ్మ పెళ్ళికి వాడేశారు.
మా నాన్నగారి వైపు కూడా అలంటి ఆలోచనలు ఉన్నాయి. మా తాతగారు ఒక చిన్న సంఘసంస్కర్త. మా నాన్నని డిగ్రీ వరకు చదివించిన ఆయనకు ఊరు వాళ్ళని వదిలి ఉండటం ఇష్టం లేక వెనక్కి వచ్చేసి అక్కడ కొన్ని సంవత్సరాలు తాత గారితో ఉండి, తర్వాత చాల సంవత్సరాలు సర్పంచిగా పనిచేసారు. ప్రస్తుంతం అన్నిటికి దూరంగా ఉంటూ ఊరులో ఒక పెద్ద మనిషి గా ఉంటున్నారు. ఆయనకి ఊరన్న, ఊరిలో జనాలన్న చాల ప్రేమ.
మా చెల్లికి ఒక రూపాయి కట్నం తీసుకోకుండా ఉండే వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న ఆశ. అందుకే ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు ఎక్కువైనా చెల్లి చదువు పైనే ఖర్చుపెట్టేస్తున్నారు డాక్టర్ చదివించటానికి. వాళ్ళిద్దరి ఉద్దేశం ఏంటి అంటే డబ్బు ఆడపిల్లల చదువుకి వాడాలి కానీ కట్నానికి కాదు అని.
ఈ విషయంలో, ప్రియ ఒక్కటే కూతురు కాబట్టి, కట్నంగా ఇచ్చే ఆస్తి, డబ్బు, వస్తువులు, అన్ని కూడా ప్రియా పేరు మీదే ఉంటాయి. పిల్లలు పెద్ద వాళ్ళయ్యాక, ప్రియ పేరు నుంచి డైరెక్ట్ గ వాళ్ళ పేరు మీదకి అన్ని ట్రాన్సఫర్ అవుతాయి.
అయితే నిష్ఠితార్థానికి మూహూర్తం నెల తర్వాత, పెళ్లి ముహూర్తం అక్కడినుంచి రెండు నెలల తర్వాత నిర్ణయించారు. మొత్తం ఇప్పటి నుంచి పెళ్లి 3 నెలలు. ఈ లోపల నిష్ఠితార్ధం అలాగే పెళ్లి పనులు చాలా ఉంటాయి. అయితే నిష్ఠితార్ధం కొంచెం తక్కువ ఖర్చుతో చేసి పెళ్లి మాత్రం ఎక్కువ ఖర్చుతో ఘనంగా చెయ్యాలని అనుకున్నారు. ఇక రిసెప్షన్ లాంటివి వద్దనుకున్నారు.
ప్రియని మాత్రం కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను. తాను కూడా నన్ను చూస్తూ కొంచెం సిగ్గు పడుతూ ఉంది. పయిన సారికన్నా ఈ సారి ఎక్కువ ఊహలు నన్ను దిష్టర్బ్ చేసాయి. తాను ఈసారి మాత్రం పోయిన సారికన్నా ఈ సరి చాల సెక్సీ గ కనిపించింది. తన చీర మాములు చీర అయినా, నా ఊహలలో మాత్రం తనను ఒక శృంగార దేవత లాగా ఊహించుకున్నాను. తను మాట్లాడే విధానం, నడిచే నడక, తన తీయని గొంతు, తను చూసే చూపులు అన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. నన్ను చుసిన వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు.
కొంచెం మాటలు అయ్యాక, ప్రియ అందరికి ఇల్లు చూపిస్త అని చెప్పింది. నాకు ఈ లోపల అర్జెంటు ఫోన్ వచ్చి పక్కకి వెళ్లాను. వచ్చేసరికి, తను ఇల్లంతా చూపించేసింది మా వాళ్లకి.
అవకాశం దొరికింది కదా అని, కొంచెం అందరూ పక్కకు వెళ్ళిపోయిన సమయంలో “ప్రియ గారు, నేను ఇల్లు చూడలేదండి…..” అని అడిగాను.
“మనకి అంత సెట్ అయ్యింది కాబట్టి, ఇంకా మీరు గారు ఎందుకండీ, ప్రియ అని పిలవండి చాలు”
నేను నవ్వి “సరే ప్రియ, ఇల్లు చూపిస్తావ”
తను నవ్వి “రండి చూపిస్తాను”
అంత ఇల్లు చూపించక ఇద్దరం ఇంటి బయటకు వెళ్ళాము.
“సంజయ్ గారు, ఈ రోజేంటండి, కళ్ళార్పకుండా అలాగే చూసారు నన్ను………. ”
“నువ్వు చాలా అందంగా ఉన్నావ్ ఈ రోజు”
ప్రియా సిగ్గు పడింది.
“చాలా సిగ్గండి మీకు, చూడండి మీ బుగ్గలు ఎలా ఎర్రగా అయిపోయాయో. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు”
ప్రియ నా మాటలు విని ఎం చెయ్యాలో అర్థంకావటంలేదు. సిగ్గుతో ఉంది, నవ్వుతుంది, అలాగే కొంచెం షాక్ లో ఉన్నట్లుంది. నాకు కూడా ఫ్లో లో ఆలా వచ్చేసింది.
“సారి ప్రియ ఏమి అనుకోవద్దు, మాటలు ఆలా ఆలా వచేస్తుంటాయి కొన్ని సార్లు”
ప్రియా కొంచెం పెదాలతో నవ్వుతు తల అటు ఇటు ఊపి ఏమి మాట్లాడలేదు.
“నన్ను సంజయ్ అని పిలువు…… అండి గిండి కాదు….. ఎవరో పెద్దమనిషిని పిలుస్తున్నట్లుంది ఆలా అంటే”
ప్రియా నవ్వి “ఏమో సంజయ్ గారు, భర్తను ఏమండి అని పిలవాలి. మీరు నన్ను పేరు పెట్టి పిలవొచ్చు. ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి, సంజయ్ గారు అనే పిలుస్తాను ప్రస్తుతానికి”
కొంచెం ఆలా బయట ఉన్న తోట చూపించింది ప్రియ.
“ప్రియ…..”
“ఏంటి సంజయ్ గారు ??”
“ని ఫోన్ నెంబర్……. ”
“నా ఫోన్ నెంబరా ??”
నేను తల ఊపాను.
“మీరు చాలా ఫ్రాంకె కాదు ఫాస్టు కూడా…….. ”
“అంటే పెళ్లి మాటలు అయ్యాయి కదా అని ……… ”
“మన ఎంగేజ్మెంట్ ఇంకా నెల రోజులు టైం ఉంది, అప్పుడు మనం షాపింగ్ కు వెళ్ళినప్పుడు ఇస్తాను…… సరేనా సంజయ్ గారు ??”
తను కొంచెం నవ్వుతుంది కానీ దాచుకుంటుంది.
“ముందు మీ ఫోన్ నెంబర్ ఎంతో చెప్పండి” అని అడిగింది.
నేను నా నెంబర్ ఇచ్చాను తనకి. తన ఫోన్లో ఫీడ్ చేసుకుంది.
“ప్రియ ….. సరిగ్గానే నెంబర్ ఫీడ్ చేసుకున్నారా ??”
“చేసుకున్నానండి”
“లేదండి మీరు రాంగ్ నెంబర్ ఫీడ్ చేసుకున్నారు”
“సరిగ్గానే చేసానండి……. ”
“ఏది అయితే ఒక మిస్సెడ్ కాల్ ఇవ్వు నా నెంబర్ కి”
తన ఫోన్ తీస్కుని, ఏదో చెయ్య బోతుండగా….. ఒకసారి ఆగి…….. నా వైపు చూసింది. నేను నవ్వుతున్నాను.
“ఆమ్మో మీతో చాలా జాగ్రత్త సుమి…….. ”
“ఇక మీ అల్లరి చాలు…… నేను మీకు ఎంగేజ్మెంట్ షాపింగ్ అప్పుడు కాల్ చేస్తాను……. అప్పుడు మీకే తెలుస్తుంది నా నెంబర్”
కొంచెం ప్రియా ఎందుకో అంత ఇష్ట పడట్లేదు నెంబర్ ఇవ్వటానికి. అయితే ఇప్పుడే పెళ్లి మాటలు కుదిరాయి కాబట్టి తను నాకు ఇప్పుడే ఫోన్ నెంబర్ ఇస్తుంది అని నేను అనుకోవటం నా పొరపాటు. ఆడపిల్ల కదా కొంచెం జాగ్రత్త ఎక్కువ. తనకి కొంచెం సమయం కావాలి అనుకున్నాను. అయితే తనకు నా పై మంచి ఇష్టం, నమ్మకం కలిగినప్పుడు కచ్చితంగా తన ఫోన్ నెంబర్ నాకు ఇస్తుంది అనుకున్నాను.
అందరం కాసేపు అక్కడ ఉండి, భోజనం చేసి బయల్దేరబోతున్నాం….. ప్రియ వాళ్ళ అమ్మ నాన్న వెనుక నిల్చొని ఉంది. మేము వెళ్లొస్తాం అని చెప్పి వెళ్లే చివరి సమయంలో…… ప్రియ తన ఫోన్ తో చేయి ఊపింది…… నా ఫోన్లో కొత్త నెంబర్ తో మిస్సెడ్ కాల్ ఉంది. ప్రియా ఫోన్ చేసింది నాకు. అది చూసి, తన వైపు చూసి నవ్వాను. తాను కూడా నవ్వింది.
వెంటనే “ప్రియ డార్లింగ్” అని నెంబర్ ఫీడ్ చేసుకున్న ఫోన్ లో.
టు బె కంటిన్యూడ్ ………