అహన ఇంటికొస్తూ క్లబ్ దగ్గర్ తనతో జోస్న మాట్లాడిన మాటలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొంటూ ఉద్వేగపడుతోంది.
మోహన విశయం పూర్తిగా విన్నాక జోస్న చాలా తేలిగ్గా కొట్టిపారేస్తూ దీనికంత హైరానా పడాల్సిన అవసరం ఏముంది అహనా .. .. నీకు గల ఇబ్బందులను డైరెక్ట్ గా మోహనతో మాట్లాడి వాళ్ళిద్దరినీ వేరుగా ఉంచి కాపురం చేసుకోమనడం ఒకటి. . . మీకు ఒక్కడే కొడుకు కాబట్టి అలా మీ భర్యాభర్తలకు అంగీకారం కాని పక్షంలో నీకొడుకుని ఏదోవిధంగా నీ దారిలోనికి తెచ్చుకొని నీమాట వినేట్లు చేసుకొని ఆరకంగా మోహనను వాడి ద్వారానే వదిలించుకోవడం రెండవది. ఇందులో నీకు ఏది సూటవుతుందో నీవే ఆలోచించుకో. . .లేదంటే మోహన మీదున్న వ్యతిరేకత నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తుంది. మీ చక్కటి కాపురాన్ని నీ చేజేతులా నాశనం చేసుకొంటావు. జోస్న చెప్పింది అక్షరాలా నిజమనిపించి సరేలేవే . . . . చారితో ఓ సారి మాట్లాడి నా తిప్పలేవోపడతాను అంటూ అక్కడినుండి వచ్చేస్తూ. . . జోస్న చెప్పిన దాంట్లో తనకు రెండోదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మోహనను వదలి గగన్ ఉండలేడు. వాడినొదలి తల్లిదండ్రులుగా తాముండలేరు. కాబట్టి గగన్ ను తన దారిలోనికి తెచ్చుకోవడమే కరెక్ట్ . . .ఎటూ సావంత్ వల్ల తాను సగం చెడింది. ఆ విశయం గగన్ కు కూడా తెలుసు కాబట్టి ఏదొ రకంగా వీడిని తాను దారిలోనికి తెచ్చుకోవాలి. . .ఎలా. . . ఎలా . . . .అనుకొంటూ ఇంటికి బయలు దేరింది.
అఫీసులో కెళ్ళిన చారి చాలా సేపటి వరకూ మౌనంగా ఉండిపోయాడు. అతడి మౌనం చూసి మోహన కూడా మౌనంగానే ఉండిపోయింది. ఆ మౌన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మోహనకు ఇష్టమైన పంప్కిన్ పేఠా పాకెట్ ఒకటి తెప్పించి ఇచ్చాడు.
ఈ పేఠా అంటే తనకు చిన్ననాటి నుండీ పరమ ప్రీతి. అమ్మ కోసం వచ్చే విటులలో కొంత మంది ప్రత్యేకంగా తెచ్చేవారు. తనకోసం దాచి ఉంచేది అమ్మ. ఇవంటే తనకిష్టమని ఈయనకెలా తెలుసో అనుకొంటూ చిన్నపిల్లలా వాటిని కొరుక్కు తిన సాగింది.
ఆమెనే తదేకంగా చూస్తున్న చారి ఉన్నట్టుండి గుండూ . . .అన్నాడు. అది తన చిన్నప్పుడు అమ్మ తనని పిలిచే పేరు. ఇప్పుడు చారి అలా పిలవంగానే చటుక్కున తలెత్తి చూసింది.
చారి మళ్ళీ గుండూ అనిపిలవంగానే నాన్నా అంటూ పరుగెత్తుకెళ్ళి చుట్టుకొనేసింది. ఆయన వడిలో ఏం మాట్లాడాలో తెలీక బోరుమని గట్టిగా ఏడ్చేసింది. చారి ఆమె తలను నిమురుతూ గుండూ ఈ పేరు నీకు గుర్తు ఉందా అమ్మా అన్నాడు ఆయన కూడా కరిగిపోతూ. . . ఊ అంది వెక్కిళ్ళు పడుతూ చారి :- ఇంకేం గుర్తుకున్నాయో మా గుండూకి అన్నాడు ఆమెను ఓదార్చడానికన్నట్టు. వెక్కిళ్ళుపడుతూనే నన్ను మల్లీ కొత్తావంతే నీ ముక్కుకోత్తా అంది చారి నిండుగా నవ్వేస్తూ మోహనను గుండెల్లో పెట్టుకొంటూ . . .మీ అమ్మ నాతోగొడవ పడి వెళ్ళిపోయేముందు నువ్వు మాట్లాడిన చివరి మాటలివి. . .అప్పుడు మరీ చిన్నపిల్లవు . . .ఐనా బాగా గుర్తుపెట్టుకొన్నావు గుండూ. . . నాకు బుద్ది వచ్చేంత వరకూ నన్ను ముద్దు చేసిన వారందిరితోనూ ఇలానే అనే దాన్ని నాన్నా చారి :- ఎర్రబడిన ఆమె ముక్కును పట్టుకొని. . .నా తల్లే . . . . ఎంత బాగా గుర్తుపెట్టుకొన్నావే . . . దా. . . మీ అమ్మ ఆస్తులు ఏమేం చూపిస్తా అంటూ చిన్న పిల్ల చేయిని పట్టుకొన్నట్టు పట్టుకొని ఆఫీసులో తన పర్సనల్ గదికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్నా . . .ముందు ఇంట్లో ఉన్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చేట్టు చూడండి. అమ్మ అసలే నేనంటే కారంతిన్నట్టు చేస్తోంది. చారి :- లేదు గుండూ. . . . ఇప్పటికే నేను చాలా పెద్ద పెద్ద పొరబాట్లు చేసాను. మీ అమ్మ అలా మారిపోవడానికి మీ తాతయ్యే కారణం. . . . ఐనా నా చేతగాని తనం ఎంతో ఉంది. . . ఇప్పుడైనా తనకి పిండం పెట్టి తన ఆత్మకు శాంతిని కలగజేయాలి. . . నీ దారి సరిచేయాలి. . . కాబట్టి నన్ను ఆపకు అంటూ సురభి కోసం తాను చేసిన ఆస్తులన్నీ ఒక్కటొక్కటిగా చూపిస్తూ కంపెనీ లాయర్ ని పిలిచి లిస్ట్ ఇచ్చి అన్నింటినీ మోహన పేరున ట్రాన్స్ఫర్ చేయించి తీసుకురమ్మన్నాడు.
మోహనకు నోటి మాట రావడం లేదు. . . అమ్మ కోసం అప్పట్లోనే చారి చేయించిన కోట్లాది రూపాయల ఆస్తుల వివరాలన్నీ చూస్తుంటే . . .వీటినన్నింటినీ వదులుకొని ఊరు వదిలి చివరకి ఒక వేశ్యగా మారాల్సిన పరిస్థితులని కల్పించిన తాతయ్య ఎంత కౄరమైన వాడో అనిపించింది.
ఈ వివరాలన్నీ అమ్మకు తెలుసా నాన్నా చారి :- ఆ. . . . చూచాయిగా తెలుసు . . . .ఐనా తనకంటూ వాళ్ళ పుట్టింటి వైపు నుండి మంచి ఆస్తులే ఉన్నాయి గుండూ . . . . . అందువల్ల పెద్దగా పట్టించుకోదు. ఏ క్షణం లోనైనా మీ అమ్మ జాడ తెలుస్తుందో నని ప్రతిక్షణం వేచి చూసాను. అందుకే మీ అమ్మ పుట్టిన ఊళ్ళోనే కాకుండా మేము తిరిగిన ప్లేసులలో అన్నింటా కూడా మీ అమ్మను నిన్ను వెదికించే ప్రయత్న చేస్తూనే ఉన్నా. . . కాని నా దురదృష్టం చూడు మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నా కనిపెట్టలేకపోయాను. . .చివరకు మీ అమ్మను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఛ అంటూ బరస్ట్ అయిపోయాడు చారి. . ఈ సారి ఆయనను ఓదార్చే ప్రయత్నం మోహన వంతయ్యింది.