మొహం మీద పడిన పచ్చడి వల్ల మొహం అంతా మంటతో దానికి తోడు దేవతలా భావించే తన అమ్మ ఇలా దిగజారి అదీ తన ఫ్రెండ్ తో అక్రమ సంభంధం పెట్టుకోవడం భరించలేకపోతున్నాడు గగన్, అన్నీ కలగలిపి ఇలా అకారణ కోపానికి దాతి తీస్తున్నాయి.
ఇవేమీ తెలీని మోహన లోలోపలే కుళ్ళుతూ ఉంది.
మొహమైతే శుభ్రంగా కడుక్కున్నాడు గాని మంట మాత్రం తగ్గలేదు.. . .ఎర్రబారిన కళ్ళతో బయటకొచ్చిన గగన్ చూసి భయపడుతూ టవల్ ను అందించింది.
మోహన అలా భయపడుతూ వెనక్కి అడుగులేసుకొంటూ టవల్ ను అందివ్వడం గమనించి మనసు ద్రవించింది గగన్ కు.. . . మొహాన్ని టవల్ అద్దుకొంటూ తనకు తెలీకుండానే భోరుమని ఏడ్చేసాడు. .. . గగన్ మంటతో ఏడుస్తున్నాడు కాబోలనుకొని పరిగెత్తుకొని వెళ్ళి కోల్డ్ క్రీం ను తెచ్చి రాయబోతున్న ఆమెను అలానే పట్టుకొని బావురుమన్నాడు. మోహన కంగారు పడిపోయి గగన్ అలానే పొదివి పట్టుకొని కూచోబెట్టి ఏంటీ చిన్న పిల్లల్లా . . . ఈ మాత్రానికే ఏడుస్తారా . . . .అంటూ సముదాయించబోయింది. గగన్ తల అడ్డంగా తిప్పుతూ హౌస్ దగ్గర తాను చూసింది చెప్పేసాడు.
అంతా విన్న మోహనకు గొంతులో పచ్చి కషాయం నోటిలో పోసినట్లయ్యింది. . . .చాలా సేపటి వరకూ ఏమీ చెప్పలేకపోయింది.. . .ఇదంతా తన వల్లే జరిగింది. . .ఇప్పుడు గనక గగన్ కు నిజం చెప్పకపోతే . . .రేపు ఆంటీని నిలదీసినప్పుడైనా నిజం బయటకు రాక మానదు.. . .అప్పుడు సావంత్ తో తాను ఆడిన గేం ప్లాన్ కన్నా తామిద్దరి మధ్యా ఏదో ఇంకా నడుస్తున్నది గగన్ భావించవచ్చు. . .తన మీద అసహ్యం పెంచుకోవచ్చు.అది మొదటికే మోసం వస్తుంది. . .అనుకొని . . .నెమ్మదిగా ఆ విశయం నాకు తెలుసు బావా అంది నెమ్మదిగా. . .
గగన్ పిడుగుపడినట్లు అదిరిపడి లేచాడు. మోహన అతడిని సావధాన పరుస్తూ. . .అలా కంగారుపడిపోకు బావా . . నేను చెప్పేది శాంతంగా విను. . గగన్ మొహం చిట్లించుకొంటూ . . .ఇంట్లో ఇంత జరుగుతుంటే. . .చూసి చూడనట్లు ఉండి. . .ఇప్పుడు శాంతంగా ఉండమంటావా. . . మోహన: నీకు ఇంట్లో జరుగుతున్నది ఏమీ తెలీదు బావా. . . అందుకే శాంతంగా ఉండమన్నది. . . గగన్ కు కోపం తో పాటు ఆసక్తిగా కూడా అనిపించింది. . .చెప్పు అంటూ ఆమె ఎదురుగా కూచొన్నాడు.
మోహన : ఆంటీకి అంకుల్ కు మొదటి నుండీ నేనంటే ఇష్టం లేదు బావా. . .నీవు తెగించి పెళ్ళి చేసుకొనే సరికి . . .ఇద్దరుకీ ఏం చేయాలో అర్థం కాలేదు. . .ఐతే అంకుల్ నా విశయంలో మెల్ల మెల్లగా స్థిమిత పడ్డారు. . .కాని ఆంటీ మాత్రం అలా రగిలిపోతూనే ఉంది. . .అని మొదలు పెట్టి సావన్ ఇంటికి వచ్చిపోవడం మొదలు సావంత్ తనతో ఆంటీ గురించి చెప్పింది . . .మళ్ళీ తాను అదే సావంత్ తో ఆంటీ ని ఎలా డబల్ క్రాస్ చేసింది. . .దాన్ని సావంత్ అవకాశంగా వాడుకొన్నది. . . ఆ విశయమై ఆంటీ తనతో కలిసి మాట్లాడింది. . .కాంప్రమైజ్ అయ్యిందీ మొత్తం అంతా చెప్పి. .ఒక రకమైన విరక్తితో నింపాదిగా గగన్ మొహం లోకి చూసింది.
గగన్ మోహన చెప్పింది మొత్తం విని ఆశ్చర్యంతో నోరుతెరచుకొని వింటూ ఉండిపోయాడు. అదే సమయంలో మోహన గంభీరంగా ఉండిపోవడం కాస్త కలవరపెట్టింది. . .మొత్తం చెప్పేసాను . . . ఆపైన నీవు ఎలాంటి నిర్ణయమైనా తీసుకో . . .నేను సిద్దం అన్నట్టుగా కూచొంది. గగన్ ; సరే మోహనా . . . నీవు చెప్పింది నేను నమ్ముతాను. . . దాని కన్నా మునుపు నేను డాడీని కలిసి ఈ విశయం పక్కా చేసుకొన్న తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాను. . . ఒక వేళ నీవు చెప్పింది నిజమయితే . . . అప్పుడు ఏం చేయాలో నీతోనే కలిసి మాటాడుతాను. . .ఒక వేళ అబద్దమని తెలిస్తే. . .నీవు విధవా స్త్రీ గానో లేదా పాత మోహనగానో మళ్ళీ నీ బ్రతుకు బతక వచ్చు. . .అని గంట కొట్టినట్లు మాటాడి. . .రా డాడీ దగ్గరకు వెళదాం అని వెళ్ళబారారు.
వీళ్ళిద్దరూ ఆఫీసుకు వెళ్ళేసరికి చారి ఇంటికి బయలు దేరడనికి సిద్దపడుతున్నాడు. . .వీళ్ళు రావడం చూసి ఏరా. . . ఇప్పుడొచ్చారు. . .నేను ఇంటికే బయలు దేరాను. . , అంటూ ఫైళ్ళను పీ ఏ కు అప్పగించి లేచాడు.
గగన్ చారి ని ఉండమని చెబుతూ. . .నాన్నా. . .మీతో సూటిగా ఒక విశయం అడుగుతాను. . . సమాధానం చెప్పండి. . .మీకు అమ్మకు నేను ఈ మోహన ను పెళ్ళి చేసుకోవడం మొదట్లో ఇష్టం లేదు. . . ఆమె మీద కోపం ఇప్పుడూ అలానే ఉందా?
చారి గగన్ ప్రశ్నతో కాస్త కలవరపడ్డాడు. . . అర చేతులు రుద్దుకొంటూ ప్రొఫెషనల్ గా అలోచిస్తూ. . .నువ్వన్నది నిజమేరా. . .మొదట్లో మోహన అంటే మ ఇద్దరికీ ఇష్టం ఉండేది కాదు. . .. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదుగా. . . మోహన మన జీవితంలో ఒక పార్ట్ లా మారిపోయింది. . . మీ అమ్మ మాటేమో గాని నాకు మాత్రం మోహన నాకు కూతురు కన్నా ఎక్కువ. . .అందుకేగా కొన్ని విశయాల్లో నిన్నుకూడా లెక్కపెట్టడం లేదు. . .అది సరే. . .జరిగిపోయిన విశయం గురించి ఇప్పుడెందుకు ఆరా తీస్తున్నవ్. . ఇద్దరూ గొడవ పడ్డారా ?
మోహన కలగజేసుకొంటూ అవును అంకుల్ . . మీకు గగన్ కన్నా నేనంటేనే ఆప్యాయత అని అన్నా. . .దానికి మీ కొడుకు మీ దగ్గరే విశయం తేలుస్తా అని ఇక్కడకు తీసుకొచ్చాడు. . . . అసలు విశయం తెలీని చారి మోహన చెప్పింది నిజమేననుకొని . . . నాకు మీరిద్దరూ ఒక్కటేరా. . . కాకపోతే . . .మోహనకు తల్లి దండ్రులు లేరు కదా. . .సహజంగానే తనంటే కస్త ఎక్కువ సింపతీ ఉంటుంది. . . .దానికి నీవు బుర్ర చెడుపుకోవద్దు.. . .ఒక్కతే ఆడపిల్ల ఉన్న ఇళ్ళలో ఇది సహజం. ..రేపు నీకు గాని కూతురు పుడితే అప్పుడు నీకూ తెలిసి వస్తుంది. . .సరే పదండి ఇంటికెళదాం. . మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. . .అని బయలు దేరాడు.
గగన్. మీరెళ్ళండి నాన్నా మేము తరువాత వస్తాం అని ఆయన్ను సాగనంపాడు. చారి వెళ్ళిపోయిన తరువాత గగన్ మోహన చేతులు పట్టుకొని దీనంగా చూసాడు. మోహన : అప్పుడే డవున్ అవ్వద్దు బావా. . . ఇంకా మీ అమ్మగారి విశయం తేల లేదు. . .అప్పుడు కావాలంటే నీవు నిర్ణయం తీసుకోవచ్చు అంది కఠినంగా. . గగన్ కు కూడా రోషమొచ్చేసింది.. . చటుక్కున మోహన చేతులు వదిలేస్తూ. . . అహనకు ఫోన్ చేసాడు.. . .రెండు మూడు రింగుల తరువాత. . .అహన హలో అంది బొంగురు గొంతుకతో గగన్ ; అమ్మా. . మోహన అంతా చెప్పింది. . .సావంత్ విశయం నేను చూసుకొంటాను. . .ఇకపై మోహన విశయంలో. .. .నీవుఎలాంటి నిర్ణయాలు తీసుకోనని మాటివ్వగలవా ? అహన ఫోన్ లోనే గట్టిగా ఏడ్చేస్తూ. . మోహన ఇప్పుడు నాకు కన్న కూతురు కన్నా ఎక్కువరా. . . ఇంటి పరువు ప్రతిష్ఠలు అవీ ఆలోచించి . . .అలా తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పుడు నేనే నా తల మీదకు తెచ్చుకొన్నాను. . .నన్ను క్షమించరా. . .నాన్నకు విశయం తెలిస్తే. . . ఇద్దరమూ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది.
గగన్ ; అమ్మా. . . . నాన్న గురించి నీవేమీ కంగారుపడవలసిన అవసరం లేదు. . . . నీవు ఎప్పటిలా మామూలుగానే ఉండు. . .సరేనా అని ఫోన్ పెట్టేసాడు. అటు చారి మనసూ. . . ఇటు అమ్మ విశయమూ తెలిసి పోయేసరికి గగన్ . . .మోహన ముందు తలెత్తుకోలేకపోయాడు.. . .అటూ ఇటూ చూసి చటుక్కున ఆమె కాళ్ళ మీద పడిపోయాడు.
మోహన కంగారుపడిపోయింది. . . బావా ఏం చేస్తున్నావు.. . .నా కాళ్ళ మీద పడతావేంటీ అసహ్యంగా . . .లే . . . అని వెనక్కి జరిగి తనూ కిందకు కూర్చొంది. గగన్ ; లేదు మోహనా. . . నీ విశయంలో చాలా చిన్నగా అలోచించాను. . . అమ్మ గురించి ముందుగా తెలీకపోవడం వల్ల నేను ఒక వైపే అలోచించాను. . . నన్ను క్షమిస్తానంటేనే. . . . నీ కాళ్ళు వదిలేది. మోహన : ఆ క్షమించాను లే బావా. . .ముందు నాకాళ్ళు వదలూ . . . గగన్ ఆమె కాళ్ళు వదలి లేవగానే మోహన గట్టిగా వాటేసుకొని. . .బావా మనం ఒకరికొకరం వేరు కాదు బావా. . .ఇలా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపట్టుకోవాడాలూ అవీ ఉండరాదు. . . సరేనా అంది నుదుటి మీద ముద్దుపెట్టుకొంటూ. . . . ఊ అంటూ ఆమె ఒడిలో అలానే ఉండిపోయాడు.