వాడు పారిపోయిన తరువాత అదే ఆవేశంతో అహన వైపు తిరిగాడు. ఎత్తుగా ఉన్న గుండెలను అదిమిపెట్టుకొంటూ జాకెట్ హుక్సులను పెట్టుకొంటూ ఉంది. చీరంతా నలిగిపోయి ఉంది. చేతులు మణికట్లవద్దా మెడ ప్రక్కలలోనూ నడుం దగ్గర బాగా ఒత్తిడికి గురయినట్లు ఎర్రగా కమిలిపోయి చారలు కనిపిస్తున్నాయి.
గగన్ ఏంటీ పనికి మాలిన పని ఇది అని గట్టిగా అరుస్తూ ఉంటే వాడికి ఏమీ సమాధానం ఇవ్వకుండా చీర కుచ్చెళ్ళను సరి చేసుకొని వంచిన తల ఎత్తకుండా తల వంచుకొని కిందకెళ్ళిపోయింది. గగన్ కు ఆవేశంతో తల నొప్పివచ్చేసింది. ఇక నరాలు చిట్లిపోతాయేమో అనిపించి ఇక అక్కడ ఉండబట్టలేక విస విసా నడుస్తూ దిగి వచ్చి కారేసుకొని వెళ్ళిపోయాడు.
గగన్ తనూ ఇద్దరూ ఒకే కారులో రావడం ఇప్పుడు వాడు కారు తీసుకొని వెళ్ళిపోవడంతో ఒంటరిగా హౌస్ లో మిగిలిపోయింది అహన . . . వాడు వెళ్ళిపోయిన తరువాత చాలా సేపటివరకూ స్తబ్దుగా ఉండిపోయింది అహన. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి కనీసం తను ఈ లోకంలో ఉందా అనిపించేలా ఉండిపోయింది. చుట్టు ఉన్న నిశ్శబ్దంలో పక్షుల అరుపులూ చెట్ల నుండి గాలి వీచడం శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఇంతలో వాచ్ మాన్ ఫోన్ రావడంతో ఫోన్ ఎత్తి హలో అంది. అమ్మ గారూ కూలీలందరూ ఇళ్ళకెళుతున్నారు. . .రేపు ఎంత మందిని రమ్మంటారు అని అడిగాడు. నీ ఇష్టం రా. . . తూకం చూసుకొని మనుషుల్ని పెట్టు . . అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
కూలీలందరూ కీసర బాసరగా మాటాడూకొంటూ వెళుతూ ఉంటం గమనించి బయట వరండాలోనికొచ్చి . . .సాయంకాలం ఆరుబయట పంటపొలాలపై తోటలపై నుండి వచ్చే గాలి మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటే వసారాలో కూచొంది. కాని లోపల మాత్రం ఆవేశంగా వెళ్ళిపోయిన గగన్ ఏలాంటి ఉపద్రవం తెచ్చిపెడతాడో నని గుబులు గుబులుగానే ఉంది. అలా వాడికి దొరికి పోయిన తరువాత గగన్ మనసులో తనకు ఏమాత్రం విలువుంటుందో ఊహించే ప్రయత్నం చేస్తోంది. . . . దాని తరువాత చారితో తన ప్రవర్తన ఎలా ఉంటుందో. . . ఒక వేళ వాడు చారితో గనక చెబితే . . .పరిస్థితులెలా ఉంటాయో. . . ఒక వేళ చారి గనుక తనను వదిలేస్తే. . . ఇలా మనసుకు తట్టిన అలోచనలూ అనుమానాలూ అన్నీ కలగలిపి అహనను వణికించేస్తున్నాయి. ఛీ . . . దీని కంతంటికీ కారణం ఈ దరిద్రపు మోహనే . . . ఈ లంజ తో వాడికి ముందు నుండే సంభందం ఉంది గనకేనే దాని మాట విని తనను ఇలా లోబరుచుకొన్నాడు. చ ఇందులో తన తప్పూ ఉంది. . .సావంత్ ను ఇలా ఉసిగొల్పుతున్నానని చారితో ముందే చెప్పి ఉంటే బాగుండేది. . . ఈ మబ్బు మొహం వాడు. . . నా కోడలు నా కోడలంటూ తన వెంటే తిరుగుతున్నాడు. ఈ చారి గనుక అలా లేకపోయి ఉంటే తనకు ఈ గతి పట్టేదే కాదు. వీడికి లొంగిపోయేదే కాదు. .. . . ఇలా తలా తోకా లేకుండా కిందా మిందా ఆలోచిస్తోంది అహన . . .ఇంతలో. . .అమ్మ గారూ అంటూ వాచ్మాన్ వచ్చాడు. ఏంటి అన్నట్టుగా చూసింది. తల గోక్కొంటూ సమయం ఆరవుతోంది అమ్మ గారూ . . . అవునా అంటూ క్యాబ్ సర్వీస్ కు ఫోన్ చేసింది.
గగన్ చిరాకుపడుతూ . . . విసురుగా వచ్చి కారును పార్క్ చేయడం చూసింది మోహన.
తింటున్న చేయి ని కూడా మరచిపోయి పరిగెత్తుకొని వచ్చింది. మోహన అలా ఎంగిలి చేత్తో రావడం చూసి . . .కోపం నశళానికెక్కింది. అలా ఎంగిలి చేత్తో రాకపోతే చేయి కడుక్కొని రావడానికి నీకేమైనా రోగమా. . . ఛీ బండ బ్రతుకులు. . .అని ఈసడించుకొని వెళ్ళి డైనింగ్ టేబల్ మీద కూలబడ్డాడు. మోహన మ్రాన్ పడిపడిపోయింది. గగన్ అలా ఎప్పుడూ తనను ఈసడించుకోలేదు. . . .తప్పు తనదే అలా ఎంగిలి చేత్తో రావడం అనుకొని గబగబా వెళ్ళి చేతిని కడుక్కొని వచ్చి వడ్డించమంటారా అంది పళ్ళెం పెడుతూ. . . మోహన చేయి తడిగానే ఉంటం. . . నీటి చుక్కలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటే. . . ఆ చేయి తుడుచుకొని చావచ్చుగా . . . మోహన బెదిరిపోతూ గబుక్కున పక్కనున్న నాప్ కీన్ తో చేయినద్దుకొని . . .సారీ బావా . . .అంటూ ప్లేట్ లో అన్నం పప్పు నేయి అనీ ఒకే సారి వేసేసింది. ఆమె అలా గబ గబా అన్నింటినీ ఒకేసారి వేయడం. . . మరీ కోపం తెప్పించింది గగన్ కు అన్నింటినీ ప్లేట్ లో కాదే. . . . నా తల మీదేయి అన్నింటినీ ఏరుకొని తింటాను. . . . అని విసురుగా ప్లేట్ లాక్కొని కలగ పులగంగా కలుపుతూ . . . ఆ పచ్చడి కొద్దిగా వేసి చావు. . . అని అరిచాడు. ఈ రోజు ఏమయ్యింది మా బావకు ఇలా ఎగురుతున్నాడు అనుకొంటూ. . . చేయీ కాలూ ఆడక పచ్చడి మొత్తం ఒకేసారి ప్లేట్లో గుమ్మరించేసింది. మోహన వైపు గుర్రుగా చూసి తల పట్టుకొన్నాడు. మోహన నాలిక్కర్చుకొంటూ. . . సారీ బావా చూసుకోలేదు అని పచ్చడిని తీసి ఇంకో ప్లెట్ లో పెట్టి. . .పక్కనున్న పెరుగేసింది. ఆమె చేసిన పనికి నుదుటి మీద కొట్టుకొంటూ . . . ఆ ప్లేట్ ను పక్కకి తోసి అన్నంతో పక్కనున్న పచ్చడి ప్లేట్ లోకి చేయిపెట్టి పిడికిలి తో అన్నం కలపబోయాడు. హయ్యో. . . బావా. . . అని మోహన చెప్పేంతలోపే వేళ్ళ మధ్యలో నుండి పచక్ మంటూ పచ్చడి మొహం మీదకెగిరి పడింది. మొహం బగ్గు మంటూ ఉంటే గట్టిగా అరుస్తూ లేచి అదే చేత్తో మొహం కడుక్కోబోయాడు. . . బావా ఆగూ నేను కడుగుతా. . .అంటూ వెనకనే పరిగెత్తుకొని వచ్చింది మోహన. . . అప్పటికే మొహం అంతా పచ్చడి రుద్దుకొనేసి . . .మొహమంతా మంటెక్కి పోతూ ఉంటే. . .గావు కేకలు పెడుతూ బాత్ రూములో దూరాడు.
గగన్ అలా గావుకేకలు పెట్టడం చూసి మోహన భయపడిపోయింది. బితుకు బితుకుమంటూ. . .బాత్ రూము దగ్గరే తువ్వాలు పట్టుకొని నిలబడింది.