ఇద్దరూ చేయి చేయి పట్టుకొని మౌనంగా ఆ వాగులో అటూ ఇటూ తిరిగి వాగుకు పక్కనే వంగి వున్న చెట్టు నీడలో కూచొన్నారు.
ఇద్దరి మధ్యా మాటలే లేవు కాని ఒకరి మనసు ఒకరికి తెలిసిపోతోంది. స్థిరంగా పట్టుకొన్న గగన్ చేయిని మరింత గట్టిగా పట్టుకొని కూచొని అతడి తొడల మీద తలపెట్టి పడుకొంది.గగన్ తన్ చేతిని ఆమె తల మీద వేస్తూ మోహనా మనం పెళ్ళి చేసుకొందాం అన్నాడు. పక్కున నవ్వేసింది అతడి మాటలకు. . .ఎవరైనా వింటే నవ్వి పోతారు బావా గగన్:- ఏం నేనెక్కడ నీవెక్కడ. . .నేను భోగం సానిని. . .తల్లెవరో ,తండ్రేవరో తెలియని అనామకురాలిని . . .ఎక్కడ పుట్టానో. . . ఎవ్వరికి పుట్టానో . . .అసలెందుకు పుట్టానో . . .ఏవీ తెలియనిదాన్ని.. . .అంటూ అతడి తొడమీద నుంచి కాస్త ఒత్తిగిల్లి సర్దుకొంది. గగన్:- ఐతే ఏం మనసు నీకు తెలిసిపోయిందిగా అది వేరు బావా. . . నన్ను నీదానిగ జీవితాంతం ఉంచేసుకో . . .కంటికి రెప్పలా ఉంటాను.. . .అంతే కాని నాతో పెళ్ళి అనే ఆలోచన మాత్రం వద్దు. గగన్ ప్రశాంతంగా చూస్తూ. . . నీవు ఎవ్వరివో ఎక్కడ ఎవ్వరికి పుట్టావో నాకు అనవసరం . . నా కోసమే పుట్టావు. అది చాలదూ. . .ఎవరి మనసు ఎవరి కోసం ఎదురు చూస్తుందో కాని మనం మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టాం. . కాదంటావా. . . బావా మన పరిచయం ఎంతనీ మనం ఒకరి కోసం ఒకరు తహ తహ లాడడానికి . . .రెండు రోజుల క్రిందటే గా. . అంతలోనే. . .ఆపై మాటలు రాలేక గమ్మున ఉండి పోయింది. వారి సంభాషణ నామ మాత్రమేనని ఇద్దరికీ తెలిసిపోతూనే ఉంది. గగన్:- ఏం . . ఈ రెండు రోజుల్లో నాకోసం నీవు ఎంత ఎదురు చూసావో . . .నాకు తెలియదనుకొన్నావా . . .ఉదయం నన్ను చూడగానే ఎగిరి గంతేసినట్టు నా వెంట రాలా . . .నా గుండెల మీద ఏడ్వలేదూ. . . అంతెందుకు కట్టుబట్టలతో . .. నేను ఎందుకు రమ్మన్నానో ఎక్కడి రమ్మన్నానో ఒక్క మాట కూడా అడగకుండా రాలా? అవన్నీ ఎలా తెలిసాయంటావు? అతడి చేతిని మరింత దగ్గరికి లాక్కొంటూ మురిపెంగా అతడి చెక్కిళ్ళను ముద్దాడి. . బావా ఈ మానసికం నాకు మాత్రమే అనుకొన్నా. . .నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావని నేను ఊహించలేదు. . . ఐనా నేను వెలయాలిని బావా. . .ఎవరు కూడు పెడతారో వారి పంచన బ్రతకవలసిన దానిని . . నీవు ధైర్యం చెసి నన్ను మనువాడినా ఈ లోకం మన బంధాన్ని అర్థం చేసుకోదు బావా ఆమె పెదాల మీద వేలునుంచుతూ . . .మోహనా నా మనసూ నీ మనసూ ఒకే రకంగ ఆలోచిస్తునప్పుడు ఈ లోకంతో మనకు నిమిత్తం లేదు.. . అదే విధంగా నీ గతం తో నాకు పని లేదు. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోతున్న మోహన పెదాలను తన పెదాలతో మూసేసాడు. మోహన ఆ ముద్దును చాలా సేపు ఆస్వాదించింది. గగన్ తలపైకెత్తబోతూ ఉంటే మళ్ళీ తనే లాక్కొని పెదాలను అందించింది. నిండుగ ఉన్న పెదాలను ముద్దాడుతూ ఆమె బుగ్గలను నుదుటిని ముద్దులతో నింపేసాడు. కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతుంటే అతడి మెడ మీద చేతులేసి . . .మరి మధ్యలో నన్ను వదిలేసి వెళ్లవుగా బావా అంది. గగన్:- నీవు వదులుకోగలవా అమ్మో నిన్ను వదులుకోవడం అంటే నా ప్రాణాన్ని వదులుకోవడమే . . గగన్:- నేనూ అంతేగా . . . మరి మీ అమ్మా నాన్నల మాటేంటి. . .నీ మీద ఎన్నో ఆశలుపెట్టుకొనుంటారుగా. . అమ్మతో ఇబ్బందేం లేదు. . .నాన్నతోనే కొంత ఇబ్బంది. . .అ ఇబ్బందులేవో పడతాను గాని. . .నాకు ఓ మాట చెబుతా మోహనా అడుగు బావా గగన్:- మనల్ని ఇలా ఏ బందం కలిపి ఉంటుందంటావ్? ఇలా రా అని అతడి తలను దగ్గరికి తీసుకొని మీ భాషలో ప్రేమ అంటారు అని అతడి రెండు చెక్కిళ్ళను పట్టుకొని పిండింది. గగన్:- మరి మీ భాషలో . . . అని మోహన ముక్కు పిండాడు. పిచ్చి అంటారు అని లేచి అతడి గడ్డం కొరికింది. అలా ఇద్దరూ తుళ్ళుతూ నవ్వుకొంటూ చాలా సేపు గడిపేసారు.మధ్యాహ్న సమయానికి మోహనకు ఆకలి గుర్తుకొచ్చింది. ఒళ్ళంతా తడిపేసుకొంటూ నీళ్ళలో గగన్ తో పాటు ఆడుతూ పాడుతూ ఉన్న మోహన చటుక్కున నిలబడిపోతూ ఆకలేస్తోంది బావా అంది. గగన్ కూడా అప్పటికే బాగా అలసిపోయాడు.సరే పదా అని ఉదయం వెళ్ళిన రిసార్ట్ కే బండిని తిప్పాడు. ఆమెకు ఫుడ్ ఆర్డర్ చేసి క్యాష్ కౌంటరులోని అమ్మాయి దగ్గరికెళ్ళి చాలా సేపు ఏదో మాట్లాడి వచ్చాడు. గగన్ టేబల్ దగ్గరికొచ్చేసరికి టేబల్ మొత్తం రకరకాల ఫుడ్ ఐటం లతో నింపేసుంది. వాటన్నిటినీ శుభ్రంగా లాగించేస్తూ తిను బావా అంది. గగన్ కూడా ఏమాత్రం మొహమాటపడకుండా మోహనతో పాటుగా తనూ వాటి మీద దాడి చేసి ఇద్దరూ ఓ పట్టు పట్టారు. కడుపారా ఫుడ్ లాగించేసి తనకు అలాట్ చేసిన సూట్లోనికి మోహనను తీసుకెళ్ళాడు. అప్పటికే క్యాష్ కౌంటరులోని అమ్మాయి మోహన కోసం ఓ నాలుగు జతల బట్తలు లోదుస్తులు రూములోనికి చేర్పించింది. . . . వాటిని చూడగానే . . .ఓ. . . ఇందాక ఆ అమ్మాయితో నా బట్టలకోసం మాటాడావా అంటూ అంటూ వాటిని మ్యాచింగ్ చూసుకోసాగింది. గగన్:- సరే కాసేపు పడుకో సాయంత్రం నీకో చోటు చూపిస్తా అని నడుం వాల్చాడు.. . మ్యచింగ్ చూస్తున్నదల్లా.. .వాటిని పక్కన పడేసి గగన్ దుప్పట్లో దూరి అతడి రెండు చేతులనూ తన మీద లాక్కొని పడుకొంది. ఆమె చర్యకు నవ్వుకొని ఇంకా దగ్గరగా పొదివి పట్టుకొని కళ్ళుమూసుకొన్నాడు. రూములోని ఏసీ చల్లగ పరచుకొంటూ ఉంటే ఇద్దరూ హయిగా లోకం మరచి చిన్న పిల్లలా అదమరచి నిదురపోయారు.. సాయంత్రం ఏడవుతుండగా మోహన కళ్ళు తెరచి చూసే సరికి ఎదురుగా కళ్ళ నీళ్ళతో గగన్ ఆమెనే చూస్తున్నాడు. మోహన గాబర పడిపోయింది. గబాలున మోకాళ్ళ లేచి ఏమయ్యింది బావా అoటూ దగ్గర కొచ్చింది. గగన్ కు నోటమాట రావడంలేదు. గట్టిగా ఏడ్చేస్తూ ఆమెను వాటేసుకొన్నాడు. గువ్వపిల్లలా ఒదిగిపోతూ ఎందుకేడుస్తున్నాడో అర్థం కాక తనూ ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమె కన్నీటి బొట్లు తన చేతిని తాక గానే గగన్ కు విచక్షణ గుర్తుకొచ్చి బలవంతాన ఏడుపు ఆపుకొంటూ ఏయ్ నువ్వెందుకు ఏడుస్తున్నావే అంటూ ఆమె చెంపలను తుడిచాడు. తెలీదు బావా నీవెడిస్తే నాకూ ఏడుపొచ్చేసింది అంది. ఆమె జబ్బలను లాగి చూపిస్తూ ఈ కాలిన మచ్చలేంటీ? నిద్దట్లో ఒద్దండీ ఒద్దండీ మీ కాళ్ళు మొక్కుతా అంటూ నీ కలవరింతలేమిటీ . . వాటిని చూదగానే నాకు దుఖఁ ఆగలేదు. అసలెందుకలా కలవరిస్తున్నావు? నీవు నొచ్చుకోనంటే చెబుతా బావా గగన్:- లేదు చెప్పు ప్రతీ నెలా రేషను కోసం మా ముసల్ది నన్ను ఊరి పెద్దింటికి పంపుతుంది. అ ముసలోడికి నన్ను చూస్తే మహ కచ్చి . . .ఆ కచ్చితోనే ఇలా సిగరెట్లతో కాల్చి గాని రేషను ఇవ్వడు. గగన్:- అంటే ప్రతీ నెల కూదా ఇలా అవును బావా. . .ప్రతీ నెలా కూడా ఇలా ఒళ్ళు కాల్పించుకొంటేనే అన్నం. . ఇదే కాదు. . .ఇదిగో తొడల మీద కూడా అంటూ లంగా ఎత్తబోయింది. చూడలేక కళ్ళు మూసుకొని ఆమె లంగాను కిందకు లాగేసాడు.