నిజం గా నేను అంటే అంత ఇష్టమా 4

వినీత చెప్పింది విని విక్కి ప్రకాష్ వైపు దీనంగా చూశాడు “ఎమ్ అయింది” అని అడిగాడు ప్రకాష్ పూజా నీ రేపు కోర్టు కీ తీసుకువెళ్లుతున్నారు అన్న విషయం చెప్పాడు దానికి ప్రకాష్ విక్కి బుజం మీద చెయ్యి వేసి “నేను చేసుకుంటా పూజా తరుపున నేను కేసు వాదిస్తాను” అని చెప్పాడు ప్రకాష్ అప్పుడు తెలిసింది ప్రకాష్ లాయర్ అని విక్కి కీ కానీ రాయుడు తరపున ఉన్న లాయర్ మామూలు వాడు కాదు ఇండియా లోనే టాప్ 5 లాయర్స లో ఒక్కడు అంతేకాకుండా ప్రకాష్ కీ గురువు దాంతో ఆ కేసు కొంచెం సిరియస్ టాపిక్ అయింది టౌన్ లో ఆ మరుసటి రోజు నిఖిల్, విక్కి, ప్రకాష్ ముగ్గురు కోర్టు కీ వెళ్లారు. అప్పుడే పూజా నీ ambulance లో తీసుకొని వచ్చారు పోలీస్ లు నిఖిల్ నీ చూడగానే బాధ తో వెళ్లి కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టింది పూజా ఒక కానిస్టేబుల్ వచ్చి పూజా నీ పక్కకు లాగా బొతే రాజు వచ్చి అప్పాడు “కోర్టు మొదలు ఆవడానికి ఇంకా 10 నిమిషాల టైమ్ ఉంది అందరూ టీ తాగి రండి నేను ఇక్కడ ఉంటా” అని అందరినీ పంపించి పూజా అందరి తో మాట్లాడడానికి టైమ్ ఇచ్చాడు రాజు దాంతో మొదటిసారి విక్కి రాజు వైపు చూసి సెల్యూట్ చేశాడు దానికి రాజు కూడా రివర్స్ లో సెల్యూట్ చేశాడు అలా వాళ్లు అంతా మాట్లాడుతూ ఉండగా ఒక 4 రేంజ్ రోవర్ కార్ ల మధ్య లో ఒక బెంజ్ కార్ లో కోర్టు కీ వచ్చారు రాయుడు, షర్మిల.

వాళ్లతో పాటు కార్ దిగాడు లాయర్ P.S. శర్మ అతని చూడగానే మొత్తం కోర్టు లో ఉన్న లాయర్ లు అంతా ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు కానీ ప్రకాష్ మాత్రం పొగరు గా నిలబడి ఉన్నాడు తరువాత అందరూ కోర్టు లోపలికి వెళ్లారు పూజా నీ బోను లో ఉంచారు, శర్మ లేచి జడ్జ్ గారికి నమస్కరించి

“your honor పూజా అనే ఈ అమ్మాయి తన కాబోయే భర్త మరియు” RR&CO” కంపెనీ ceo అయిన ప్రమోద్ రాయుడు నీ అతి కిరాతకంగా చంపినట్టు పోలీస్ లు నిర్ధారించారు అంతే కాకుండా సంఘటనా స్థలంలో హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి మీద మిస్ పూజా వెళ్లి ముద్రలు ఉన్నాయి అని forensic రిపోర్ట్ లో కూడా నిర్ధారణ అయింది ” అని చెప్పాడు దానికి ప్రకాష్ ఆవేశం గా లేచి

” I abject your honor అసలు సంఘటన జరిగిన రోజు రాత్రి నా క్లయింట్ పూజా అసలు పోర్ట్ వైపు కానీ వెళ్లలేదు అంతకంటే ముఖ్యం అయినది ఈ హత్య జరగడానికి ముందు తను పెళ్ళి నుంచి అపహరించబడింది కాబట్టి ఇది అంత అమాయకురాలు అయిన నా క్లయింట్ మీద తప్పుడు ఆరోపణలు వేయాలి అని చూస్తున్నారు “అని చెప్పాడు

అంతా వినాక శర్మ లేచి” my lord నేను పూజా నీ cross examine చేయడానికి పర్మిషన్ కోరుతున్నా “అని అడిగాడు జడ్జ్ గారు పర్మిషన్ ఇచ్చారు దాంతో శర్మ పూజా బోను వైపు వెళ్లి ఇలా అడగడం మొదలు పెట్టాడు

శర్మ : మిస్ పూజా మీరు ఎక్కడ ఏమి చదువుకున్నారు

పూజా : MA English literature హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో psychology కూడా చేశాను

శర్మ : మీరు 6 నెలల ముందు అజయ్ అనే అతని పెళ్లి చేసుకోవాలి కానీ ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు

దానికి ప్రకాష్ లేచి “I abject my lord కేసు గురించి కాకుండా ప్రాసిక్యూషన్ గారు నా క్లయింట్ పర్సనల్ వివరాలు అడిగి మానసికంగా బాధిస్తున్నారు” అని అన్నాడు జడ్జ్ కూడా ప్రకాష్ మాట తో ఏకీభవించి “శర్మ గారు మీరు ఎందుకని ఆమె పర్సనల్ వివరాలు అడిగుతున్నారో తెలుసుకోవచ్చా” అని అడిగారు దానికి శర్మ” my lord 6 నెలల క్రితం గాడం గా ప్రేమించిన వ్యక్తి తో engagement చేసుకొని అతను చనిపోవడంతో ఇంకొకరిన్ని పెళ్లి చేసుకోవడం లో తప్పు లేదు కానీ అతని కంటే డబ్బు ఉన్న వాడు దొరకడం తో అలా ఎలా అంత తొందరగా పెళ్లి కీ రెడీ అవుతారు “అని ఎదురు ప్రశ్న వేశాడు

అప్పుడు విక్కి లేచి “అజయ్ చనిపోవడంతో ఈ పెళ్లి జరగడం లేదు అజయ్ నీ కావాలి అని చంపి ఈ పెళ్లి చేసుకోవాలి అని చూశారు “అని చెప్పాడు దాంతో శర్మ జడ్జ్ తో అందరూ విక్కి వైపు చూశారు జడ్జ్ గారు విక్కి నీ బోను లోకి వచ్చి మాట్లాడమని చెప్పారు దాంతో విక్కి బోను లోకి వెళ్లాడు “సార్ ప్రమోద్ నీ చంపింది అక్కడ ఉన్న లాయర్ ప్రకాష్ చెల్లి తార కానీ తను ఇప్పుడు ప్రాణల తో లేదు “అని చెప్పాడు దానికి శర్మ పెద్దగా నవ్వుతూ విక్కి వైపు వచ్చి “చూడండి my lord ఇతను చెప్పేది ముందు అజయ్ నీ చంపి ఈ పెళ్లి కీ పూజా నీ ఒప్పించారు అన్నాడు ఇప్పుడు పాపం చనిపోయిన వాళ్ల మీద నిందలు వేస్తున్నారు ఒక నిమిషం మీరు జర్నలిస్ట్ విక్రమ్ కదా ప్రెసిడెంట్ అవార్డు విన్నర్” అని అడిగాడు దానికి విక్కి అవును అన్నట్లు తల ఊపాడు.

” చూడండి my lord తన ఫ్రెండ్ నీ కాపాడుకోవడానికి తన వృత్తి ప్రతిభ తో ఒక కట్టు కథ అలీ కేసు నీ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఇంతకన్నా వేరే ఆదరం అక్కర్లేదు పొంతన లేని వీల మాటలకు కరిగిపొకుండా వెంటనే శిక్ష వేయండి” అని చెప్పాడు అంతే వెంటనే విక్కి “సార్ please సార్ మా దెగ్గర నిజాలు ఉన్న కూడా నిరూపించడానికి ఆధారాలు లేవు కాబట్టి మాకు కొంచెం టైమ్ ఇవ్వండి please సార్ please please “అని బ్రతిమాలాడు దాంతో జడ్జ్ కొంచెం కరుణించీ ఒక వారం రోజుల్లో సాక్ష్యాలూ కోర్టు కీ అప్ప చెప్పాలి” అని అజ్ఞా పించారు అప్పటి వరకు పూజా నీ పోలీస్ ల సమక్షంలోనే ఉంచి ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పారు.

దాంతో విక్కి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు కానీ వారం లో సాక్ష్యాలూ ఎలా సంపాదించాలి అని ఆలోచనలో పడ్డాడు

హాస్పిటల్ కీ తీసుకు వెళ్లుతున్న పూజా ఒకసారి వెళ్లి విక్కి నీ గట్టిగా కౌగిలించుకుంది, “థాంక్స్ రా తోడబుట్టిన తమ్ముడు ఏమీ చేయలేని నిస్సహాయత లో ఉన్నాడు ప్రేమించిన అబ్బాయి నను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నావు ఈ రోజు నిజంగా స్నేహనీకి రూపం ఉంటే అది నువ్వే అని నమ్ముతున్నా” అని ఏడుస్తు చెప్పింది పూజా, తరువాత కళ్లు తుడుచుకొని” రేయి నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా నను ఆ రోజు కిడ్నాప్ చేసింది ఒక మనిషి బాగా లావుగా ఉన్నాడు, అతని అరచేతి మీద ఒక tattoo ఉంది అది red skull అది అతని కుడి అరచేతి మీద ఉంది”అని చెప్పింది తరువాత పోలీస్ లు వచ్చి పూజా నీ తీసుకు వెళ్లారు. అప్పుడు రాయుడు, షర్మిల ఇద్దరు విక్కి దగ్గరికీ వచ్చి” బాబు నువు పెద్ద జర్నలిస్ట్ వీ నీకు నేను పెద్ద ఫ్యాన్ నీ కూడా కానీ నువ్వు నీ heroism ఎక్కడైనా చూపించుకో కానీ ఇది మా కోట ఇక్కడ నువు మా పర్మిట్ లేకుండా చిన్న గడ్డిపోచ కూడా పీకలేవు” అని బెదిరింపు గా చెప్పాడు రాయుడు, తరువాత షర్మిల తన హ్యాండ్ బాగ్ నుంచి ఫ్లయిట్ టికెట్ తీసి విక్కి కీ ఇచ్చింది” ఇదిగో రేపు ఉదయం 6 గంటలకు ఫ్లయిట్ మళ్లీ వైజాగ్ లో అడుగు పెట్టడానికి ధైర్యం చేయొద్దు రేపు 6 గంటల తరువాత నువ్వు వైజాగ్ లో కనిపిస్తే శ్రీధర్ ఎన్కౌంటర్ ఆర్డర్ తో రెడీ గా ఉన్నాడు 6:30 కీ పోర్ట్ లో సౌరచేపలకు టిఫిన్ అయిపోతావు” అని వార్నింగ్ ఇచ్చింది, తరువాత శ్రీధర్ కూడా తన గన్ తో బెదిరింపు గా విక్కి వైపు చూపించాడు, అప్పుడు రాజు వచ్చి” సార్ please సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి మీరు ఊరి నుంచి వెళ్లితే పూజా నీ బయటకు తేస్తారు అని మేడమ్ చెప్పారు”అని వెళ్లిపోయాడు రాజు.

కానీ విక్కి చెవులకు ఎక్కలేదు తన ఆలోచన మొత్తం ఆ Red skull tattoo చుట్టూ తిరుగుతుంది తను ఆ tattoo నీ ఎక్కడో చూశాడు ఈ మధ్య నే అలాంటి tattoo చూశాడు విక్కి అప్పుడు గుర్తుకు వచ్చింది విక్కి కీ వెంటనే నిఖిల్, ప్రకాష్, వినీత నీ తీసుకొని బయలుదేరాడు అప్పుడే పెద్ద గాలి వాన పడుతున్నటు ఒకటే గాలి అప్పుడు ప్రకాష్ అడిగాడు “ఏంటి విక్కి ఏమీ జరిగింది అసలు ఎక్కడికి వెళ్లుతున్నావ్” అని అడిగాడు “సలీం భాయ్ బార్ కీ farewell పార్టీ చేసుకుందాం” అని కొంచెం పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూన్నాడు, అప్పుడు కార్ నీ సలీం బార్ దెగ్గర అప్పాడు వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ సలీం భాయ్ లేడు అక్కడ పని చేస్తున్న ఒక పిల్లాడిని అడిగాడు” వర్షం పడితే భాయ్ లైట్ హౌస్ లో కూర్చుని మందు వేస్తాడు “అని చెప్పాడు

అంతే అందరూ లైట్ హౌస్ వైపు పరిగెత్తారు కానీ అక్కడ సలీం లేడు అప్పుడు అవతలి ఒడ్డు దెగ్గర ఇంకో లైట్ హౌస్ కనిపించడం తో వాళ్లు ఒక స్పీడ్ బోట్స్ తో అక్కడికి వెళ్లారు పైకి ఏకుతుంటే అందరూ విక్కి నీ అడిగారు అసలు ఏమీ జరిగింది అని” పూజా ఒక red skull tattoo చూశాను అని చెప్పింది కదా అది సలీం చేతి మీద నిన్న రాత్రి చూశాను” అని చెప్పాడు అంతే వాళ్లు టాప్ ఫ్లోర్ కీ వెళ్లే సరికి సలీం ఒక కాంబాట్ గన్ తో కాలుపులు మొదలు పెట్టాడు కానీ అప్పటికే వినీత తన గన్ తో సలీం చేతి మీద కాల్చింది దాంతో సలీం గన్ కింద పడేశాడు.

అప్పుడు వినీత సలీం తల కీ గన్ ఎక్కు పెట్టి నిలబడి ఉండగా విక్కి అడగడం మొద్దలు పెట్టాడు “అసలు పూజా నీ ఎందుకు కిడ్నాప్ చేశావ్ ఎవరూ చేయమన్నారు” అని అడిగాడు దానికి సలీం కొంచెం ఓపిక తెచ్చుకోన్ని చెప్పడం మొదలు పెట్టాడు “నాకూ డీల్ ఇచ్చింది షర్మిల అంతకు ముందు కూడా రమేష్ భార్య నీ చంపినది నేనే ఇప్పుడు పూజా నీ కూడా చంపడానికి కిడ్నాప్ చేయలేదు, పూజా నీ జాగ్రత్తగా దాచడానికి అలా చేయమని నాకూ ఒకడు చెప్పాడు పూజా నీ చంపవద్దని చెప్పాడు” అని అలా చెప్తూ తన ఇంకో చేత్తో పక్కన ఉన్న గన్ తీసుకోబోతుంటే అప్పుడు ముందు నుంచి గన్ పేలిన శబ్దం వచ్చింది అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి సలీం గుండెల్లో దిగింది ఎవరూ కాల్చింది అని అందరూ వెనకు చూస్తే రాజు ఉన్నాడు.

రాజు కంగారు గా వచ్చి” ఎవరికి ఏమీ కాలేదు కదా అయిన అంతా అజాగ్రత్తగా ఉంటే ఎలా వాడు గన్ తో కాల్చే వాడు” అని కొద్దిగా కంగారు గా చెప్పాడు “అసలు నువ్వు ఇక్కడ ఏమీ చేస్తున్నావ్” అని అడిగింది వినీత “ఎవరో నలుగురు వాళ్ల బోట్స్ ఎత్తుకొని వచ్చారు అని బార్ కీ వచ్చిన నాకూ అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తే ఇలా వచ్చాను “అని చెప్పాడు” ఉన్న ఒక clue కూడా పోయింది” అని విక్కి కోపంతో ఊగి పోతున్నాడు అప్పుడే రాజు ఫోర్స్ కోసం ఫోన్ చేయడానికి పక్కకు వెళ్లాడు అప్పుడు సలీం చేతి కింద ఏదో రాసి ఉంది ఏంటి అని ప్రకాష్ వెళ్లి చూశాడు ” షర్మిల బెడ్ రూమ్ “అని రాసి ఉంది

సలీం భాయ్ చనిపోయే ముందు రాసిన దాని చదివిన ప్రకాష్ అది ఎవరికీ కనిపించకుండా, సలీం భాయ్ చేతితో ఆ రాసినది మొత్తం చెరిపేసాడు తర్వాత విక్కి నీ పక్కకు పిలిచి జరిగింది చెప్పాడు “నేను వెళ్ళి పూజా తో హాస్పిటల్ లో ఉంటానూ నువ్వు నిఖిల్ ఇద్దరు వెళ్లి అది ఏంటో చూడండి” అని వినీత నీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు,విక్కి నిఖిల్ ఇద్దరు అరకు కీ వెళ్లారు ఆ తర్వాత “RR పాలెస్” కీ చేరుకున్నారు మెల్లగ సెక్యూరిటీ వాళ్లకు కనిపించకుండా లోపలికి వెళ్లారు అప్పుడు షర్మిల dinning hall లో భోజనం చేస్తోంది ఒంటరిగా దాంతో నిఖిల్ నీ అక్కడే ఉండి ఏమైనా తేడా వస్తే సిగ్నల్ ఇవ్వు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. షర్మిల బెడ్ రూమ్ లోకి వెళ్లిన విక్కి అల్మారా, లాకర్ అని వేతికాడు కానీ ఏమీ దొరకలేదు అప్పుడు అల్మారా పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడుతుంటే వెళ్లి పట్టుకున్నాడు కానీ అప్పుడే బెడ్ కీ ఒక లాకర్ కనిపించింది విక్కి కీ వెంటనే దాని తేవడానికి ట్రై చేసాడు కానీ దానికి password అడుగుతుంది దాంతో విక్కి బాగా ఆలోచించడం మొదలు పెట్టాడు నాలుగు డిజిట్ నెంబర్ ఏమీ అయి ఉంటుంది అని, అప్పుడు తట్టింది 1951 ఎందుకు అంటే ఆ నెంబర్ తో ఇంట్లో నాలుగు కార్ల్ ఉన్నాయి, ఆ నెంబర్ తో షర్మిల మేడ లో ఒక చైన్ ఉంది కాబట్టి అదే నెంబర్ ట్రై చేశాడు అది తెరుచుకుంది దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి అని తెరిచి చూస్తే అది ఒక బ్లాక్ స్క్రాప్ మాఫియా కీ సంబంధించిన అగ్రిమెంట్, అంతేకాకుండా డ్రగ్స్, weapons స్మగ్లింగ్ కీ సంబంధించిన అని వివరాలు అక్కడ ఉన్నాయి.

అప్పుడే అక్కడ విక్కి కీ రమేష్ పెళ్లి ఫోటో దొరికింది అది చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అది తన కొలీగ్ “కిరణ్మయి” 1 సంవత్సరం క్రితం ఏదో assignment మీద వెళ్లుతున్నా అని చెప్పి మాయం అయింది ఇప్పుడు ఇలా చూసి షాక్ అయ్యాడు విక్కి, అప్పుడు ఒక చిన్న clarity వచ్చింది విక్కి కీ “ఈ ఫ్యామిలీ అసలు కథ బయటకు తీసుకురావడానికి రమేష్ నీ పెళ్ళి చేసుకుని ఇక్కడ ఆధారాలు కోసం వేత్తకడం మొదలు పెట్టింది” అని అర్థం అయింది విక్కి కీ కానీ అప్పుడే ఆ లాకర్ లో ఒక డైరీ కనిపించింది.

దాని తెరిచి చదవడం మొదలు పెట్టాడు “నా పేరు వెంకట్ మా నాన్న బ్రిటిష్ వాళ్ల దగ్గరి నుంచి గిఫ్ట్ గా వచ్చిన ఒక షిప్ లో ఉన్న ఇనుము మొత్తం స్క్రాప్ చేసి దాంతో వచ్చిన డబ్బు తో Import & Export బిజినెస్ మొదలు పెట్టి దాంట్లో కోట్లు సంపాదించి అరకు లో పెద్ద పాలెస్ కట్టాడు నను లండన్ లో చదివించాడు అక్కడ చదువు అయిపోగానే అరకు వచ్చాను అప్పుడు చూశాను అరుణ నీ మా పనిమనిషి రంగమ్మ కూతురు లండన్ లో 10 సంవత్సరాలు ఉన్న కూడా అంత అందాని చూడలేదు అనుభవించలేదు కానీ దీని నా సొంతం చేసుకోవాలి అనుకున్న అలా దాని ప్రేమ పేరుతో దెగ్గర అయి నా కోరిక తీర్చుకున్నా కానీ అది నా వెంట పడుతుంది అని తెలుసు అందుకే దానికి మాయ మాటలు చెప్పి బాంబే లో నా ఫ్రెండ్ దగ్గరికి పంపించా తరువాత నా మామ కూతురు నీ పెళ్ళి చేసుకుని నా బాబు నీ అడ్డుతప్పించు మొత్తం బిజినెస్ లు స్వాధీనం చేసుకున్న కానీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అరుణ మళ్లీ వచ్చింది కానీ ఈ సారి ఒక కొడుకు నీ తీసుకొని వచ్చింది దాంతో నేను దాని మళ్లీ నమ్మించి ఒక రోజు నా గెస్ట్ హౌస్ లో ఉంచాను “అక్కడి దాకా మాత్రమే ఆ డైరీ లో రాసి ఉంది విక్కి మిగిలిన దాని కోసం మొత్తం డైరీ వెతికాడు అప్పుడే నిఖిల్ నీ కొట్టుకుంటూ లోపలికి వచ్చారు సెక్యూరిటీ వాలు.

అప్పుడు షర్మిల గన్ తీసుకొని విక్కి తల పైన పెట్టింది

విక్కి తల మీద గన్ పెట్టిన షర్మిల మెల్లగ పైకి లేపింది “తిన్న గా ఫ్లయిట్ ఎక్కి ముంబాయి వెళ్లకుండా అనవసరంగా ఇక్కడికి వచ్చి నీకు అనవసరం లేని విషయంలో వేళ్లు పెట్టి చనిపోతున్నావు సగం తెలుసుకున్న నువ్వు ఎమ్ చస్తావు కానీ మొత్తం చెప్త విను ఆ రోజు అరుణ వచ్చిన తర్వాత మా బావ దాని మా గెస్ట్ హౌస్ కీ పంపి దాని చంపాలి అని ప్లాన్ చేశాడు, అందుకే నా మాజీ ప్రియుడు సలీం తో దాని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్ మొత్తం తగులబెట్టి దాని, దాని కొడుకు నీ ఇద్దరిని సాక్ష్యం లేకుండా షాక్ సర్క్యూట్ వల్ల చనిపోయారు అని నీరుపిదాం అనుకుంటే ఆ ఇన్స్పెక్టర్ సలీం తో నిజం చెప్పేలా కొట్టాడు ఆ తర్వాత మా బావ ఆ ఇనస్పెక్టర్ నీ చంపి అది సలీం మీద వేసి శ్రీధర్ సలీం నీ పట్టుకున్నట్లు అందరినీ నమ్మించి శ్రీధర్ నీ మా ఇంటికి కాపలా కుక్క నీ చేసుకున్నాం కానీ సలీం తో మాకు పనులు ఉన్నాయి అని వాడిని ఆ మరుసటి రోజే బయటికి తెచ్చాము ” అని చెప్పింది. మళ్లీ కిరణ్మయి, రమేష్ ఫోటో లాకుని” ఈ పిల్ల నీ కూడా చంపాలిసి వచ్చింది ఇది నా కొడుకు నీ ప్రేమించా అన్నపుడే డౌట్ వచ్చింది నా పెద్ద కొడుకు లాంటి బియ్యం బస్తాగాడ్డిని ఎవరూ చేసుకుంటారు అనుకున్న కానీ ఇది చేసుకోగానే అర్థం అయింది ఇది ఎవరో మా ఫ్యామిలీ మీద ఎంక్వయిరీ కీ వచ్చింది అని అందుకే చంపేసాం” అని చేసిన పాపాలు అని ఒకేసారి చెప్పింది తను అలా చెప్పడం పూర్తి కాగానే వెనుక నుంచి ఒక గన్ సౌండ్ అలా ఒక బుల్లెట్ వచ్చి షర్మిల చేతికి తగిలి ఆమె చేతిలో ఉన్న గన్ కింద పడుతుంటే విక్కి దాని పట్టుకొని ఎదురుగ్గా ఉన్న సెక్యూరిటీ లో ఒక్కడిని కాల్చేసాడు ఇంకొకడిని వాడి వెనుక ఉన్న వినీత కాల్చేసింది.

తరువాత విక్కి షర్మిల తల మీద ఒకటి గన్ తో కొట్టగానే ఆమె స్పృహ కోల్పోయింది అప్పుడు వినీత పరిగెత్తుతూ వచ్చి విక్కి నీ కౌగిలించుకుంది తరువాత ఇద్దరి పెద్దాలు కూడా అతుకుపొయాయి ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంతోషం లో ఉండగా అప్పుడు నిఖిల్ లేచాడు విక్కి నిఖిల్ నీ చూసి బాగున్నావా అని అడిగాడు అవును అన్నట్లు తల ఉప్పాడు “రేయి ఇప్పుడు ఎమ్ చేద్దాం” అని అడిగింది వినీత “ఇప్పుడు మొత్తం అని ఆధారాలు ఎమ్ చేద్దాం నేను ఏమో సస్పెండ్ లో ఉన్న ఎలాగా” అని అడిగింది “మరి అయితే ఇప్పుడు పోలీసులో మనం నమ్మగలిగేది ఆ రాజు మాత్రమే కాబట్టి రాజు కీ మొత్తం ఇస్తే మనకు హెల్ప్ అవుతాడు” అని చెప్పాడు నిఖిల్, కానీ వినీత మాత్రం డౌట్ తో చూస్తూ “వద్దు రాజు అమాయకుడు శ్రీధర్ బయటపడి మొత్తం పాడుచేసే ఛాన్స్ ఉంది అందుకే మనం సిబిఐ లో ఉన్న నా ఫ్రెండ్ కీ ఇద్దాం వాలే చూసుకుంటారు” అని చెప్పింది వినీత.

వినీత చెప్పిన దానికి ఇద్దరూ సరే అన్నారు మరుసటి రోజు వరకు షర్మిల నీ బెడ్ కీ కటేసారు వెంకట రాయుడు మాత్రం ఇంకా ఇంటికి రాలేదు ఆ తరువాత రోజు వినీత ఫ్రెండ్ వచ్చి షర్మిల నీ అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, తరువాత కోర్టు లో సాక్ష్యాలూ ఇచ్చి పూజా నీ రిలీస్ చెప్పించారు ఆ మరుసటి రోజున పూజా నీ రిలీస్ చేస్తున్నారు అని విక్కి స్టేషన్ కీ వెళ్లాడు అప్పుడు పూజా అమాంతం వచ్చి విక్కి నీ కౌగిలించుకుంది “థాంక్స్ రా థాంక్స్” అని చెప్పింది ఆ తర్వాత పూజా విక్కి నీ తీసుకొని పక్కకు వెళ్లింది “విక్కి నీకు ఒక విషయం చెప్పాలి” అని మొదలు పెట్టింది అప్పుడే రాజు అట్టు వైపు వెళ్లాడు.

“నిన్న మధ్యాహ్నం నా రిపోర్ట్స్ వచ్చాయి దాంట్లో నేను ఇప్పుడు pregnant అని తెలిసింది” అని కళ్లలో నీళ్లు తుడుచుకొని చెప్పింది ఇది విన్న రాజు తన చేతిలో ఉన్న కాఫీ ట్రే నీ పడేశాడు మెల్లగ పక్కకు తప్పుకున్నాడు, అప్పుడే ప్రకాష్ ఫోన్ చేశాడు విక్కి కీ

విక్కి : హా ప్రకాష్ ఎక్కడ ఉన్నారు మీరు

ప్రకాష్ : విక్కి నాకూ నువ్వు ఇచ్చిన proofs నీ మళ్లీ ఒకసారి బాగా చెక్ చేశాను కానీ మనకు తెలియని ఇంకో విషయం ఉంది

విక్కి : ఏంటి ప్రకాష్ అది

ప్రకాష్ : ఆ రోజు సలీం కాల్చిన బిల్డింగ్ లో షర్మిల చెప్పినట్టు అయితే మనకు రెండు బాడి ల post-mortem రిపోర్ట్ వచ్చి ఉండాలి కానీ ఇక్కడ ఒక్కటే ఉంది అంటే ఆ బాబు బ్రతికే ఉండి ఉంటాడు అని మళ్ళీ చెక్ చేశా

విక్కి : అయితే ఇప్పుడు ఆ బాబు ఉన్నాడా లేడా

ప్రకాష్ : షర్మిల చేసిన ద్రోహం తట్టుకోలేక సలీం వాళ్లను చంపాలి అనుకున్నాడు కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితి అందుకే రాయుడు ఫ్యామిలీ లోనే రాయుడు నీ చంపడానికి ఒక ఆయుధం తయారు చేశాడు సలీం

విక్కి : ఏంటి ఏదో ఏదో చెప్తున్నావ్ అసలు విషయం చెప్పు

ప్రకాష్ : సలీం ఆ పిల్లడి నీ చంపలేదు ఒక అనాధాశ్రమం లో చేర్పించాడు వాడికి guardian అయ్యాడు ఆ కుర్రాడు బాగా చదివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యి సలీం కీ క్లోజ్ అయిన ఒక మినిస్టర్ చేత్తో అరకు లోనే పోస్టింగ్ తెచ్చుకున్నాడు అతనే రాజు

అలా ఫోన్ లో మాట్లాడుతూ ఉండగానే వెనుక నుంచి గన్ కాల్పులు వినిపించాయి అప్పుడు అక్కడ ఉన్న సిబిఐ ఆఫీసర్ నుదుటి లో బుల్లెట్ దించి గన్ షర్మిల వైపు ఎక్కు పెట్టి నిలబడాడు రాజు