తార ప్రమోద్ నీ అలా చూసేసరికి విక్కి మొహం లో రంగులు మారిపోయాయి, తరువాత సెక్యూరిటీ వాళ్లు రావడం చూసి బయటికి నడిచాడు. అప్పుడే వినీత వచ్చి విక్కి ముందు పోలీస్ కార్ ఆపి నాకూ” 3 డేస్ లీవ్ కావాలి అంటే వైజాగ్ లో నా ఫ్లాట్ లో ఉండొచ్చు నువు” అని ఎక్కించుకోని వెళ్లింది తన ఫ్లాట్ కీ. కానీ విక్కి మొహం లో ఉన్న విచారం అర్థం అయింది వినీత కు “విక్కి మనం ఇప్పుడు ఏమీ చేయలేము పూజా పోయింది కానీ తనని ఎలా కనిపెట్టాలో కూడా మనకు తెలియదు అంతే కాకుండా ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి లేక పోతే వాడి ఆవేశం కీ చాలా దారుణాలు జరుగుతాయి” అని చెప్పింది, అప్పుడు గుర్తు వచ్చింది విక్కి కీ మొన్న రాత్రి గోడవ జరిగిన దగ్గరి నుంచి నిఖిల్ కనిపించడం లేదు, అలాగే పూజా అన్న ఒక మాట గుర్తు వచ్చింది” నిఖిల్ కీ ఎప్పుడు కోపం భాధ వచ్చిన వాడు సలీం బార్ లో ఉంటాడు “అని పూజా చెప్పిన మాట గుర్తుకు వచ్చింది ఆ వెంటనే వాళ్లు హర్బర్ దెగ్గర ఉన్న ఆ బార్ వైపు వెళ్లారు కానీ దారిలో వాళ్ళకి నిఖిల్ ఎవరో జీప్ అతనితో గోడవ పడుతూ కనిపించాడు, వీలు కార్ దిగి వెళ్లారు ఆ జీప్ డ్రైవర్ నిఖిల్ నీ గుద్దాడు అని గోడవ జరుగుతుంది, విక్కి ఆప్పడానికి చూసిన వాళ్ళు ఆప్పలేదు కానీ సడన్ గా మంత్రం వేసినట్లు. అందరూ పారిపోయారు ఎందుకు అంటే అక్కడికి ఆ ఏరియా రౌడీ సలీం భాయ్ వచ్చాడు అతని చూసి డ్రైవర్. పారిపోతూంటే నిఖిల్ పట్టుకున్నాడు వాడిని గట్టిగా “ఎందుకు వీడని చంపాలి అని చూశావ్” అని అడిగాడు దాంతో అందరూ షాక్ అయ్యారు కోపంతో వాడిని లాగి ఆ జీప్ బార్నెట్ కీ వేసి కోడితే “సార్ ఇది అంతా ఆ ప్రమోద్ చేయించాడు” అని చెప్పాడు, దాంతో నిఖిల్ కోపంతో ప్రమోద్ కోసం పాలెస్ కి బయలుదేరాడు, కానీ నిఖిల్ కీ తెలియని విషయం ఆ డ్రైవర్ విక్కి కీ చెప్పాడు.
దాంతో విక్కి, వినీత ఇద్దరు కలిసి అరకు వైపు వెళ్లారు వాళ్లు 1 గంట లో అరకు చేరుకున్నారు తరువాత ఆ డ్రైవర్ చెప్పిన దారిలో వాళ్లు పూజా నీ వేతకడానికి వెళ్లారు
(ఆ డ్రైవర్ పూజా నీ ఎవరూ ఎక్కడ దాచి పెట్టారు అని విషయాలు చేప్పేసాడు) వాళ్లు చివరగా వెతికిన చొట్ట ఎడమ వైపు దట్టమైన అడవుల్లో ఒక 5 km నడిస్తే ఒక పాత చెక్క ఇళ్లు కనిపించింది దాంట్లో కీ వెళ్లి పూజా కోసం వేతికారు ఆ ఇంట్లో ఎక్కడ దొరకక పోవడంతో విక్కి గట్టిగా తన కాలితో కోడితే కింద చెక్క విరిగి ఆ బొక్కలో నుంచి పూజా కనిపించింది వాళ్లకు వెంటనే వెళ్లి పూజా నీ తీసుకోని బయటకు వచ్చారు పూజా చాలా నీరసముగా ఉంది స్ప్రుహ లో కూడా లేదు వెంటనే వైజాగ్ కీ వెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు, నిఖిల్ విక్కి కీ ఫోన్ చేసి ప్రమోద్ గురించి కనుక్కోమన్నాడు వాడు పాలెస్ లో లేడు అని చెప్పాడు దాంతో విక్కి ప్రకాష్ కీ ఫోన్ చేసి అడిగాడు.
అప్పుడు ప్రమోద్ తన ప్రైవేట్ yatch లో ఉండి ఉంటాడు అని చెప్తే అక్కడికి వెళ్లారు అప్పుడే ఒక BMW కార్ పోర్ట్ నుంచి హడావిడి గా రోడ్డు పై పరుగులు తీసింది అలా అందరూ లోపలికి వెళ్లేసరికి ప్రమోద్ గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
గొంతు తెగి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉన్న ప్రమోద్ నీ చూసి ఒక సారిగా నిర్ఘాంతపోయారు విక్కి, నిఖిల్, ప్రకాష్ అప్పుడే బయట వెళ్లిన కార్ గురించి గుర్తుకు వచ్చింది విక్కి కీ అప్పుడు yatch బయట ఉన్న సెక్యూరిటీ కెమెరా లో ఆ కార్ ఎవరిదో చూడ్డానికి ట్రై చేశాడు విక్కి కానీ ఆ కార్ వచ్చి ఆగిన దగ్గర నుంచి కెమెరా పనిచేయలేదు మళ్లీ ఆ కార్ వెనకు వెళ్లినప్పుడు ఆ కార్ వెనుక నెంబర్ కనిపించింది అది చూసిన ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని చూసిన నిఖిల్ ఏమీ జరిగింది అన్నట్టు సైగ చేశాడు అది చూసిన ప్రకాష్ “ఆ కార్ తార ది” అని చెప్పాడు ప్రకాష్ చెప్పింది వినీ విక్కి, నిఖిల్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు కానీ విక్కి కీ మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ప్రమోద్, తార ఇద్దరు నిన్న మొన్నటి వరకు బాగా కోల్జ్ గా ఉన్నారు, అలాంటిది తార కచ్చితంగా ప్రమోద్ నీ చంపుండదు కానీ చంపిన వాడికి సహకరించి ఉండాలి అని విక్కి ఆలోచిస్తూండగా, వినీత నుంచి ప్రకాష్ కీ ఫోన్ వచ్చింది “సార్ మీ చెల్లి తార కార్ కీ ఆక్సిడేంట్ అయి కార్ మొత్తం కాలి పోయింది మీరు urgent గా రావాలి” అని చెప్పి ఫోన్ పెట్టింది వినీత, అది విన్న ప్రకాష్ ఒక సారిగా ఉన్న చోటే నిలబడి పోయాడు.
ఇంతలో పోలీసులు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అలా అందరూ కలిసి తార ఆక్సిడేంట్ జరిగిన చోటికి వెళ్లారు తార శవం సగం కాలిపోయింది ఆ బాడి నీ హాస్పిటల్ కీ పంపారు దాంతో పాటు అందరూ హాస్పిటల్ వెళ్లారు ప్రకాష్ తార శవం తీసుకొని post-mortem కీ వెళ్లాడు. పూజా కూడా అదే హాస్పిటల్ లో ఉండటం తో నిఖిల్, విక్కి పూజా రూమ్ వైపు వెళ్లారు అక్కడ డాక్టర్ “తనకి బాగా స్ట్రాంగ్ డోస్ డ్రగ్స్ ఇచ్చారు మేము antidote ఇచ్చాం ఇంకో గంట లో సృహలోకి వస్తుంది అప్పటి వరకు డిస్టర్బ్ చేయొదు “అని చెప్పి బయటకు వెళ్లింది డాక్టర్.
నిఖిల్, విక్కి బయట ఉండి పూజా ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, అప్పుడే వినీత వచ్చి విక్కి తో పూజా గురించి అడిగి తెలుసుకుంది, నిఖిల్ తలుపు దెగ్గర నుంచి చూస్తున్నాడు పూజా మేలుకుంది దాంతో ముగ్గురు లోపలికి వెళ్లారు పూజా లేచిన వెంటనే కొంచెం బయటపడుతు చుట్టూ పక్కల అంతా వెతికింది కొంచెం పిచ్చి దానిలా ప్రవర్తించింది నిఖిల్ నీ చూశాక వెంటనే వాడిని పట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టింది, అప్పుడు విక్కి పూజా తో ప్రమోద్ విషయం చెప్పాడు దాంతో పూజా ఇంకా ఎక్కువ గా ఏడుస్తుంది “అసలు నేను ఎమ్ పాపం చేశాను రా నేను ప్రేమించిన అజయ్ నాకూ దక్కలేదు ఇప్పుడు నా మీద ప్రేమతో పెళ్లి చేసుకోవాలి అనుకున్న ప్రమోద్ లాంటి మంచి వాడికి ఇలా జరిగింది” అని పదే పదే ఏడుస్తుంది.
అప్పుడే ప్రకాష్ పరిగెత్తుతూ వచ్చాడు వచ్చి విక్కి తో “ప్రమోద్ నీ చంపింది తార నే “అని తన ఫోన్ కీ చివరి గా తార నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ నీ వాళ్ల ముందు ప్లే చేశాడు ” అన్నయ్య నేను ఇంక నీకు నా మొహం చూపించ లేను నేను ఈ రోజు తో నా జీవితానికి ఒక ముగింపు చెప్తున్నా కానీ దానికి ముందు నను ఎన్నో రోజులుగా బాధ పెడుతున్నా ఆ ప్రమోద్ నీ చంపడానికి వెళుతున్న ఆ తరువాత నేను చనిపోతా హే ఆగు” అని అలా ఆ మెసేజ్ కట్ అయింది.
ఆ తర్వాత పోలీసులు వచ్చి హాస్పిటల్ నీ రౌండ్ అప్ చేశారు ACP శ్రీధర్ లోపలికి వచ్చి పూజా వైపు వెళ్లి” మిస్ పూజా you are under arrest “అని చెప్పాడు దానికి మొత్తం అందరూ షాక్ అయ్యారు విక్కి వెళ్లి” ఎందుకు తనను అరెస్ట్ చేస్తున్నారు తను ఇప్పుడు patient ఎలా అరెస్ట్ చేస్తారు” అని గట్టిగా అడిగాడు దానికి ACP వెటకారం గా “అందుకే కదా మేము తనని రేపు డిస్చార్జ అయ్యాక అరెస్ట్ చేస్తున్నాం “అని నవ్వాడు” అసలు మా అక్క నీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు”అని ఆవేశం గా అడిగాడు నిఖిల్, దానికి శ్రీధర్ కీ చిరాకు వచ్చి” మీ అక్క తన కాబోయే భర్త అయిన ప్రమోద్ రాయుడు నీ కిరాతకంగా చంపింది అందుకే అరెస్ట్ చేస్తున్నాం “అని చెప్పాడు ఆ మాట కీ అందరి తల పైన బాంబ్ పడినట్లు అయింది.
ACP శ్రీధర్ అన్న మాటకు మొత్తం ఆ రూమ్ అంతా నిశబ్దం రాజ్యం ఎల్లింది తర్వాత శ్రీధర్ మొత్తం అందరినీ హాస్పిటల్ నుంచి పంపించేయమనీ రాజు వైపు చూసి సైగ చేశాడు దాంతో రాజు అందరినీ బయటకు తీసుకువెళ్లాడు, కోపం గా ఉన్న విక్కి వైపు భయం భయంగా చూస్తూ “సార్ please సార్ అర్థం చేసుకోండి లేకపోతే నా జాబ్ పోతుంది” అని దీనంగా చెప్పాడు రాజు
దాంతో ఒక సారిగా విక్కి సహనం నశించింది వెంటనే రాజు షర్ట్ పట్టుకుని విక్కి : రేయి ఈ డ్రస్ వేసుకున్నందుకు ఒక్కసారి అయిన సిన్సియర్ గా ధైర్యంగా పని చేయి రా పిరికి నాయాలా అని కోపంగా అరిచాడు విక్కి రాజు : అవును సార్ నేను పిరికోడినే ఎమ్ చేయాలి సార్ అమ్మ మీద మోజు తీరిపోయింది అని ఇంట్లో నుంచి బయటకు గేంటేసాడు మా నాన్న 4 సంవత్సరాల వయసు లో కళ ముందే కన్న తల్లి కాలిపోతుంటే కాపాడుకోలేక నిస్సహాయం గా నిలబడి పోయిన నాకూ ధైర్యం ఎవరూ ఇస్తారు సార్ అని ఏడ్వడం మొదలు పెట్టాడు
రాజు బాధ అర్థం చేసుకున్న ప్రకాష్ రాజు దగ్గరికి వచ్చి “సారీ రాజు విక్కి ఏదో ఆవేశంలో అన్నాడు పట్టించుకోవదు” అని చెప్పాడు, దానికి రాజు పర్లేదు అన్నట్లు చూశాడు “నిజంగా ప్రమోద్ నీ చంపినది పూజా కాదు నా చెల్లి తార” అని చెప్పాడు దానికి రాజు కొంచెం వెటకారం గా “ఏంటి సార్ నేను పిరికోడినే కానీ తెలివి తక్కువ వాడిని కాదు సార్ మీ తమ్ముడు లవర్ నీ కాపాడానికి చనిపోయిన మీ చెల్లి మీద కీ నింద వేస్తున్నారు” అని చెప్పాడు రాజు దాంతో ప్రకాష్ తన ఫోన్ లో ఉన్న తార వాయిస్ మెయిల్ చూపించడానికి ట్రై చేశాడు కానీ ప్రకాష్ ఫోన్ కీ ఒక వైరస్ వచ్చి డాటా మొత్తం పోయింది అందరూ ఏమీ జరిగిందో అర్థం కాక ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు తరువాత శ్రీధర్ రావడం తో అందరినీ అక్కడి నుంచి పంపిచేసాడు రాజు.బయటికి వచ్చాక విక్కి ప్రకాష్ నీ అడిగాడు “లోపల వాడు ఏంటి వాగుతున్నాడు అయిన పూజా కీ నీ తమ్ముడికి ఏంటి సంబంధం “అని అడిగాడు, దానికి ప్రకాష్ తనుకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని” మాకు అమ్మ నాన్న లేరు రాయుడు అంకుల్ షర్మిల ఆంటీ వాళ్ల ఫ్రెండ్స్ పిల్లలు అయిన నను, తార, నా తమ్ముడు అజయ్ నీ చిన్నప్పటి నుంచి పెంచారు, నా తమ్ముడు 6 నెలల క్రితం పూజా అనే అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటాను అన్నాడు చాలా హ్యాపీ హ్యాపీగా వాళ్ళకి engagement చేశాను కానీ engagement అయిన మరుసటి రోజే వాటర్ ఫాల్స్ దెగ్గర వాడి శవం దొరికింది “అని కళ్లు తుడుచుకుంటు చెప్పాడు.
కానీ విక్కి కీ ఎక్కడో ఏదో గేమ్ జరుగుతున్నటు అనిపించింది ఒక సారి ఏమీ జరుగుతుందో అని ఒక సారిగా జరిగిన సంఘటనలు అని మళ్ళీ తన మైండ్ లో ప్లే చేశాడు అప్పుడు తార పంపిన మెసేజ్ లో లాస్ట్ కీ” హే ఆగు “అని అన్న విషయం గుర్తుకు వచ్చింది అంతే కాకుండా తార తాగినప్పుడు కార్ నడపడదు అని ఇంతక ముందు ప్రకాష్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే తార ఆక్సిడేంట్ జరిగిన సంఘటన స్థలం గుర్తు వచ్చింది తార పాసెంజర్ సీట్ లో ఉంది కానీ డ్రైవర్ సీట్ కాలీగా ఉండటం గుర్తుకు వచ్చింది.
“వినీత తార బాడి మనకు పాసెంజర్ సిట్ లో దొరికింది కానీ డ్రైవర్ సిట్ కాలీగా ఉంది అంటే డ్రైవర్ కార్ నడపడలేదు ఎవరో తార నీ బ్లాక్మెయిల్ చేసి ఆ మెసేజ్ పంపించి మనల్ని మిస్లీడ్ చేశారు” అని తనకు అనిపించింది చెప్పాడు విక్కి.
విక్కి చెప్పింది విన్నాక వినీత కూడా ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడే విక్కి ఫోన్ కీ ఒక మెసేజ్ వచ్చింది” you are too smart than I expected a small gift for you “అని ఒక మెసేజ్ వచ్చింది, అప్పుడు ఒక ambulance లో ఒక డెడ్ బాడి వచ్చింది అది తార డ్రైవర్ బాడి ఆ బాడి పాంట్ జేబులో ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది వినీత కు వెళ్లి అది తీస్తే అందులో ఒక ఫోన్ ఉంది అది ఓపెన్ చేసి చూస్తే షాక్ అయి ఆ ఫోన్ కింద పడేసింది వినీత.
ఆ ఫోన్ కింద పడేసిన వెంటనే విక్కి ఏంటా అని వినీత దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ తీసుకుని ఏమీ జరిగిందా అని చూశాడు దాంట్లో ఒక వీడియో ప్లే అవుతుంది “పూజా తో engagement అయ్యాక అజయ్ ప్రమోద్ ఫారెస్ట్ లో వాటర్ ఫాల్స్ దెగ్గర ఉన్న చిన్న గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారు వాళ్ల తో పాటు ACP శ్రీధర్ తార కూడా ఉన్నారు, తార ప్రమోద్ ఒక సోఫా లో కూర్చుని ఉన్నారు అజయ్ ఫుల్ గా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రమోద్ మాత్రం అజయ్ ఫోన్ లో ఉన్న పూజా ఫోటో చూస్తూ సిప్ మీద సిప్ తాగుతూ ఉన్నాడు, అప్పుడు అజయ్ వచ్చి ప్రమోద్ పక్కన కూర్చుని “రేయి నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను పూజా నా అదృష్టం నా లైఫ్ లోకి వస్తుంది తనని మహారాణి లా చూసుకోవాలి” అని చెప్తున్నాడు అంతా వింటున్న ప్రమోద్ పైకి లేచి నిలబడి “రేయి చిన్నప్పటి నుంచి నువ్వు, నేను, మీ అన్న చాలా షేర్ చేసుకున్నాం ఇప్పుడు నీ పూజా నీ కూడా షేర్ చేసుకోవాలి అని ఉంది “అని చెప్పాడు ప్రమోద్, దాంతో అజయ్ కీ ఒక సారిగా కోపం వచ్చి పక్కనే ఉన్న బీర్ బాటిల్ నీ ప్రమోద్ పైకి విసిరేసాడు కానీ ప్రమోద్ తప్పించుకున్నాడు అక్కడే పక్కన టేబుల్ పైన ఉన్న శ్రీధర్ గన్ తీసుకొని అజయ్ నీ కాల్చి చంపాడు ప్రమోద్ అంతే తార, శ్రీధర్ షాక్ లో ఉన్నారు తార కోపం లో పగిలిన బీర్ బాటిల్ తీసుకొని ప్రమోద్ మీదకు వెళ్లింది కానీ ప్రమోద్ తార నీ కొట్టి లోపల రూమ్ లోకి తీసుకువెళ్లి రేప్ చేశాడు ఇది అంతా శ్రీధర్ ఫోన్ లో షూట్ చేశాడు ప్రమోద్ బయటికి రాగానే శ్రీధర్ కూడా లోపలికి వెళ్లి తార పైన ఎప్పటి నుంచో ఉన్న మోజు తీర్చుకున్నాడు తరువాత తార నీ లోపల లాక్ చేసి అజయ్ డ్రస్ మార్చి వాటర్ ఫాల్స్ లో పడేశారు ” ఇది అంతా ఆ వీడియో లో రికార్డు అయి ఉంది కానీ వీడియో ఆఫ్ అయిపోగానే ఫోన్ అంతా erase అయ్యింది.
ఇంతలో విక్కి కీ ఇంకో మెసేజ్ వచ్చింది “Hope you like the gift my friend” అని ఉంది కోపం లో ఫోన్ తీసి నేలకు వేసి కొట్టాడు.
ఆ తర్వాత అందరూ సలీం బార్ కీ వెళ్లారు ప్రకాష్ కోపం లో ఎంత తాగుతున్నాడో తెలియకుండా తాగుతున్నాడు, నిఖిల్ కూడా అలాగే తాగుతూ ఉన్నాడు విక్కి మాత్రం అసలు ఏమీ జరుగుతుందో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు, అప్పుడే వాళ్ల టెబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సలీం భాయ్ “తమ్ములారా మీ ప్రశ్నలకు సమాధానం మొత్తం RR పాలేస్ లోనే దొరుకుతుంది ఈ వైజాగ్ చుట్టూ ఉన్న అని ప్రాంతాల్లో నాకూ భయపడతారు కానీ నేను భయపడేది ఆ రాయుడు కుటుంబానికి ఎందుకంటే వాళ్లు ఒక సైగ చేసిన నా పని అయిపోతుంది, మీకు ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే పూజా నీ కిడ్నాప్ చేసింది రాక్షసుడు కాదు అది అంతా ఆ షర్మిల ఆడించిన నాటకం 3 సంవత్సరాల క్రితం రమేష్ బాబు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆ అమ్మాయి శవం అడవిలో తేలింది అంటే ఆ ఇంట్లోకి వెళ్లే దైర్యం బయట వాడికి లేనప్పుడు ఆ ఇంట్లో వాళ్లే చేయాలి కదా “అని చెప్పాడు సలీం
” ఇది అంతా మాకు ఎందుకు చెప్తున్నావ్ ” అని అడిగాడు విక్కి” నిఖిల్ నా దెగ్గర చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాడు కాబట్టి మీకు ఈ మాట చెప్పడం వరకే నేను చేయగల సహాయం “అని లేచి వెళ్లిపోయాడు, సలీం భాయ్ వెళ్లి పోగానే వీలు ముగ్గురు” RR & CO ” కంపెనీ ఆఫీసు కు వెళ్లారు ప్రకాష్ నీ చూసి సెక్యూరిటీ వాళ్లు వాళ్ల ముగ్గురిని లోపలికి పంపారు అక్కడ కంపెనీ డైమండ్ జుబ్లీ ఫంక్షన్ జరుగుతుంది వీలు కూడా వెళ్లి గుంపు లో కలిసి పోయారు వచ్చిన vip లు రాయుడు నీ, షర్మిల నీ పొగడ్తలతో ముంచేతారు కానీ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో స్టేజ్ మీదకు దూసుకొని వచ్చాడు రమేష్
“వీలు గోపోలు కారు కన్న కొడుకు చచ్చి పోయిన పట్టించుకోవడం మానేసి ఇక్కడ ఫంక్షన్ లు చేసుకుంటున్నారు వీలు మీకు దేవులు ఏమో కానీ సొంత కొడుకు కోడలు నీ చంపే కిరాతకులు “అని రమేష్ మాట పూర్తి అయ్యే లోపే ఒక పెద్ద బాంబ్ రమేష్ కింద పేలింది అంతే ఒక సారిగా గాలి లోకి ఎగిరి అంతే వేగం లో వచ్చి నేలకు తాకింది రమేష్ శరీరం.
రమేష్ శరీరం నెలకు తాకి నుజ్జు నుజ్జు అయింది అది చూసి ఎక్కడి అక్కడ ఉన్న జనాలు అంతా చెల్లా చెదరు అయ్యారు, కానీ అంత జరిగిన కూడా వెంకట రాయుడు, షర్మిల కు చీమ కట్టినట్లు కూడా అనిపించలేదు రమేష్ శవం జనాలా తొక్కిసలాట లో ఉన్న కూడా వాళ్లు మాత్రం కార్ లో ఇంటికి వెళ్లిపోయారు విషయం తెలిసి వినీత అక్కడ ఎంక్వయిరీ కీ వచ్చింది తనతో పాటు రాజు కూడా వచ్చాడు రాజు మొత్తం ప్రెస్ వాళ్లు రాకుండా చూస్తున్నాడు జరిగేది ఎంత ఏదో వింత గా పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని అర్థం అయింది విక్కి కీ forensic వాళ్లతో శ్రీధర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. శ్రీధర్ రావడం రావడంతో అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని బయటికి పంపేసి క్రైమ్ సిన్ లో తను మాత్రమే ఉండి మొత్తం చూసుకుంటున్నాడు విక్కి మాత్రం వాడు ఏదో దాచడానికి చూస్తున్నాడు అని అర్థం అయింది, శ్రీధర్ కీ ఫోన్ రావడంతో పక్కకు వెళ్లాడు అప్పుడు విక్కి వినీత తో “బేబి డాల్ చిన్న హెల్ప్ చేయి ఆ forensic వాళ్లను ఎలాగైనా పక్కకు తప్పించు ఆ శ్రీధర్ కచ్చితంగా ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది please” అని అడిగాడు “విక్కి ఇది చాలా డేంజర్ స్టెప్ నా జాబ్ పోతుంది లేదా జైలు కూడా పోవచ్చు” అని చెప్పి కొద్ది సేపు ఆలోచించి “సరే నీకోసం చేస్తాను” అని చెప్పి forensic వాళ్లను కొంచెం పక్కకు తీసుకుని వెళ్లింది.
విక్కి కరెక్ట్ గా మైక్ పెట్టిన స్పాట్ కింద చూశాడు అప్పుడు అక్కడ ఒక విచిత్రమైన ప్లేట్ కనిపించింది ఏంటి అని చూస్తే అది వైట్ మెషిన్ దాని కింద బాంబ్ కీ సంబంధించిన బాటేరి వైర్ లు ఉన్నాయి అప్పుడే శ్రీధర్ వచ్చి విక్కి చేతిలో ఉన్న ఆ ప్లేట్ లాకున్నాడు “ఇలా ఎవిడెన్స్ నీ దొంగతనం చేయడం తప్పు మిస్టర్ జర్నలిస్ట్” అని అరెస్ట్ చేయబోయే టైమ్ లో వినీత శ్రీధర్ తల కీ గన్ పెట్టి విక్కి కీ ప్లేట్ ఇచ్చి పారిపొమ్మని చెప్పింది, విక్కి పారిపొతుంటే పోలీస్ లు firing మొదలు పెట్టారు అప్పుడే ప్రకాష్ కార్ లో ఫాస్ట్ గా వచ్చి విక్కి నీ ఎక్కించుకొని కాపాడాడు.
తరువాత వినీత శ్రీధర్ నీ అడ్డుపెట్టుకొని తప్పించుకుంది, కార్ నీ సరాసరి సలీం భాయ్ బార్ కీ పోనీ ఆనాడు నిఖిల్, ఎందుకంటే సలీం కీ బాంబులు మీద మంచి పట్టు ఉంది అని చెప్పాడు దాంతో సలీం దగ్గరికి వెళ్లారు, సలీం భాయ్ ఆ ప్లేట్ నీ బాగా చూసి “ఇది కచ్చితంగా బయటి వాళ్ల పని కాదు అంతేకాకుండా ఇది రమేష్ కోసం పెట్టిన బాంబ్ కాదు” అని చెప్పాడు ముగ్గురు ఒకరి మెహలు ఒకరు చూసుకున్నారు దాంతో ఆ ప్లేట్ నీ చూపించాడు అక్కడ 140 kgs దెగ్గర మార్క్ వేసివుంది అంటే ఇద్దరు మనుషులు నిలబడితే వచ్చే తూకం తో ప్లాన్ చేసారు కానీ రమేష్ ఒక్కడి వైట్ 140 kg లు దాంతో రమేష్ ఆ స్పాట్ లో నిలబడి ఉండటం తో రమేష్ బరువు వల్ల ఆ బాంబ్ ముందే పేలింది.
అంతా వినాక విక్కి కీ వినీత నుంచి ఫోన్ వచ్చింది రేపు పూజా నీ కోర్టు కీ తీసుకువెళ్లుతున్నటు చెప్పింది వినీత