నిజం గా నేను అంటే అంత ఇష్టమా 1

హలో ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు రాసిన అని కథలకు మీ నుంచి మంచి స్పందన వచ్చింది కాక పోతే నేను మిమ్మల్ని సరిగా సంతృప్తి పరచలేదు అని అనుకుంటున్నా ఎందుకు అంటే నాకూ శృంగార కథలు చదివినప్పుడు వచ్చిన అంత ఇంటరెస్ట్ రాసినపుడు రావడం లేదు అందుకే నాకూ బాగా ఇష్టమైన థ్రిల్లింగ్ కేటగిరి కథ నీ మీ ముందుకు తీసుకు వచ్చాను కాబట్టి మీరు ఈ కథని enjoy చేస్తారు అని భావిస్తున్నా

పాత్రల పరిచయం

హీరో : విక్కి (ఇన్వెస్టగెట్యు జర్నలిస్ట్)

హీరోయిన్ : వినీత (సర్కిల్ ఇన్స్పెక్టర్)

ముఖ్యమైన పాత్రలు

పూజ : హీరో బెస్ట్ ఫ్రెండ్

ప్రమోద్ : పూజా కాబోయే భర్త

ప్రకాష్ : ప్రమోద్ బెస్ట్ ఫ్రెండ్ (లాయర్)

నిఖిల్ : పూజా అన్నయ్య

వెంకట రాయుడు : ప్రమోద్ తండ్రి

షర్మిల రాయుడు : ప్రమోద్ తల్లి

ACP శ్రీధర్ : రాయుడు కీ బానిస

రాజు : శ్రీధర్ అసిస్టెంట్

సలీం భాయ్ : లోకల్ రౌడీ

(అతిథి పాత్రలు కానీ ముఖ్యమైన పాత్రలు

(అరుణ : సస్పెన్స్

తార : ప్రకాష్ చెలి

అజయ్ : ప్రకాష్ తమ్ముడు

శేఖర్ : విక్కి బాస్

రమేష్ : ప్రమోద్ అన్న )

ముంబయి BBC India న్యూస్ చానెల్ ఆఫీస్ టైమ్ 9 అయినట్లు తొమ్మిది సార్లు గంట మొగింది అప్పుడు గోడ వైపు ఒక సారి ఆఫీస్ రూమ్ తలుపు వైపు ఒక సారి చూశాడు శేఖర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తూ టేబుల్ మీద చిన్న గా వేళ్లతో దరువు వేస్తూ తన చేతికి ఉన్న వాచ్ వైపు గోడకి ఉన్న గడియారం వైపు చూసి ఇంకా ఎంత సేపు అన్నట్లు శేఖర్ వైపు చూశాడు “10 నిమిషాల్లో వస్తాడు అనురాగ్ సార్” అని బతిమాలుతు చెప్పాడు శేఖర్ “అబ్బే పర్లేదు శేఖర్ మేము పెద్ద పీకేది ఏం ఉంది అవతల మీ వాడు రావాలి నాకూ కథ చెప్పాలి అదే కదా important” అని చిరాకు కోపం కలిపి వెటకారం గా బదులు ఇచ్చాడు అనురాగ్ కశ్యప్ అవును శేఖర్ ముందు ఉన్నది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనూరాగ్ కశ్యప్ “చూడు శేఖర్ అవతల నాకూ అమితాబ్ బచ్చన్ గారి తో 11 గంటలకు షూటింగ్ ఉంది నువ్వు అడిగావ్ కదా అని వచ్చాను timing sense లేని వాడితో ఎలా అయ్య సినిమా చేసేది ఇంకో సారి నను డిస్టర్బ్ చేయొద్దు” అని కోపంగా వెళ్లిపోయాడు

అప్పుడు తలుపులు తీసుకొని లోపలికి హడావిడి గా వేళ్ళాడు విక్కి” శేఖర్ అనురాగ్ కశ్యప్ ఉన్నాడ వెళ్లిపోయాడా “అని కంగారూ గా అడిగాడు విక్కి” ఇప్పుడే నీ పుణ్యమా అని నీకు పడాల్సిన తిట్లు నా మీద అక్షింతలు గా వేసి వెళ్లాడు “అని కోపంగా చూశాడు శేఖర్ “హమ్మయ్య పోయాడా మంచిది” అని ఎమ్ భాధ లేకుండా శేఖర్ ముందు ఛైర్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు విక్కి” రేయి సిగ్గు ఉండాలి రా నేను వారానికి ఒక డైరెక్టర్ తో మీటింగ్ పెట్టడం నువ్వు కావాలి అని లేట్ రావడం రేయి నీకు కథ రాయడం రానప్పుడు ఎందుకు డైరెక్టర్ ఆవాలి అని అంత పిచ్చి “అని చిరాకు తో తీడుతున్నాడు శేఖర్ “నాకూ చేతకాక కాదు బాస్ నేను కొంచెం తీస్తే పక్క హిట్ అయ్యే తీయాలని ఆలోచిస్తూన్నా “అని చెప్పాడు విక్కి” రేయి నీ పట్టుదల నాకూ అర్థం అవుతుంది కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి తెచ్చిన వాళ్లు మామూలు వాళ్లు కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలిచిన డైరెక్టర్ cum ప్రొడ్యూసర్ వాళ్ల ముందు పరువు తీసుకోవద్దు సరే నీకు ఒక నెల రోజుల లీవ్ ఇస్తున్నా ఎక్కడైైనా ట్రిప్ కీ వెళ్లి మైండ్ క్లియర్ చేసుకోని రా “అని ప్రేమ తో చెెెప్పాడు శేఖర్ అప్పుడే విక్కి ఫోన్ మొగింది ఏదో ప్రైవేట్ నెంబర్ ఎవరూ అయి ఉంటారు అని ఫోన్ ఏత్తి బయటకి వెళ్లాడు

అవతలి నుండి విక్కి బెస్ట్ ఫ్రెండ్ పూజా ఫోన్ చేసింది

పూజా : రేయి ఇడియట్ విక్కి : ఒసేయ్ సౌండ్ స్పీకర్ పూజా : ఎలా ఉన్నావ్ రా విక్కి : నాకంటే బిందాస్ ఈ బాంబే లోనే లేడు పూజా : హ్ హ చూశాను లే డేరింగ్ డాషింగ్ ఇన్వెస్టీటగెట్యు జర్నలిస్ట్ ప్రెసిడెంట్ అవార్డు విన్నర్ I am proud of you my friend విక్కి : thanks సరే కానీ ఏంటే 5 సంవత్సరాల తరువాత ఇప్పుడే గుర్తు వచ్చాను పూజా : నాకూ పెళ్లి కుదిరింది రా ఇంకో వారం లో పెళ్లి నువ్వు కచ్చితంగా రావాలి విక్కి : నీ పెళ్లికి నేను లేకుంటే ఎలాగే పూజా : రేయి నువ్వు పెళ్లి కీ వస్తే నీ కోసం ఒక surprise ఉంది విక్కి : అవునా అయితే నైట్ కే బయలుదేరుతున్న ఇంతకీ పెళ్లి ఎక్కడ పూజా : అరకు లో అడ్రసు what’s app చేస్తాను వచ్చెయ్యి ఇంకో important విషయం wedding card లేకుండా ఎవరిని allow చేయరు కాబట్టి నువ్వు వచ్చాక సెక్యూరిటీ వాళ్ల తో ఒక ఫోన్ చేయించు విక్కి : అబ్బో అంత బలిసినోళు ఏంటే నీ మొగుడు పూజా : నీకు తెలుసు కదా రా నా చిన్నప్పటి నుంచీ ఒకటే డ్రీమ్ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ లోకి వెళ్లాలి అని విక్కి : ఇంతకీ ఏం చేస్తుంటాడే నీ మొగుడు పూజా : వైజాగ్ లో గోల్డెన్ ఫిష్ బోట్స్ కంపెనీ ఉంది కదా వాళ్ల అబ్బాయి విక్కి : అబ్బో మంచోడినే పట్టావు సరే రేపు అరకు లో కలుస్తా బై అని ఫోన్ పెట్టేసి శేఖర్ కీ కారణం చెప్పి వైజాగ్ ఫ్లయిట్ ఎక్కాడు విక్కి

కానీ అతనికి తెలియనిది ఏంటి అంటే ఈ ప్రయాణం లో ఎన్నో మధురమైన పాత జ్ఞాపకాలు కొత్త ఎదురు దెబ్బలు ఎదురు చూస్తున్నాయి అని అతనికి తేలిదు

విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ “RR & CO” అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి చాలా ఆశ్చర్యంగా అనిపించింది విక్కి కీ అంతే కాకుండా హర్బర్ బయట కూడా అదే కంపెనీ లోగో తో ఒక టోల్ గేట్ ఉంది కస్టమ్స్ డిపార్టుమెంట్ వాళ్లూ కూడా చెక్ చేయనంత స్ట్రీట్ గా వాళ్లు చెక్ చేస్తున్నారు దాంతో టాక్సీ డ్రైవర్ నీ అడిగాడు “ఏంటి అన్న ఈ కంపెనీ అంత పవర్ ఫుల్ ఆ ” అని అడిగాడు “అవును సార్ RR & CO అంటే ఇక్కడ కింగ్ ఆ కంపెనీ కీ ఎదురు ఎవరూ నిలబడి success కాలేరు అంత పెద్ద కంపెనీ అంతే కాదు సార్ ఈ హర్బర్ లో ఒక షిప్ రావాలి అన్న పోవాలి అన్న అది ఆ కంపెనీ ఫర్మిషన్ తోనే జరుగుతాయి” అని చెప్పాడు

అప్పుడు దారిలో విక్కి కీ ఒక పాతకాలం నాటి షిప్ కనిపించింది దాని మీద” గోల్డెన్ డక్ “అని రాసి ఉంది” ఆ షిప్ ఎవరిది “అని అడిగాడు విక్కి” అది RR&CO వాళ్ల 1st షిప్ సార్ బ్రిటిష్ వాళ్లు ఇండియా వదిలి వెళ్లే ముందు ఆ షిప్ నీ అప్పటి MRO అయిన రుద్ర రాయుడు కీ దాని గిఫ్ట్ గా ఇచ్చారు అంట సార్ అప్పటి నుంచి వాళ్ళకు బాగా కలిసి వచ్చింది అంట అప్పుడు మొదలు అయిన వాళ్ల నియంతృత్వం ఇప్పటికి కొనసాగుతోంది” అని చెప్పాడు టాక్సీ డ్రైవర్, విక్కి కీ ఎందుకో ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది ఆ తర్వాత మధ్యాహ్నం కీ అరకు చేరుకున్నాడు కార్ దిగి తను వచ్చిన అడ్రసు what’s app లో మళ్లీ సరిగా చూసుకున్నాడు అప్పుడు తన ఎదురుగా ఉన్న పాలేస్ వైపు చూసి కొంచెం ఆశ్చర్య పోయాడు ఎందుకు అంటే ఆ పాలేస్ పైన “RR PALACE” అని రాసి ఉంది అలాగే ఆలోచిస్తూ లోపలికి వెళుతుండగా గేట్ దెగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కి నీ ఆప్పారు “సార్ మీ wedding card చూపించండి” అని అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అడిగాడు

అప్పుడు విక్కి “సార్ అంటే నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ నీ తనే ఫోన్ చేసి రమ్మనింది wedding card ఇవ్వలేదు” అని చెప్పాడు సెక్యూరిటీ అతను విక్కి నీ చూసి తన Bluetooth తో ఏదో మెసేజ్ ఇచ్చాడు అప్పుడు గేట్ స్క్రీన్ మీద పూజా వీడియో వచ్చింది తను కన్ఫర్మామ్ చేశాక లోపలికి పంపారు “ఇది ఏమీ సెక్యూరిటీ రా బాబు “అని మనసులో తిట్టుకుంటు లోపలికి వెళ్ళాడు విక్కి తను లోపలికి వెళ్లగానే ఎదురుగా ఉన్న మెట్లు మీద నుంచి చేతులకు చెరో వైపు మెహందీ పెడుతూ వెనకాల జుట్టు సరి చేస్తూ ఒకరు డ్రస్ సరి చేస్తూ ఉండగా యువరాణి లాగా స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్య లాగా వైభవంగా కిందకి వచ్చింది పూజా తనని అలా చూడగానే విక్కి చాలా సంతోషం వేసింది

మెట్లు దిగి విక్కి ముందు కు వచ్చిన పూజా “ఏంటరా అలా చూస్తూన్నావు” అని జుట్టు సరి చేసుకుంటూ అడిగింది పూజా “ఎంత ఎదిగి పోయావే అసలు నువ్వే నా అని నాకూ నమ్మకం కుదరడం లేదు ఏది ఏమైనా మొత్తానికి సాధించావ్” అని పూజా నీ మెల్లగ కౌగిలించుకొన్నాడు విక్కి అప్పుడే ఎవరో విక్కి బుజం మీద తటారు దాంతో వెనకు తిరిగాడు అప్పుడు విక్కి ఎదురుగా ఒక ఆరు అడుగుల ఎత్తు తెల్లని చర్మ చాయ కూడిన మొహం తో అర్మనీ సూట్ వేసుకొని ఒక యువకుడు నిలబడాడు” తను నా వైఫ్ అలా ఎవరూ పడితే వాళ్లు తన మీద చేయి వేయకుడదు” అని కొంచెం కఠినమైన గొంతు తో అన్నాడు “హే ప్రమోద్ స్టాప్ joking” అని వెళ్లి అతని పక్కన నిలబడింది పూజా, “విక్కి meet my fiance ప్రమోద్ and ప్రమోద్ he is my best friend విక్కి” అని పరిచయం చేసింది ప్రమోద్ నవ్వుతూ “సారీ బ్రో జోక్ చేశాను ఫీల్ అయ్యారు అనుకుంటా ” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు “no problem బ్రో” అని విక్కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు తరువాత ప్రమోద్ చుట్టూ చూసి ఒక అతని పిలిచాడు అతను రాగానే బుజం మీద చేయి వేసి దెగ్గర గా లాకుని “విక్కి ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ పేరు ప్రకాష్” అని పరిచయం చేశాడు విక్కి, ప్రకాష్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచుకున్నారు ఆ తర్వాత ప్రకాష్, ప్రమోద్ ఎవరో పిలుస్తే వెళ్లారు అప్పుడు విక్కి పూజా వైపు తిరిగి

“అవునే నాకూ ఏదో surprise ఉంది అన్నావు ఎక్కడ” అని అడిగాడు అప్పుడు పూజా ఏదో చెప్పబోతుంటే వెనుక మెట్ల మీద నుంచి ఎవరో అమ్మాయి జారీ పడి పొత్తుంటే వెంటనే వెళ్లి ఆ అమ్మాయి నడుము పట్టుకుని బుజం కింద చేయి వేసి పట్టుకున్నాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయి మొహం ఆ అమ్మాయి భయం తో కళ్లు గట్టిగా మూసుకుని ఉంది ఆ అమ్మాయి నీ చూసిన వెంటనే “హే బేబి డాల్” అన్నాడు అంతే ఈ గొంతు ఎక్కడో విన్నటు ఉందే అని కళ్లు తెరిచింది విక్కి నీ చూసి “రేయి నువ్వా” అని తల కొట్టుకుంది అప్పుడు పూజా కింద నుంచి “రేయి surprise బాగుందా” అని అడిగింది

రేయి surprise ఎలా ఉంది రా” అని అడిగింది పూజా విక్కి మాత్రం తన చేతిలో ఉన్న ఆ అమ్మాయి కళ్లలో చూస్తూన్నాడు “పూజా మేడమ్ వీడని నను వదిలేయమను” అని అరిచింది ఆ అమ్మాయి పూజా విక్కి వైపు చూసి “వీనిత వీడి గురించి నా కంటే నీకే బాగా తెలుసు” అని అక్కడి నుంచి వెళ్లిపోయింది పూజా వినిత వెంటనే విక్కి నీ పక్కకు తోసి లేచి నిలబడి లాగి చెంప పగలగొట్టింది “రేయి మళ్లీ నా లైఫ్ లోకి వస్తే బాగోదు” అని తన డ్రస్ సెట్ చేసుకోని వెళ్లిపోయింది కానీ విక్కి మాత్రం వెళుతున్న వీనిత వైపు చూస్తూ ఉన్న చోటే కూర్చుండి పోయాడు ఇది అంత చూసిన ప్రమోద్, ప్రకాష్ విక్కి తో “బ్రో టైమ్ అవుతుంది వెళ్లి రెడీ ఆవు cocktail పార్టీ కీ వెళ్లదాం “అని ప్రకాష్ పిలుస్తే అప్పుడు ఈ లోకంలో లోకి వచ్చాడు విక్కి, ప్రకాష్ విక్కి కి రూమ్ చూపించాడు విక్కి అలా కిటికీ వైపు వెళ్లి curtain తీశాడు కిటికీ నుంచి చూస్తే వియ్యు అదిరింది వాటర్ ఫాల్స్ చెట్లు చుట్టూ కొండలు కనిపించాయి తరువాత రెడీ అయి కిందకి వెళ్లాడు

అప్పుడు చూశాడు విక్కి వినీత నీ క్లియర్ గా తల పైన టోపి చేతిలో walkie-talkie టాప్ నుంచి బాటమ్ వరకు ఖాకి డ్రస్ అప్పుడు అర్థం అయింది విక్కి కీ వినీత పోలీస్ అయింది అని వచ్చిన గెస్ట్ అందరినీ చెక్ చేయించి లోపలికి పంపుతుంది ఇందాక కొట్టిన ఇప్పుడు సెల్యూట్ చేసి లోపలికి పంపింది విక్కి కీ ఎక్కడో ఇగో satisfy అయింది లోపలికి వెళ్లాక ఒక టేబుల్ దెగ్గర ఒక అతను మాత్రమే ఉన్నాడు మిగిలిన అన్ని టేబుల్స్ ఫుల్ అయ్యాయి అని అతని పక్కనే ఉన్న ఛైర్ లో కూర్చున్నాడు విక్కి అప్పుడు చూశాడు అతని ఒంటి నిండా tattoos కళ్లు ఎర్రగా నిప్పుల కొలిమి లాగా మండుతున్నాయా అన్నట్టు ఉన్నాయి బాగా రాట్టు తేలిన శరీరం లా ఉంది అతనిది చూస్తూ చూస్తూ నే ఒక ఫుల్ బాటిల్ మందు లేపేసాడు కానీ ఇంకా స్టడీ గానే ఉన్నాడు “హలో I am విక్కి ” అని పరిచయం చేసుకున్నాడు అప్పుడు అతను విక్కి వైపు చూసి “హాయి I am నిఖిల్” అని బదులు ఇచ్చాడు అతను “మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఆ relative ఆ” అని అడిగాడు విక్కి “కాదు బ్రో నేను పెళ్లి కూతురు తమ్ముణ్ని” అని చెప్పాడు

దాంతో తో విక్కి ఒక సారిగా షాక్ అయ్యాడు తన 6 సంవత్సరాల పరిచయం లో పూజా ఎప్పుడు తనకి ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పలేదు తను ఒక అనాధ అని మాత్రమే తెలుసు అందరికీ కానీ తమ్ముడు గురించి ఎప్పుడు టాపిక్ ఎత్తలేదు విక్కి ఫీలింగ్ అర్థం చేసుకున్న నిఖిల్” తనకి నేను తమ్ముణ్ని అని చెప్పుకునే స్టేజ్ లో తను ఉంది కానీ నేనే వీడు నా తమ్ముడు అని చెప్పించుకునే స్టేజ్ లో లేను” అని కళ్లలో కన్నీరు పెట్టుకున్నాడు అప్పుడే ప్రకాష్ ఒక ఫుల్ బాటిల్ తీసుకొని వాళ్ల టేబుల్ దగ్గరికీ వచ్చాడు “విక్కి బయట ఉన్న సెక్యూరిటీ చీఫ్ వినీత కీ నీకు మధ్య లవ్ అంటా “అని గ్లాస్ లో మందు పోస్తూ అడిగాడు ప్రకాష్” నీకు ఎలా తెలిసింది బ్రో “అని చిన్నగా నవ్వుతూ అడిగాడు విక్కి “ఏమిలేదు బ్రో చీకటి లో బాణం వేశా తగిలింది” అని నవ్వాడు ప్రకాష్

“సరే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉంది ఈ లోపు నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు గా” అని అడిగాడు ప్రకాష్ “అబ్బ ఇప్పుడు ఎందుకు అవి అని ముందు పార్టీ ఎంజాయ్ చేద్దాం అని తరువాత చెప్త” అని తప్పించుకోబోయాడు కానీ నిఖిల్ నేను చెప్త అన్నాడు” హే నా లవ్ స్టోరీ నీకు ఎలా తెలుసు “అని ఆశ్చర్యంగా అడిగాడు విక్కి” మా అక్క చెప్పింది నీ గురించి నీ లవ్ స్టోరీ గురించి” అని టేబుల్ మీద ఉన్న ఒక పెగ్ గ్లాస్ తీసి విక్కి గొంతులో పోసాడు నిఖిల్

అప్పుడు ప్రకాష్ కీ సైగ చేసి దగ్గరికి రమ్మని చెప్పి “ఇప్పుడు అతనే చెప్తడు “అని చెప్పి వెనకు జరిగాడు మెల్లగ విక్కి కి మత్తు ఎక్కింది ఇంక చెప్పడం మొదలు పెట్టాడు

“అది 2013 నేను మాస్ మీడియా జర్నలిసం లో మాస్టర్స చదువుతున్నా నేను పూజా ఆ రోజు ఇద్దరం కాలేజీ కీ తొందరగా వెళ్లాం క్లాస్ కోసం కాదు రాగింగ్ చేయడానికి అప్పుడు ఒక అమ్మాయి scooty మీద వచ్చింది ఆ అమ్మాయి నీ చూడగానే నా ఫ్రెండ్ ఒకడు వెళ్లి I love you అని చెప్పాడు అంతే ఆ అమ్మాయి పక్కన నుంచి ఒక చేయి వచ్చి వాడిని బలం గా తాకింది అంతే వాడు నెల కీ కర్చుకొని పోయాడు ఎవరా వాడిని కొట్టింది అని చూశాను ఒక అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ టి షర్ట్ వేసుకొని బ్లాక్ కాటన్ జీన్స్ పాంట్ దానికి మోకాలి దెగ్గర చిన్న cuts ఉన్నాయి వాడిని కొట్టిన తరువాత తన మోహనికి అతుకున్న జుట్టు నీ పొగరు గా వెనకు దువ్వుకొని నిలబడింది నా వినీత తనని చూడగానే నా హార్ట్ ఒక సారిగా వేగంగా కొట్టుకుంటూంది “అని చెప్పాడు విక్కి ఇది అంతా వెనక టేబుల్ దెగ్గర ఉన్న వినీత వింటుంది

అలా వినీత విక్కి చెప్పేది వింటూ ఉండగా విక్కి మిగిలిన కథ చెప్పడం మొదలు పెట్టాడు “అలా ఒక సారిగా వినీత చూడగానే నా నా మనసు ఆగలేదు ఆ అమ్మాయి నే వెంటాడుతోంది అలా ఆ రోజు అంతా తన వెంటే తిరిగాను ఇంక ఆ మరుసటి రోజు వినీత నీ ఎలాగైనా పడేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసి వెళ్లాను” అని అలా చెప్తూంటే అప్పుడే ప్రమోద్ కూడా వచ్చి వాళ్లతో కలిసి “ఏంటి బ్రో నీ లవ్ స్టోరీ ఆ ఇప్పటికే పూజా 50 సార్లు చెప్పింది “అని విక్కి కి దెగ్గర గా జరిగి విక్కి చెవిలో “వినీత వెనుక నుంచి వింటూంది వెళ్లి చూడు వీళ్లకి నేను చెప్త మీగిలిన కథ “అని విక్కి కీ హెల్ప్ చేశాడు ప్రమోద్ దానికి విక్కి “ఇప్పుడు వద్దు బ్రో తను డ్యూటీ లో ఉంది “అని చెప్పి మిగిలిన కథ చెప్తున్నాడు” అలా కాలేజీ కీ వెళ్లాను అప్పుడే వినీత సెల్ లో ఏదో చూసుకుంటు వస్తుంది నా పక్కన ఉన్న పూజా వద్దు వద్దు అని అంటున్నా కూడా వినిపించు కొలేదు వెంటనే వెళ్లి తన ఎదురుగా నిలబడి ఉన్న తను వైపు చూసి ఏంటి అని సైగ చేసింది నేను వెంటనే ఆమె నడుము పట్టుకుని మీదకు లాగి lip to lip కిస్ ఇచ్చాను అంతే తను షాక్ లో ఉంది ఆ తర్వాత నను వెనకు తోసి కొట్టడానికి చేయి లేపింది తను నను కొట్టే లోపే నేనే తనని లాగి పెట్టి కొట్టాను అంతే మొత్తం మా చుట్టూ పక్కన ఉన్న వాళ్లు అంత షాక్ లో ఉన్నారు ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ తనకి ఇచ్చి నను కోటాలి అనుకుంటే ఫోన్ చేయి అని చెప్పి వేలిపోయాను 5 years అయింది ఇప్పటి కీ తన నుంచి ఫోన్ రాలేదు “అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్కి

ఇది అంత విన్న ముగ్గురు ఒకే సారి నవ్వడం మొదలు పెట్టారు” ఏంటి ఇది లవ్ స్టోరీ ఆ “అని నవ్వుతూన్నాడు నిఖిల్, ప్రకాష్ నవ్వుతూ” బ్రో దీనికంటే నువు చెప్పక పోయి ఉంటే బాగుండు బ్రో “అని అందరూ నవ్వుతూంటే వినీత వెనక నుంచి వచ్చి విక్కి నీ కొంచెం పక్కకు రమ్మని అడిగింది

విక్కి కూడా లేట్ చేయకుండా వినీత వెనక వెళ్లాడు ఎవరూ లేని ఒక రూమ్ లోకి వెళ్లారు లోపలికి వెళ్లగానే వినీత విక్కి నీ hug చేసుకుంది “నిజం గా నేను అంటే అంత ఇష్టమా” అని అడిగింది “ఇప్పటికిప్పుడు నా ప్రాణం వదిలేయమంటే వదలడానికి నేను రెడీ గా ఉన్న” అని చెప్పాడు విక్కి “అయితే prove చేయి” అని అడిగింది వినీత వెంటనే విక్కి కిటికీ లో నుంచి బయటకు దుక్కాడు కానీ వినీత వాడి చేయి పట్టుకుని లోపలికి లాగింది తరువాత వాడిని గట్టిగా hug చేసుకుని “i love you” అని చెప్పింది “అయిన ఒక అమ్మాయిని అంత మంది ముందు ముద్దు ఆ అమ్మాయి వెనక వాల నాన్న ఉన్నాడు అని చూసుకోవా ఆ రోజు నాకూ నీ ముద్దు లో నువ్వు నను ఎంత కావాలి అని అనుకున్నావో తెలిసింది ఇప్పుడు నువు కార్చిచిన్న కన్నీటి లో నను ఎంత మిస్ అయ్యావో అర్థం అయింది నువు కిటికీ నుంచి దూకినపుడు నీ ప్రేమ తెలిసింది “అని గట్టిగా hug చేసుకుని i love you I love you I love you “అని చెప్పింది

విక్కి కూడా వినీత నీ గట్టిగా hug చేసుకున్నాడు ఆ తర్వాత వినీత walkie-talkie లో “మేడమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీరు తొందరగా రండి ఓవర్” అని వినిపించగానే వినీత విక్కి నీ పక్కకు తోసి బయటకు వెళ్లింది విక్కి కూడా బయటకు వెళ్లాడు. తను ప్రోగ్రామ్ రూమ్ వైపు వెళుతుంటే అప్పుడు ప్రమోద్ ఎవరో అమ్మాయి తో కోపం గా మాట్లాడుతూ కనిపించాడు ఆ అమ్మాయి మాత్రం ప్రమోద్ మీద మీద పడి మాట్లాడుతూంది ప్రమోద్ ఆ అమ్మాయి నీ పట్టించుకోవడం లేదు ఆ తర్వాత ఏదో ఫోన్ వస్తే ఆ అమ్మాయి వెళ్లి పోయింది ప్రమోద్ కూడా వెళ్లిపోయాడు ఇది అంతా చూసినా విక్కి కీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం అయింది

తరువాత విక్కి కూడా పార్టీ లోకి వెళ్లాడు అప్పుడు ప్రకాష్ వెనక నుంచి వచ్చి విక్కి నీ పిలిచాడు “విక్కి తను నా చెల్లి తార” అని పరిచయం చేశాడు అప్పటి వరకు విక్కి కీ అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని ఉన్న అనుమానం బలం అయింది …still more to come