అర్జున్ Part 9

ఎవరా అని చూస్తే వచ్చింది సంగీత తనని చూసి ఏమన్నా తెలిసిందా అని అడిగితే అది చెప్పడానికే వచ్చానే అంటూ ఇంట్లోకి వచ్చింది. ఏమైంది ఎక్కడన్నా కానిపించాడా అని మళ్ళీ అడిగింది లేదే కానీ మార్నింగ్ నాన్న వాకింగ్ చేసి తిరిగి వచ్చేప్పుడు మీ ఇంటి గేట్ దగ్గర ఎవరో అబ్బాయి పడుండడం చూసాడంట నాకెందుకో అతనే అయిఉంటాడు అనిపిస్తుంది అని చెప్పింది.

ఒకసారి నాతో రా అని రియా చేయి పట్టుకుని తనింటికి తీసుకెళ్తూ రావే తను మా ఇంట్లోనే ఉన్నాడు అంది. రియా సంగీత వెంట వెళ్లి తన ఇంట్లో ఒక బెడ్రూం లో పడున్న అర్జున్ ని చూసి పరుగు లాంటి నడక తో వాడి వైపు వెళ్లి కంగారు కంగారుగా వాడిని నిద్ర లేపుతుంది, అది చూసి గదిలోకి వచ్చిన ఒక ముసలాయన ఎవరు అంటూ రియా ని చూసి అరే రియా ఎలా ఉన్నావ్ బేట అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు.

రియా ఆ ముసలోడిని చూసి నమస్తే అంకుల్ అంటూ కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ అర్జున్ ను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటే అతను లేవడు అమ్మ ఇందాకే డాక్టర్ మత్తు మందు ఇచ్చాడు పాపం ఎవరో ఏమో చాలా బాధ లో ఉన్నాడు ఎవరినో తలచుకుని తలచుకొని బాగా ఏడుస్తూ ఉంటే కాసేపు రెస్ట్ ఉంటుంది నేనె చెప్పాను.

ఎవరంటారేంటి అంకుల్ వీడు మా మామయ్య గారి అబ్బాయి అర్జున్, అర్జున్ అరేయ్ అర్జున్ లేవరా అని మల్లి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ముసలోడు వాట్…….? ఎం మాట్లాడుతున్నావ్ వీడు మీ మామ కొడుకా అంటే మా సన్నీ గాడి అబ్బాయి గురుంచే మటాడుతున్నావా…!

అవును అంకుల్ ఇంకెవరిగురించి ఇప్పుడు మా ఫ్యామిలీ లో మిగిలిన ఒకే ఒక్కడు వీడు 6 ఏళ్ల గా…… మొత్తం కథ చెప్పింది అదంతా విని తండ్రి కూతుర్లు ఇద్దరు షాక్ తిన్నారు కాసేపటికి తేరుకుని ఎం మాట్లాడుతున్నావే అసలు నువ్వు చెప్పిందేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు నిన్న కూడా ఇలాగే అమ్మ తో ఇంటికి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ గురించి అడిగితే అప్సెట్ అయ్యి వెళ్లిపోయావ్ అసలు అర్జున్ …… అని ఎదో చెప్పే లోపే ముసలోడు కూతురికి ఇక ఆపేయి అంటూ సైగ చేసాడు.

సంగీత మాట్లాడుతున్నది ఒక్కసారి ఆపి గది నుండి బైటికి వెళ్ళిపోయింది ఇక్కడ రియా ఇంటి ముందు కార్ ఆగింది కార్తిక్ తో పాటు అర్జున్ చెల్లెళ్ళు దిగి లగ్గేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తూ రియా రియా అంటూ పిలవడం మొదలెట్టాడు, తన గొంతు విని పైన గదిలో అర్జున్ ని తలచుకుంటూ ఏడుస్తూ ఉన్న అను కిందకి వచ్చి కార్తిక్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ తను రాత్రి చేసింది ఉదయం జరిగింది అంత చెప్పింది కార్తిక్ వెనకే వస్తున్న పరీ, పూరి ఇంకా ప్రణి ముగ్గురు ఇది విని చేతుల్లోని బ్యాగులు ఒక్కసారి వదిలేసి అను ఇంకా కార్తిక్ దగ్గరికి వచ్చి అసలెంజరిగింది అంటూ మళ్ళీ ప్రశ్నించారు.

జరిగింది తెలుసుకుని ఏడవడం మొదలెట్టారు ఇంతలో కార్తిక్ అను ని రియా గురించి అడిగితే తెలీదు అని చెప్పింది అర్జున్ ని వెతకడానికి వెళ్లుండొచ్చు అని నలుగురిని ఇంట్లోనే ఉండమని చెప్పి కార్తిక్ రియా ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఓ నాలుగడుగులు వేసాడో లేదో రియా ఒక ఇంట్లో నుండి బైటికి వస్తూ కనిపించింది అది చూసి తనదగ్గరికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావ్ ఇప్పుడే వచ్చాము అర్జున్ గురించి తెలిసింది అని రియా తో మాట్లాడుతున్నాడు కానీ రియా ఎం సమాదానం చెప్పకుండా ఎదో పోగొట్టుకున్న దానిలా అలా నడుచుకుంటూ వెళ్తుంది కార్తిక్ ఎంత ప్రయత్నించినా తన దగ్గరనుండి ఏ రకమైన రియాక్షన్ లేదు.

ఇంటి దాకా ఎస్కార్ట్ చేసి తను ఇంట్లోకి వెళ్ళింది అని కంఫర్మ్ చేసుకున్నాక ఎవరి ఇంట్లో నుండి బైటికి వచ్చిందో వాళ్ళింటికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అంటూ గుమ్మం లో అడుగు పెట్టగానే ఎదురుగా ఒక ముసలాయన ని చూసి అరే రామ కృష్ణ గారు మీరా బాగున్నారా అంకుల్ అంటూ కాళ్లపైన పడి ఆశీర్వాదం తీసుకున్నాక రియా ఎందుకోచ్చింది అని తనతో ఎం మాట్లాడారు అని అడిగాడు.

ఇక్కడ ఇంట్లోకి వచ్చిన రియా అర్జున్ చెల్లెల్లు ఎంత పలకరించిన ఉలుకు పలుకు లేకుండా అర్జున్ అప్పటివరకు ఉన్న గదిలోకి వెళ్లి డోర్ వేసేసుకుంది వేసుకున్న వెంటనే అక్కడ కింద కూర్చుని బాధ పడడం మొదలెట్టింది బైటి నుండి అను ఇంకా మిగితా వాళ్ళు ఎంత పలకరించిన సమాధానం ఇవ్వక పోయే సరికి అను తన అన్న కార్తిక్ కి కాల్ చేసింది.

ముసలోడితో మాట్లాడుతున్న కార్తిక్ అను కాల్ ఆన్సర్ చేయగానే వాట్…. అని ఒక్కసారి అంకుల్ నేను మళ్ళీ కలుస్తాను అని పరుగెడుతూ ఇంట్లోకి వచ్చి రియాని బ్రతిమిలాడుతూ డోర్ తీయమని అడిగితే కూడా రియా డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అను తో మిగితా వాళ్ళని తన గదికి తీసుకెళ్లామని చెప్పి పంపించేసి రియా తో తనని క్షమించమని అడిగి దాచాలని దాచలేదని రాగానే ఈ విషయమే చెప్పాలని అనుకున్నాడని తొందరపడి ఎం చేసుకోవద్దు అని నువ్వు లేకపోతే బ్రతకాలేనని ఏదేదో చెప్తూ ఉంటే రియా డోర్ తెరిచింది.

ఇద్దరు కలసి మిగితా వాళ్ళకి ఈ నిజం ఎప్పటికి చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నారు, కానీ ఒకటి మాత్రం చెప్పడం కాదు చూయించి సర్ప్రైజ్ చేద్దాం అనుకుని మిగితా వాళ్ళని పిలిచి వాళ్ళందరూ రేపు ఒక చోటుకి వెళ్తున్నాం అని చెప్పారు. అర్జున్ గురించి అడిగితే ఒంట్లో బాగోలేక హాస్పిటల్ లో ఉంచాం అనగానే అను తప్ప మిగతా వాళ్ళు నమ్మరు తను ఎదో అడిగే లోపే గుమ్మం దగ్గరికి ఎవరో పరుగెడుతూ వచ్చి అన్నా అని పిలిచారు.

వెనక్కు తిరిగి చూసిన కార్తిక్ అరె వినోద్ నువ్వా ఏమైంది ఎందుకు అలా ఆయాసపడుతున్నావ్ అని ఆడిగితే అది అన్న నాన్న పంపించారు మీరు అలా ఒకేసారి పరుగులు పెడుతూ వచ్చేసారంట అందుకే కంగారు పడి ఏమైందో కనుక్కో అన్నారు.

అరె అలాంటిదేమి లేదు రా ఇలా కూర్చో అంటూ అందరూ కూర్చున్న తరువాత కార్తిక్ వినోద్ తో అరె అనవసరంగా అంకుల్ ని కంగారు పెట్టేసానా అలాంటిది ఎం లేదు అంత ఓకే అని నాన్న గారితో చెప్పు సరేనా ఇంకేంటి విశేషాలు ఎం చదువుతున్నావ్ ఇప్పుడు అని ప్రశ్నించాడు, ఇంజనీరింగ్ అయిపోయింది అన్న నాన్న తన కంపెనీలో నే ఎదో డిపార్ట్మెంట్ ని చూసుకో అన్నారు కానీ?

ఏం నికిష్టం లేదా ఏంటి రామకృష్ణ గారు చాలా గొప్ప బిసినెస్ మాన్ ఆయన కంపెనీలో జాబ్ దొరకడం అనేది ఒక గొప్ప వరం గా భావిస్తారు అందరు నువ్వు చాలా లక్కీ ఆయన కొడుకు గా పుట్టడం ఇది ని అదృష్టం కానీ నువ్వేమో అమెరికా కి వెళ్తా అక్కడ జాబ్ చేస్తా అంటున్నావంట, అయిన ఎం ఉంది అక్కడ మేమె అక్కడ నచ్చక ఇటోచ్చాము. అది కాదన్నా అక్కడ ….. అది….. అది నా….. గ…. అని ఎదో చెప్పేలోపు రియా అందుకుని చూసారా అది సంగతి అందుకే అమెరికా అమెరికా అంటున్నాడు. మిరేమో ఏమి తెలుసుకోకుండా క్లాస్ పీకుతున్నారు సర్ కి అక్కడ gf దిరికిందంట, ఎలా పరిచయం ఇద్దరికి ఇంతకీ తన పేరేమిటో చెప్పు అంది. వినోద్ సిగ్గు పడుతూ ఇక నేను వెళ్తాను బై అని పరుగు పెట్టాడు.

వాడు అటు పరుగెత్తగానే ఇక్కడ అందరూ నవ్వుకున్నారు ఒక్క ప్రణీత తప్ప తన మొహం సిగ్గుతో ఎర్ర బడింది కాని అది ఎవరు గమనించలేదు అర్జున్ ఎలాగో గదిలో లేకపోవడం తో కార్తిక్ ఆ రూమ్ అంత సర్ది మెడికల్ సామాన్లన్నీ తీసేసి అను ని ప్రణీత ని ఆ రూం షేర్ చేసుకోమని చెప్పాడు, పైన ఉన్న రెండు బెడ్రూం లలో ఒకదాన్లో మేము (కార్తిక్ రియా) ఇంకో దాన్లో పూర్ణిమ పరిణీత ఉంటారు అని చెప్పాడు.

అందరూ రూముల్లో ఫ్రెష్ అయ్యాక రియా పూర్ణిమ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే కార్తిక్ హాల్ లో టీవీ చూస్తూ ఉన్నాడు పరిణీత జెట్ లాగ్ అని పడుకుని ఉంది అను ఇంకా ప్రణి వాళ్ళ రూంలో మాట్లాడుకుంటున్నారు ప్రణి తన లాప్టాప్ లో ఎవరితో నో చాట్ చేస్తూ ఉంది చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కానీ అను తను చెప్పే మాటలు ప్రణి వింటుంది అని వచ్చినప్పటి నుండి వీళ్ళు వచ్చే దాకా జరిగిన ప్రతి విషయం చెప్తూ ఉంది.

ఇక్కడ మన jr. సంజు నాన్న తోనే ఎయిర్పోర్ట్ లో ఉండి ఉండి అడిగిన ప్రతిది కొనించుకుని బాగా తిని ఆడుకుని అలసి పోయి నిద్రపోయాడు తన అత్తలను ఇప్పటి వరకు చూడలేదని మారాం చేసి వెళ్ళాడు కానీ ఇంకా చూడలేదు డిన్నర్ ప్రిపేర్ చేసాక వాడిని లేపొచ్చని అలాగే పడుకొనిచ్చారు.

ఇక్కడ అను ప్రణి తో మొత్తం చెప్పాక కూడా తన నుండి ఏ రకమైన రియాక్షన్ రాకపోయేసరికి తనని తట్టి పిలిచే సరికి హెడ్ ఫోన్స్ తీసి ఏంటి అని అడిగితే చేతిలో హెడ్ ఫోన్స్ చూసి అను బాగా హర్ట్ అయ్యి ని మొహం అయింది పో అంటూ రూం నుండి బైటికి వచ్చి కార్తిక్ దగ్గర కూర్చుంది.

కార్తిక్ కి అను గురించి చిన్నప్పటి నుండి తెలియడం తో అను ని చూసి మళ్ళీ ఎవరితో గోడవమ్మా అంత కోపంగా ఉన్నావ్ అన్నాడు అది కిచెన్ లో ఉన్న రియా విని తనకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు కార్తిక్ ఎదో ఒకటి చేయి లేకపోతే టాప్ టేపుద్ది అంది ఇది విన్న పూరి కిచెన్ లో కార్తిక్ హాల్ లో ఒకేసారి పగలబడి నవ్వారు దాంతో అను కి తిక్క రేగి పక్కన కనిపిస్తున్న ఒక వాస్ ని నేలకేసి కొట్టి చి అందరూ నాకు ఎగైనెస్ట్ అయ్యారు గా అని తిరిగి రూం కి వెళ్లి, ఇంకా చాట్ చేస్తూ ఉన్న ప్రణి చేతుల్లో నుండి లాప్టాప్ లాక్కొని చూసింది.

డిన్నర్ ప్రిపేర్ చేయడం పూర్తి అవ్వడం తో రియా పరీ ని సంజు ని లేపడానికి పైకి వెళ్తే పూరి కార్తిక్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని ప్రణి ని అను ని పిల్లవడానికి వెళ్ళింది, పరీ ని లేపి కిందకి పంపి సంజు ని ఎత్తుకుని కిందకి వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరినే చూసి వీళ్ళు ఇంకా రాలేదా అంటూ అను…… అను అని పిలుచుకుంటు వాళ్ళ రూం డోర్ తెరిచేసారికి అను పూరి ఇద్దరు ప్రణి ని ఆట పట్టిస్తూ కనిపించారు.

పూరి ప్రణి ని గట్టిగా పట్టుకునేసరికి అప్పుడే రూమ్ లోకి వచ్చిన రియా ని చూసి వదిన….. వదిన అంటూ అను ప్రణి లాప్టాప్ తీసుకొని తన దగ్గరికి వెళ్లి ప్రణి ని చూస్తూ చెప్పనా….. చెప్పనా… చెప్పేస్తున్నా… అంటూ ఉంటే ప్రణి ప్లీస్ ప్లీస్ అని బ్రతిమిలాడుతుంది ఇదంతా చూసిన రియా ఒక్కసారి షాక్ అయ్యి ఏంటిది ఇప్పటిదాకా అంత కోపంలో ఉన్నది ఇలా గెంతులేస్తుంది ఏంటి అని అనుకుని ఏంటది చెప్పెది త్వరగా చెప్పండి అంది.

అను మళ్లి చెప్పేస్తున్నా… అని అనడం ప్రణి…. వద్దు అంటూ తల అడ్డంగా ఊపుతూ ప్లీస్ ప్లీస్ అని బ్రతిమిలాడడం జరుగుతూ ఉంటే సరే సరే అంత తరువాత ముందు డిన్నర్ పదండి అంది కానీ అను అది కాదు ఇప్పుడు ముఖ్యం ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది అని ఎదో చెప్పేలోపు తన చేతుల్లోనుంచి లాప్టాప్ లాక్కొని అంత తరువాత అని చెప్పాన అంటూ మూసేసింది అది చూసి ప్రణి రిలాక్స్ అయ్యింది (మూసేస్తే లాక్ పడిపోతుంది గా అందుకే) ఎవరిది ఇది అని ప్రణి తన దగ్గరికి రాగానే ఇచ్చేసి అను చేయి పట్టుకుని బైటికి తెచ్చింది అను వెనక్కి తిరిగి ప్రణి ని చూస్తూ కన్ను కొట్టి వేలు చూపిస్తూ ని పని తరువాత చెప్తా అంటూ వెళ్ళిపోయింది.

రూంలో ఉన్న పూరి ప్రణి తో ఎంటె ఇలా అయ్యింది ఇవాళ్టితో ని పనైపోతుంది అనుకున్న చ అంత పాడైంది వదిన వల్లే చెప్పనిస్తే ఐపోయేదిగా ఓ పనైపోయేది ఎందుకు ఆపావ్ హా…. నువ్వు ఉరుకో నీకేం తెలీదు ఆ పుస్తకాలు తప్ప అంటూ లాప్టాప్ మంచం పై పడేసి ఇక పద తిందాం నాకు బాగా నిద్రొస్తుంది పడుకుందాం అంటే…. హా… అంటే అంటూ పూరి ప్రణి వెనకే హాల్ లోకి వచ్చి అందరూ భోజనం చేస్తుంటే వీళ్ళు వాళ్ళతో చేరి తినడం మొదలెట్టారు.

అను మాత్రం ప్రణి నే చూస్తూ ఇంకా ఇంకా బయపెడుతూ ఉంటే పూరి ప్రణి ని చూస్తూ నవ్వుతూ ఉంది ఇదంతా గమనించిన పరీ ఏమి అర్థం కాక ప్రణి ని ఏంటని అడిగితే ఏం లేదు అంది రియా ముందు సంజు కి తినిపించి వాడిని హాల్ లోకి పంపి తినడం మాని ముచ్చట్లు పెట్టుకుంటున్న వాళ్ళని ముందు తినండి తరువాత తీరిక గా మాట్లాడుకోండి అంది అందరూ సైలెంట్ అయ్యి భోజనం పూర్తి చేసి ఎవరి గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోయారు ఇద్దరు తప్ప

ఎవరు ఆ ఇద్దరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి చూడండి.