మధ్యాన్నం అంత నిద్రపోయినందున పరీ కి నిద్ర పట్టక రాత్రంతా అను కి కూడా నిద్ర లేకుండా చేసింది, తెల్లారి అందరూ రెడి అయ్యి కార్తిక్ కార్ లో ఎక్కడికో బయలుదేరారు, ఒక అరగంట ప్రయాణం చేసాక అను రియా ఇంకా కార్తిక్ కి అంత ఆశ్చర్యంగా ఎం అనిపించలేదు కానీ పూరి కి ప్రణి కి మాత్రం వాళ్ళు ఎందుకు పాత ఇంటి దారిలో ప్రయనిస్తున్నామని అనుమానం వచ్చింది ఎవరిని ఏమి అడగకుండా వాళ్ళల్లో వాళ్లే ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో కార్ ఆగింది.
సరిగ్గా తమ పాతింటి నుండి ఒక మూడు ఇల్లు దాటి కార్తిక్ కార్ దిగుతూ అందరిని దిగమన్నాడు అను చాలా ఎక్సైట్ అవుతుంది ఎందుకో రియా కి తప్ప ఎవరికి తెలీదు కార్తిక్ కూడా మిగితా వాళ్ళతో కలసి అను ప్రవర్తనకు ఆశ్చర్య పోతున్నారు రియా కార్తిక్ తో అను కి అంత చెప్పసాను అని సైగల ద్వారా మిగితా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పింది, ఒకరి తరువాత ఒకరు ఆ ఇంట్లోకి వెళ్లారు.
గేట్ దగ్గర 4 పోలీస్ లు ఉన్న వాళ్ళని ఆపలేదు ముందుగానే ఇన్ఫోర్మ్ చేసినట్టు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు మెయిన్ డోర్ లో కి ఎంటర్ అవ్వగానే ఒక 40- 45 ఏళ్ల ఆవిడ వాళ్ళని చూసి ఓహ్ కార్తిక్ అండ్ ఫామిలీ వెల్కమ్ అంటూ తన చుట్టూ ఉన్న సోఫాలో వాళ్ళని కూర్చోమని సైగ చేసింది.
అందరు కూర్చున్న తరువాత ఆవిడ ముందు మాట్లాడుతూ, సో వెల్ కార్తిక్ మీ ఫ్యామిలీ లో అందరికి నేను చెప్పిన విషయం మీరు చెప్పే ఉంటారు అయినా నేను మళ్ళో సారి చెప్తాను అసలు విషయం ఏంటో అని ఏమంటారు, కార్తిక్ బదులు గా నో మేడం ఒక్క నా వైఫ్ కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు తన ఐడియా ప్రకారం సప్రైజె చేద్దామని అంది అందుకే… నో ప్రాబ్లెమ్ యువర్ విష్.
థిస్ ఐస్ థ అడ్రస్ విచ్ యు వాంటెడ్ అండ్ బి కేర్ ఫుల్ నో వన్ షుడ్ ఫాలో యు ఓకే, థాంక్స్ మేడం ఫర్ ఎవరీ థింగ్ వాట్ యు డిడ్ ఇక మేము వెళ్తాం అంటూ లేచి బయలు దేరారు అందరు మళ్ళీ కార్ లో ప్రయనం, ఈ సారి కాస్త టైం పట్టింది ఒక రెండు గంటలు.
కార్ ఒక ఫార్మ్ హౌస్ కి చేరింది ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక చిన్న రూమ్ అంత పోలీస్ లు ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫై చేసి అందరిని లోనికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, కార్ కొద్దిగా లోపలికి వెళ్ళిందో లేదో గుంపు గా జనం కనిపించారు రియా ఇంకా కార్తిక్ ముందు కూర్చోవడం వల్ల ఎవరన్నది క్లియర్ గా కనిపిస్తోంది కానీ వెనక కూర్చున్న అను ఇంకా పరీ తప్ప మిగతా ఇద్దరు ఎవరు వీరంతా అని అటు ఇటు తొంగి తొంగి చూస్తూ కొందరిని గుర్తు పట్టి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
కార్ ఆపగానే అందరు ముందు అడ్డంగా వచ్చేసి డోర్లు ఓపెన్ చేస్తూ అందరిని హగ్ చేసుకుంటూ ఎన్నాళ్ళయిందో అంటూ పాలకరింపులు మొదలెట్టారు అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తమ కుటుంబం లోని అందరూ చనిపోయి ఉన్నారని అనుకున్న వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళని చూసి నమ్మలేక పోతున్నారు.
అందరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నాక కలసి లోపలికి వెళ్లారు కాస్త వయసు పై బడిన వాళ్ళు మాత్రం బైటికి రాలేక ఇంట్లోనే ఉండడం తో వాళ్లందరికీ వీళ్ళని పరిచయం చేస్తూ ఉంటే వీళ్ళు అందరి దగ్గర ఆశిర్వాదం తీసుకుని అక్కడ లేని వాళ్ళని గురుంచి అడుగుతున్నారు.
కార్తిక్, రియా వాళ్ళ అమ్మా నాన్నల గురించి అడుగుతుంటే పరీ తన అమ్మ రష్మీ గురించి అడిగింది అది చూసి పూరి ఇంకా ప్రణి కూడా సంజయ్ ప్రీతిల గురించి అడుగుతారు అందరిని వెంటబెట్టుకుని ఒక రూమ్ కి తీసుకు వెళ్తారు.
అక్కడ మూడు మంచాలు వాటి పైన ముగ్గురు మనుషులు ఉంటారు ఒక దాని పైన సంజయ్ ఇంకోదాని పైన ప్రీతి ఆ పక్కన రాఘవ (సుధ భర్త) ఉన్నారు, సంజయ్ పక్కనే రష్మీ వాడికి సేవలు చేస్తూ ఉంది ప్రీతి కి తన పెంపుడు తల్లి స్పాంజ్ బాత్ ఇస్తుంది రాఘవ దగ్గర ఎవరూ లేరు. వాళ్ళని చూసి ప్రణి ఇంకా పూరి పరుగెడుతూ అమ్మ నాన్న అంటూ వాళ్ళని చూస్తున్నారు.
సుధ వాళ్ళని చూసి ఎం కంగారు పడకండి అంతా బాగానే ఉన్నారు ఒక్క ఈ ముసలోడు తప్ప కొద్దిసేపటి క్రితమే పోయాడు అంది, పక్కనే ఉన్న దివ్య సుధా మాటలు విని ఏంటి అమ్మ కొంచం కూడా బాధ లేదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంది, హా ఎందుకే బాధ ఇంకెన్నాళ్లు బ్రతుకుతాడు ఇప్పటికే చాలయింది రేపో మాపో నేను కూడా పోత అంది.
అందరూ నవ్వారు ఇంతలో అక్కడ ఉన్న ఒకరు అర్జున్ గురించి అడగగానే కార్తిక్ వాడికి ఒంట్లో బాగోలేదు తరువాత వస్తాడు అని చెప్పి అసలేం జరిగింది ఇన్నాళ్లు మీ అందరి కోసం ఎంత వెతికానో చివరికి నిన్న ఎయిర్పోర్ట్ లో ఆ IG కనిపించి నన్ను గుర్తు పట్టి విషయం మొత్తం చెప్పి ఈ అడ్రస్ చెప్పింది వెంటనే వచ్చేసాము.
అదంతా మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు కానీ ఆ రోజు (పెళ్లిరోజు) వీడు (సంజయ్ వంక చూపిస్తూ) ఒక్కసారి గట్టిగా అరిచి అందరిని ఒకరితరువాత ఒకరిని రిసార్ట్ లోనుండి బైటికి వెళ్ళమని దూరంగా కనిపిస్తున్న బస్సుల్లో కి ఎక్కమని చెప్తే అందరం ఎక్కాం వీడు ప్రీతి ఇంకా రాలేదు, రాలేదు అంటున్నా వినకుండా బస్ అక్కడినుండి తీసేసారు.
బస్ కాస్త దూరం వెళ్లిందో లేదో ఆ రిసార్ట్ మొత్తం పేలినట్టు మొత్తం మంటలతో కనిపించింది అది చూసి అందరం చాలా బయపడ్డాం ఎక్కువగా భయం వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారని, వారం తరువాత నువ్వు అన్న ఆ IG ఇద్దరిని ఇక్కడికి తెచ్చింది మిగితా వాళ్ళని అంటే మీ గురించి అడిగితే కంగారు పడాల్సిన అవసరం లేదని మీ గురించి చెప్పింది అమెరికా లో ఉన్నారని మా గురించి తెలీలేదని అందుకే వెళ్లిపోయారని చెప్పింది కానీ మా గురించి చెప్పేలోపు నీ (రియా) ఆరోగ్యం పాడవడం ఆ తరువాత సర్ (కార్తిక్) జైల్ కి వెళ్లడం అంత చిందరవందర అయింది.
సంజయ్ ఇంకా ప్రీతి మేలుకొని వీళ్ళని చూసి చాలా సంతోషించారు వాళ్ళ సంభాషణ వింటూ ఉన్నారు ఇంతలో వాళ్ళ వైపు దృష్టి మరల్చిన పూరి ఇంకా ప్రణి అమ్మా అని నాన్నా అని వాళ్ళని పలకరించారు.
సంజయ్ ఇంకా ప్రీతి తమ పిల్లలని ఇన్నేళ్ల తరువాత చూసి చాలా సంతోషించారు కానీ ఇప్పటికీ సంజయ్ ఎవ్వరితోను చెప్పకుండా ఎవరికి తన బాధ కనపడకుండా ఓ రహస్యం తన మనసులో దాచుకున్నాడు ఎవ్వరికి చెప్పకుండా ఇన్నేళ్లు తమ కుటుంబ సభ్యులనే మోసం చేస్తున్నాడు.
కార్తిక్ వేరే వాళ్ళ తో మాటల్లో పడి సంజయ్ మేలుకున్నది గమనుంచలేదు ప్రణి పూరి ల పలకరింపు తో సంజయ్ వంక చూసి తను మేలుకున్నాడని తన ని పలకరించి అసలిదంత ఎలా జరిగింది అని అడిగే సరికి జరిగిందంతా చెప్పుకొచ్చాడు. ఇంతలో ఎవరో ఇంటి బైట నించుని సార్ అంటూ పిలిచే సరికి దివ్య వచ్చింది ఎవరా అని చూడడానికి వెళ్ళింది తలుపుదగ్గర ఒక కానిస్టేబుల్ ని చూసి ఎవరు కావాలి అని అడిగితే మేడం గారు పంపారు కార్తిక్ సర్ ని కలవాలి అని చెప్తే దివ్య రూంలోకి వెళ్లి కార్తిక్ ని పంపుతుంది.
కార్తిక్ ఆ కానిస్టేబుల్ తో ఎదో చెప్తే అలాగే సర్ నేను కనుక్కుంటాను అని వెళ్ళిపోతాడు, కార్తిక్ మళ్ళీ రూంలోకి వచ్చి రియా ని తనతో రమ్మని చెప్పి బైటికి తీసుకెళ్లి తనతో కానిస్టేబుల్ తో ఎం చెప్పాడు అనేది చెప్పి తరువాత కలుస్తాను అంటూ వెళ్ళిపోతాడు.
ఇక్కడ తన పిల్లలని ఇన్నేళ్ల తరువాత కలిసినందుకు సంజయ్ లో చాలా సంతోషం ఉన్న ఎదో బాధ అదే బాధ ప్రీతి లో ఉంది అది ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు కానీ రియా వీల్లేదో దాస్తున్నట్టు ఉన్నారు అని అనిపించి సంజయ్ పక్కకి వెళ్లి తనకి మాత్రమే వినిపించే తట్టు అడిగింది.
సంజయ్ ఎం లేదు అని చెప్పిన వినకుండా చెప్పక పోతే నా పైన ప్రామిస్ అని అంటే ఇక చెప్పాల్సిందే అని అందరిని ఒకసారి తన మాట వినండని చెప్పే లోపు గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి నుండి ఫోన్ వస్తుంది ఎవరో అది ఆన్సర్ చేసి మిగితా వాళ్ళతో ఎం చెప్పకుండానే ఆ వ్యక్తి బైటికి పరుగులు తీస్తూ వెళ్తారు. కాసేపట్లో అందరూ ఉన్న రూం దగ్గరికి ఒక పోలీస్ యూనిఫామ్ లో ఒక ఆవిడ తన వెనక ఒక కానిస్టేబుల్ ఒక అబ్బాయి వస్తారు సంజయ్ ఆవిడ ని చూడగానే అరే వచేశావ నేనె నీకు కాల్ చేద్దాం అనికుంటున్న ఇప్పుడే అందరితో విషయం చెప్పేద్దం అనుకున్న అంటూ తన దగ్గరికి వెళ్లి తన వెనక ఉన్న అబ్బాయి ని ముందుకు రమ్మని సైగ చేస్తూ అందరివైపు చూసి ఇప్పుడు నేను చెప్ప బోయే విషయం ఏంటంటే.
అని ఆ అబ్బాయి భుజం పైన చేయి వేసి కార్తిక్ వైపు చూసి ఇతను మీరు అనుకుంటునట్టు మన అర్జున్ కాదు, ఈవిడ కొడుకు వరుణ్ అని బాంబ్ పేలుస్తాడు అది విని అందరూ షాక్ కాకపోయినా ఇన్నాళ్లు తమతో అర్జున్ లా ఉంటున్న వాళ్ళు షాక్ అయ్యారు.
What…….tha……..f………ak…….
ఒక్కసారిగా అలా చప్పుడు వినిపించే సరికి అప్పటివరకు ఒక మాదిరిగా గోల గోల గా ఉన్న చోట అంత నిశ్శబ్దం గా మారిపోయింది.
ఎస్క్యూస్ మీ మిస్టర్ వాట్ హప్పేండ్ వై అర్ యు షౌటెడ్ లైక్ థట్ అని ప్రశ్నించే సరికి కళ్ళు తుడుచుకుంటూ అసలు నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూస్తూ ఉండగా హే మిస్టర్ ఐ ఆమ్ టాకింగ్ టు యు, …… హలో……. మిస్టర్ ……… హే……. అర్జున్ …… లుక్ హియర్…… అని అరిచాడు.
ఉన్న చోటు నిండి లేచి నించుని తను ఉన్నది క్లాస్ రూమ్ లో అని ఎదురుగా లెక్చరర్ ఉన్నాడని గమనించి తల గోక్కుంటు ఎంజరిగింది అని దిక్కులు చూస్తూ ఉంటే ఆ లెక్చరర్ తన దగ్గర ఉన్న ఒక వస్తువు ని అర్జున్ పైకి విసిరే సరికి అది తల కి తగిలి అబ్బా అని కళ్ళ దగ్గర పడ్డ డస్టర్ ని తీసుకుని ఉన్న చోటు నుండి లెక్చరర్ దగ్గరికి వచ్చి సారి సర్ అని డస్టర్ టేబుల్ పైన పెట్టేసి బైటికి వెళ్ళిపోయాడు.
కొంత దూరం నడిచి వాటర్ డిస్పెన్సరీ కనిపించడం తో కాసిన్ని మంచి నీళ్లు తాగి కళ్ళు కూడా కాస్త కడుక్కుని…, దీనమ్మ జీవితం ఇలాంటి కల వచ్చిందేంటి అంత నిజంగానే జరిగినట్టు అనిపించింది కానీ…… హమ్మయ్య కల కాబట్టి సరిపోయింది, అయినా నేను కనే కలలో నేను లేకుండా ఎలా అన్నేళ్ళు నేనె అంట చివరికి నన్ను చూయించి ఎవడో వరుణ్ అన్నాడు నాన్న. ఎంత విచిత్రంగా ఉంది అనుకుంటూ కొంత దూరం నడిచి ఒక చోట కూర్చుండి పోతాడు.