హలో ఫ్రెండ్స్ నేను రాసిన psychological థ్రిల్లర్ మాస్టర్ పీస్ నీ బాగా సక్సెస్ చేశారు అందుకే నేను ఆ నమ్మకం తో కొత్త కథ మొదలు పెడుతున్నా ఇది నేను చూసిన కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారం చేసుకుని రాస్తున్న కథ ఇది మన రోజు వారి సేవలలో ఒకటి అయిన బ్యాంక్ వ్యవస్థ లో జరిగే కొని కుళ్లు రాజకీయాలు దాని తో పాటు అందులో మనం చూసే స్కామ్ వంటి ఎన్నో విషయాలు నేను విన్నవి చూసినవి ప్రేరణ గా తీసుకొని రాస్తున్న కథ ఇందులో ఒక మంచి ప్రేమ కథ నీ కూడా జోడించి రాస్తూన్న కథ.
ఈ కథ లో థ్రిల్లర్ అంశాలు, ప్రేమ సన్నివేశాలు తో పాటు శృంగార అంశాలు కూడా జోడించి రాస్తున్న కాబట్టి నా ముందు కథలు మాదిరిగా ఈ కథ నీ కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నా. ఈ కథ మొత్తం పూర్తి గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా.
కర్నూల్
బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే కృష్ణమూర్తి ఆయన చిన్న కూతురు పెళ్లి నీ అంగరంగ వైభవంగా చేస్తున్నాడు ఇంటికి వస్తూన్న చుట్టాలను ఆహ్వానిస్తు ఎంతో సందడిగా కోలాహలం గా ఉంది ఇళ్లు, పెళ్లి వారు వచ్చే టైమ్ అయింది కాబట్టి కృష్ణమూర్తి పెద్దఅమ్మ “రేయి పెళ్లి వాళ్లు వస్తాన్నారు అంటివి గా నువ్వు నీ పెండ్లాం పొయ్యి పొలిమేర లోనే హారతి ఇచ్చి తీసుకొని రావాలా పోరి” అని పాత సంప్రదాయాలను చెప్తూంటే ఆయన నవ్వి “అమ్మ ఆ రోజులు పోయినాయి వాళ్లు ఇంటికి కాడికి వచ్చినాక ఆటా చేయాండ్ల నువ్వు లోపలికి పో పోయి నీ మనవరాళ్లు ను తయారు చెయ్యి పోయి “అని చెప్పాడు అప్పుడు వాళ్ల చుట్టాలు అడిగారు అబ్బాయి ఏమీ చేస్తుంటాడు అని” మొన్నె ఢిల్లీ లో సివిల్స్ క్లియర్ చేసి వచ్చాడు ట్రైనింగ్ లెటర్ కూడా వచ్చింది ఇంకో సంవత్సరం లో పోస్టింగ్ వస్తుంది”అని గర్వంగా చెప్పాడు ఇలా బయట అంతా సందడి సందడిగా ఉంటే లోపల పెళ్లి కూతురు పరిస్థితి ఇంకో లాగా ఉంది.
ఇంట్లోని ఆడవాళ్లు అంతా పెళ్లి కూతురు నీ ముస్తాబు చేస్తూ వాళ్లు వాళ్ల పెళ్లి నాటి విషయాలను మాట్లాడుకుంటు ఉన్నారు కానీ పెళ్లి కూతురు కీ మనసులో ఏదో బాధ చిన్నప్పటి నుంచి తను ఏమీ అడిగిన అడ్డుచేప్పని తన తండ్రి ఇప్పుడు తనతో కూడా చెప్పకుండా పెళ్లి నిశ్చయించి ఆ పెళ్లి కొడుకు ఫోటో కూడా చూడనివలేదు అతని తో మాట్లాడింది కూడా లేదు “ఏదో పెద్ద సివిల్స్ క్లియర్ చేస్తే కారెక్టర్ మంచిది అయ్యి ఉంటుందా నాకూ కొన్ని ఆశలు ఉన్నాయి ఒక ఉద్యోగం చేసి నా కాలు మీద నేను నిలబడి ఒక independent ఉమెన్ లాగా బ్రతకాలి అని ఆశ పడ్డాను కానీ జరగలేదు” అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది అప్పుడు వాళ్ల అక్క శ్రీ దేవి “ఏంది మెయి అట్ల ఉంటివి కొంచెం నవ్వు మెయి నాకూ పెళ్లి అన్నప్పుడు అబ్బో నువ్వు అందరూ ఎంత హడావిడి చేసినారు ఇప్పుడు ఏందే నీ పెళ్ళి కీ నువ్వే గుమ్మున ఉంటివి ” అని పెళ్లి కూతురు సిరి(శ్రీలత అసలు పేరు) నీ కొంచెం ఆట పట్టించాలి అనుకుంది కానీ సిరి లో ఎలాంటి మార్పు లేదు దాంతో సిరి మనసులో “దేవుడా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్యి ” అని కోరుకుంది అప్పుడే ఇంటి ముందు ACB జీప్ వచ్చి ఆగింది దాని మీద “శ్రీనివాస్ వెడ్స్ శ్రీలత” అని ఉంది దాంతో కృష్ణమూర్తి పెళ్లి వాళ్లు వచ్చారు అని అందరి నీ పిలిచారు వాళ్ళకి స్వాగతం పలికడానికి అప్పుడు జీప్ నుంచి దిగిన పెళ్లి కొడుకు తండ్రి వెంకటరత్నం ఆయన స్టాఫ్ మాత్రమే దిగ్గడం చూసిన కృష్ణమూర్తి.
“ఎంది బావ ఒక్కరే వచ్చినారు అబ్బాయి అక్క మీ చుట్టాలు ఎక్కడ” అని అడిగాడు కాకపోతే వెంకటరత్నం తన ఐడి కార్డ్ తీసి చూపించి “మిష్టర్ కృష్ణమూర్తి మీరు మీ బ్యాంక్ నుంచి కొన్ని ఫేక్ డాక్యుమెంట్ లు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకొని దాని బినామీ పేర్లతో దాచి ఆ డబ్బు తో మీరు కొన్ని అక్రమ ఆస్తులు కొని మీ కూతురు పెళ్లి చేస్తున్నారు అని మాకు information వచ్చింది మీ ఇళ్లు మేము సొదా చేయాలి” అని చెప్పి వారెంట్ చూపించి ఇళ్లు అంతా సోదా చేశారు దాంతో కృష్ణమూర్తి అక్కడికక్కడే కుళ్ల పడిపోయాడు ACB వాళ్లు ఇళ్లు అంతా సోదా చేసి అక్కడ ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ డబ్బు నగలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాటి గురించి ప్రశ్నలు వేస్తే షాక్ లో ఉన్న కృష్ణమూర్తి ఏమీ చెప్పలేక పోయాడు దాంతో ఆయన భార్య పూర్ణ వాటికి లెక్కలు అని పక్కాగా చూపించడం తో ACB వాళ్లు అని అక్కడే వదిలేసి వెళ్లారు దాంతో కృష్ణమూర్తి కీ సారీ చెప్పి వెళ్లిపోయారు.
పెళ్లి అర్ధాంతరంగ ఆగిపోవడంతో సిరి కీ కొంచెం సంతోషం గా ఉన్న తను కోరుకున్న ఒక చిన్న కోరిక వల్ల బంధువుల ముందు తన తండ్రి అవ్వమన పడటంతో కొంచెం బాధ పడింది సిరి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన పూర్ణ తన పక్కన లేని భర్త నీ వెతుకుతూ హాల్ లోకి వచ్చింది అక్కడ ఊరి వేసుకొని వెళ్లాడుతున్న కృష్ణమూర్తి నీ చూసి గట్టిగా అరిచింది దాంతో అందరూ వచ్చారు ఆ తరువాత ఆ శవాన్ని దించి చుట్టాలు అందరూ పెళ్లికి వచ్చి చావు చూస్తాము అని అనుకోలేదు అని వాళ్ల లో వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు వెంకటరత్నం వచ్చాడు అతని చూడగానే సిరి కీ కోపం కట్టలు తెంచుకొని “సార్ ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ వల్ల మా నాన్న మాకు దూరం అయ్యారు మీరు చేసిన అవ్వమానం చేసి వెళ్లిపోయారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇంకొక సారి మీరు మా ఇంటికి వస్తే మర్యాద ఉండదు మా నాన్న ఇప్పటి వరకు ప్రతిదీ తన కష్టం తో సంపాదించాడు చిన్నప్పుడు నేను బ్యాంక్ కీ వెళ్లి అక్కడ ఒక డబ్బు కట్ట తీసి ఆడుకుంటుంటే అమ్మ మన పర్స్ లో ఉన్నది మాత్రమే మన డబ్బు ఇంక బ్యాంక్ లో ఉన్నది పాము లాంటిది దాని ముట్టుకోకుడదు అని చెప్పి ఇప్పటి వరకు ఆయన నిజాయితీ తో సంపాదించిన డబ్బుతోనే మాకు అన్నం పెట్టాడు ఎప్పుడు పాపిష్టి సొమ్ము ఇంటి దాకా రానివ్వలేదు”అని చెప్పి ఏడుస్తూ ఉంటే వాళ్ల అక్క వచ్చి సిరి పక్కకు తీసుకొని వెళ్లింది, సిరి అక్క మొగుడు కార్తీక్ వచ్చి వెంకటరత్నం నీ ఆయన కార్ దగ్గరికి తీసుకొని వెళ్లి “సారీ చిన్నాయన ఆ పాప కొంచెం కోపం లో ఏదో మాట్లాడేసింది ఏమీ అనుకోకు”అని చెప్పాడు దానికి ఆయన నవ్వి “ఎప్పటికైనా తనే మా ఇంటికి కోడలు” అని చెప్పి వెళ్లిపోయాడు.
పెళ్లి ఆగిపోయి తండ్రి చనిపోవడంతో బాగా డిస్టర్బ్ అయ్యింది సిరి ఏమీ చేయాలో తెలియక ఒక నెల రోజులు ఇంట్లో నే గడిపింది ఇంతలో వాళ్ల ఇళ్లు కట్టుకోవడం కోసం తీసుకున్న లోన్ డబ్బులు వసూలు చేయడానికి బ్యాంక్ వాళ్లు ఇంటికి వచ్చారు కాకపోతే ఆ బ్యాంక్ మేనేజర్ డేవిడ్, కృష్ణమూర్తి ఫ్రెండ్ అవ్వడం ఇద్దరు కలిసి చాలా రోజులుగా కలిసి పనిచేయడం వల్ల ఈ సారికి అయన తన సొంత డబ్బులతో లోన్ installment కట్టాడు ఆ తరువాత సర్విస్ పీరియడ్ లో చనిపోవడంతో ఆ ఉద్యోగం బ్యాంక్ రూల్ ప్రకారం భార్య కీ వస్తుంది కాకపోతే ఆవిడ చదువుకోలేదు కాబట్టి ఆ ఉద్యోగం ఎలాగైనా సిరి కీ వచ్చేలా చేయాలని చూశాడు డేవిడ్ కాకపోతే కృష్ణమూర్తి కీ బ్యాంక్ లో హెడ్ ఆఫీస్ నుంచి తన బ్రాంచ్ వరకు చాలా మంది శత్రువులు ఉన్నారు అది ఆయన నిజాయితీకీ, ముక్కుసుటీ తనం వల్ల వచ్చిన శత్రుత్వం ఇది తెలిసిన డేవిడ్ ముఖ్యంగా భయపడింది బ్యాంక్ యూనియన్ లీడర్ రామిరెడ్డి గురించి ఆ రామిరెడ్డి అసలుకే చాలా మూర్కుడు అమ్మాయిల పిచ్చి, డబ్బు పిచ్చి ఎక్కువ పైగా బ్యాంక్ చైర్మన్ కూడా రామిరెడ్డి అంటే భయపడతాడు.
దాంతో పాటు పోయిన సారి యూనియన్ ఎన్నికల్లో కృష్ణమూర్తి ఎవరో రాజేష్ అని కొత్త కుర్రాడిని తీసుకొని వచ్చి రామిరెడ్డి కీ పోటీగా నిలబెట్టి 25 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా గెలిస్తున్న రామిరెడ్డి కీ సవాల్ విసిరాడు ఆ అబ్బాయి ఎలాగో 15 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు దాంతో పగ పట్టిన రామిరెడ్డి ఆ అబ్బాయి నీ ఒక చిన్న గ్రామం కీ ట్రాన్స్ఫర్ చేయించాడు ఇప్పుడు కృష్ణమూర్తి కీ బస్ సౌకర్యం కూడా లేని ఒక ఊరికి ట్రాన్స్ఫర్ చేయించాడు అంతేకాకుండా ఇంకా చాలా ఇబ్బందులు పెట్టాడు అంతేకాకుండా ఆ ACB రైడ్ కూడా రామిరెడ్డి చేయించి ఉండొచ్చు అని ఒక పుకారు ఉంది బ్యాంక్ లో ఇప్పుడు అలాంటి వాడి చేతిలో సిరి జీవితం ఉంది అని డేవిడ్ భయపడ్డాడు దాంతో విల్లు అయినంత వరకు సిరి నీ రామిరెడ్డి కంటి చూపు నుంచి దూరంగా ఉంచాలని ఆలోచిస్తూ ఉన్నాడు.
బ్యాంక్ హెడ్ ఆఫీస్ కీ వెళ్లి ఆ ఉద్యోగం కృష్ణమూర్తి భార్య కీ బదులు సిరి కీ వచ్చేలా చేయాలని చాలా ప్రయత్నాలు మొదలు పెట్టాడు కాకపోతే ఎటు తిరిగిన తిరిగి తిరిగి రామిరెడ్డి దగ్గరికే వచ్చి ఆగుతుంది దాంతో చేసేది లేక వెళ్లి రామిరెడ్డి నీ ఆశ్రయించాడు డేవిడ్ కృష్ణమూర్తి కీ కూతురు ఉంది అని తెలుసుకున్న రామిరెడ్డి ఆ అమ్మాయిని తీసుకొని రా మాట్లాడాలని చెప్పాడు దాంతో డేవిడ్ ఇంక తప్పక సిరి నీ రామిరెడ్డి దగ్గరికి తీసుకొని వెళ్లాడు సిరి అందం చూసి మోజు పడిన రామిరెడ్డి డేవిడ్ నీ బయటకు పంపి “మీ నాయన అంటే నాకూ చాన అభిమానం అమ్మ ఎంతో నిజాయితీగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉండాడు కానీ పాపం ఏ దిష్టి తగిలిండాదో ఏమో పాపం చెట్టంత మనిషి పాయ” అని ముసలి కన్నీరు కార్చాడు, ఆ తర్వాత తన సిటు నుంచి లేసి సిరి దగ్గరికి వెళ్లుతు “నీ పరిస్థితి చూస్తాంటే బాధ అయితాండాది అమ్మి పెళ్లి ఆగిపాయా, మీ నాయన పాయా నీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తా కానీ మీ నాయన ఏదో ఫ్రాడ్ చేసినాడు అని అంటాండారు ” అని రామిరెడ్డి మాట్లాడుతూ ఉంటే దానికి సిరి ఏదో బదులు ఇవ్వబోయింది కాకపోతే రామిరెడ్డి సిరి నీ మాట్లాడనివకుండా సిరి కుర్చీ వెనక్కి వచ్చి తన బుజం మీద చెయ్యి వేసి నలుపుతు “మీ నాయన మంచి పేరు చెడిపాయా అంతేకాకుండా నీకు ఒక మచ్చ ఉంటాది కదా వాళ్ల నాయన ఇట చేసినాడు అంటా అని” అల జాలి చూపిస్తూ మాట్లాడుతునే సిరి బుజం విప్పు మొత్తం చేయి వేసి రుద్దుతు “కాబట్టి నువ్వు నేను ఒక understanding కీ వస్తే నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా లేదు అంటే ఒక 15 లక్షలు ఇచ్చి మీ నాయన చేసిన ఫ్రాడ్ నీ కవర్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తా ఏం అంటావు “అని అడిగాడు అప్పుడు వెళ్లడానికి లేచిన సిరి గుద్ద మీద చెయ్యి వేసి పిసికాడు దాంతో కంట్లో నుంచి నీరు కారుతున్న అదుపు చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది సిరి ఆ తర్వాత హోటల్ రూమ్ కీ వెళ్లి షవర్ కింద కూర్చుని ఏడుస్తూ ఉంది సిరి వాడు ఎక్కడ ఎక్కడ ముట్టుకున్నాడో అక్కడ అంతా కత్తి తో కోసుకొవాలి అనంత బాధ లో ఏడుస్తూ ఉంది సిరి.
రామిరెడ్డి దెగ్గర జరిగిన అవమానం తో తిరిగి కర్నూల్ వచ్చింది సిరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఈ జాబ్ వదులుకోకుడదు తన తండ్రి చావుకు కారణం అయిన ప్రతి ఒక్కరూ జవాబు చెప్పాలి అని నిర్ణయం తీసుకుంది కాకపోతే రామిరెడ్డి కీ 15 లక్షలు ఇవ్వాలి లేకపోతే వాడి పక్కలో పడుకోవాలి అని దానికంటే చావు నయం అని నిశ్చయం తీసుకుంది సిరి అందుకే తన పెళ్లి కోసం తెచ్చిన డబ్బు ఇచ్చి జాబ్ సంపాదించాలి అని అనుకోని డబ్బు ఇస్తా అని ఒప్పుకుంది, కానీ సిరి వాళ్ల అమ్మ “మళ్లీ నీ పెళ్ళి కీ దాచ్చిన డబ్బు ఇస్తే మళ్లీ నీ పెళ్లి ఎట్లా చేయాలనే వద్దు పాప వేరే లేక డబ్బు తెప్పిస్తా వద్దు” అని బ్రతిమాలింది కానీ సిరి మాత్రం మొండిగా “ఇప్పుడు నేను ఒక్కదాని పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి కీ ఏమీ కాదు కానీ నువ్వు గమ్మున ఉండు అంతే” అని చెప్పింది, కానీ రామిరెడ్డి కీ సిరి అందం మీద కన్ను పడింది అంత తేలికగా వదలడు కదా అందుకే డేవిడ్ కట్టిన లోన్ installment నీ చెల్లదు అని GM (General Manager) తో ఒక లెటర్ పంపించారు దాంట్లో కడితే ఇప్పటి installment కట్టాలి లేదా మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టాలి అని ఉంది దాంతో సిరి ఇంక చేసేది లేక మొత్తం డబ్బు తో లోన్ క్లియర్ చేసింది, దాంతో రామిరెడ్డి సంకలు గుద్దుకున్నాడు ఇప్పుడు ఎలా అయిన సిరి తన పక్క లోకి వస్తుంది అనుకున్నాడు కానీ మరుసటి రోజు ఉదయం సిరి కడప లో హెడ్ ఆఫీస్ కీ వెళ్లింది అప్పుడే రామిరెడ్డి వచ్చాడు తన చెయ్యి విరిగి దానికి కట్టుకటుకోన్ని వచ్చాడు రాగానే సిరి నీ చూసి లోపలికి రమ్మని సైగ చేశాడు.
ఆ తర్వాత సిరి లోపలికి వెళ్లి డబ్బు ఇస్తుంటే షాక్ అయ్యాడు రామిరెడ్డి ఉన్న డబ్బు అంత లోన్ కోసం కర్చుపెటిస్తే ఎలా తెచ్చింది అని షాక్ అయ్యాడు, కానీ కవర్ చేస్తూ “ఎంది అమ్మ డబ్బులు అడిగితే అడిగిన కొంచెం చూసుకొని నాయన దినాలు అని చూసుకుని ఇవ్వాల్సింది అంత బేరిన అవసరం ఎమ్ ఉండాది సరే రాత్రి చైర్మన్ సార్ తో మాట్లాడింటీ ఆయన నీ పోస్టింగ్, జాయినింగ్ ఆర్డర్ తొందరలో పెడతారు లే నువ్వు ఊరికి పో అని నేను చూసుకుంటా” అని చెప్పి సిరి నీ పంపేసాడు, ఆ తర్వాత రామిరెడ్డి మోచేతి నీళ్లు తాగి బ్రతికే జనార్దన్ వచ్చి “ఎంది అన్న అమ్మని అంత తేలికగా వదిలినావు నీ తరువాత నేను వాడుకుందాం అనుకుంటీ అవును ఇంతకీ చేతికి ఏమైవుండాది ” అని అడిగాడు అప్పుడు రామిరెడ్డి తన చేతి నీ చూసుకున్నాడు రాత్రి బార్ లో ఎవ్వడో వచ్చి కావాలని గోడవ పెట్టుకోనీ చెయ్యి విరగోటి వెళ్లాడు ఇది చెప్తే ఉన్న పరువు పోతాది అని బాత్రూమ్ లో జారిపడ్డా అని చెప్పాడు, “ఆ అమ్మి జోలికి పోమాకండి అసలే పీటలకాడా పెళ్లి అగ్గి పాయా, వాళ్ల నాయన పాయా బాగా నష్ట జాతకురాళ్ళు మాదిరి ఉండాది ఆ అమ్మి ని మనతో ఒడిపోయానాడే ఆ పొట్టేగాడు ఆడి పేరు యాంది” అని అడిగాడు, దానికి జనార్దన్ “రాజేష్ అన్న” అని అన్నాడు, “ఆ రాజేష్ వాడి బ్యాంక్ లో పోస్టింగ్ ఇప్పించు ఆడ ఉండడానికి ఇల్లు తినేదానికి కూడు సరిగ్గా ఉండదు దాంతో ఆ పిల్లే ఉద్యోగం వదిలి పోవాలా “అని చెప్పాడు.
(ఆ డబ్బు ఎలా వచ్చింది అంటే శ్రీనివాస్ అదే సిరి నీ పెళ్లి చేసుకోవాలి అనుకున్న అతను తన పేరు బయటకు రాకుండా కార్తీక్ కీ ఇచ్చి సహాయం చేశాడు రామిరెడ్డి చెయ్యి విరిగోట్టింది కూడా శ్రీనివాస్)
సిరి ఇంటికి వచ్చిన వారం కీ తన పోస్టింగ్ ఆర్డర్ లు వచ్చాయి అది అనంతపురం జిల్లాలో అనంతపురం పక్కన ఉన్న చిన్న ఊరు కీ వచ్చింది అక్కడికి బస్ సౌకర్యం సరిగా లేదు పొద్దున 10 గంటలకు ఒకటి మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు ఒకటి ఉన్నాయి అంతే తప్ప మరో మార్గం లేదు షేర్ ఆటో లో వెళ్లచ్చు కానీ అది కూడా రిస్క్ అయిన కూడా సిరి ఓర్చుకోన్ని అనంతపురం లో వాళ్ల పిన్ని వాళ్ల ఇంట్లో నుండి జాబ్ లో జాయిన్ అయ్యింది వాళ్లు కూడా సిరి నీ కన్న కూతురు లాగా చూసుకొని తనకు వాళ్ల బాబాయ్ పాత స్కూటీ ఇచ్చారు దాంతో తను ఏ ఇబ్బంది లేకుండా ఆఫీస్ కీ వెళ్లడం మొదలు పెట్టింది అక్కడ బ్యాంక్ మేనేజర్ రాజేష్ సిరి నీ చెల్లి లాగా చూసుకున్నాడు, అక్కడ పని చేసే శిరీషా అనే ఇంకో అమ్మాయి మంచి ఫ్రెండ్ అయ్యింది సిరి కీ ఒక రోజు బైక్ పంచర్ అయితే బస్ లో వెళ్లడానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్లే సరికి బస్ బయలుదేరింది దాంతో పరిగెత్తుతూ వెళ్లింది అప్పుడు ఎవరో తన నడుము పట్టుకొని లోపలికి లాగారు దాంతో సిరి ఆ టచ్ తను ముందే ఎప్పుడో ఫీల్ అయ్యింది అప్పుడు తనను లోపలికి లాగిన అతని చూసింది తన ఎదురుగా ఉన్న అతని చూసింది అంతే లాగి పెట్టి ఒకటి కొట్టింది వాడిని కానీ వాడు నవ్వుతూ “ఇంకా కోపం తగ్గలేదు అన్నమాట” అని అడిగాడు చందు (సిరి నీ కాలేజీ లో లవ్ చేసిన వ్యక్తి)