డిటెక్టివ్ చంద్రశేఖర్ 4

కృష్ణ, చందన నీ తీసుకోని తన ఇంటికి వెళ్లాడు చందన శేఖర్ నీ తలచుకొని ఏడుస్తున్నే ఉంది శైలు (కృష్ణ భార్య) ఎంత ఓదార్చాలి అని చూసిన కుదరలేదు అప్పుడే కొంత మంది పోలీసులు వచ్చి తలుపు కోడితే కృష్ణ తలుపు తీశాడు వాళ్లు అంత క్రైమ్ బ్రాంచ్ వాళ్లు శేఖర్ శవం నీ పోస్ట్ మార్టం కీ తీసుకోని వెళ్లాము అని చెప్పారు దాంతో శేఖర్ పడిన జీప్ తనదే కాబట్టి డిఎస్పి తనని తీసుకోని రమ్మని చెప్పారు అని తీసుకువెళ్లారు అప్పుడు చందన కూడా శైలు తో కలిసి హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ డిఎస్పి పోస్ట్ మార్టం అయిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్ తో మాట్లాడుతూ ఉన్నాడు “మొత్తం బాడి లో ఆరు బుల్లెట్స్ దిగాయి సార్ దాంతో పాటు ఎనిమిదో అంతస్తు నుంచి పడ్డాడు కాబట్టి స్పాట్ లో చనిపోయాడు అతని రిబ్స్ విరిగి ఊపిరి తిత్తులోకి దిగాయి దాంతో ఒక వేళ అతని బ్రతికి ఉండి ఉంటే నరకం అనుభవిస్తు బ్రతికే వాడు” అని చెప్పారు డాక్టర్ ఇది అంతా విని డిఎస్పి నవ్వి “కన్న తల్లిదండ్రులను బాధ పెడితే అలాంటి వాళ్ల చావు ఇలాగే రాసి ఉంటుంది ఏమో ” అని అన్నాడు దానికి కృష్ణ కీ కోపం వచ్చి వెళ్లి డిఎస్పి కాలర్ పట్టుకున్నాడు అప్పుడు మొత్తం యూనిట్ అంతా కృష్ణ పైకి వస్తుంటే డిఎస్పి వద్దు అని సైగ చేశాడు “కృష్ణ ఏంటి ఇది నేను నీ సుప్రియర్ ఆఫీసర్ నీ తలుచుకుంటే నీ జాబ్ ఉండదు నా కొడుకు లాంటి వాడివి అని ఇంకా సైలెంట్ గా ఉన్న” అని అన్నాడు డిఎస్పి.

దానికి కృష్ణ “నా బొంగులో జాబ్ ఏమన్నావు కొడుకు లాంటి వాడిన సొంత కొడుకు మీద లేని ప్రేమ నా మీద ఏమీ చూపిస్తున్నారు సార్, చిన్నప్పటి నుంచి చూస్తూన్నా సార్ మిమ్మల్ని మీరు మీ డిసిప్లిన్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మీరు చాలా ఇన్స్పిరేషన్ గా కనిపించే వాళ్లు మా నాన్న కూడా పాతిక సంవత్సరాల పాటు మీకు డ్రైవర్ గా మీ చుట్టే నిజాయితీ అనే పదం చుట్టూ తిరిగి తిరిగి మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన మీ వెంటే కుక్క లాగా ట్రాన్స్ఫర్ చేయించుకున్ని వచ్చేవాడు అలా మీ పిచ్చి తో మా డెత్ బెడ్ పైన ఉన్న కూడా మీకు ఇబ్బంది అని రాలేదు సార్ అప్పుడు నాకూ మీ మీద కోపం రాలేదు సార్, ఐఐటి స్టేట్ టాపర్ నీ ఇంజనీర్ అయ్యి అబ్దుల్ కలాం గారి లాగా సైంటిస్ట్ అవ్వాలి అని ఆశ పడ్డా కానీ మా నాన్న శేఖర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అని మీ కళ్ల ముందే పెరిగాను పోలీస్ అయితే మీరు సంతోషిస్తారు నను బలవంతంగా పోలీస్ చేశాడు అప్పుడు కూడా నాకూ మీ మీద కోపం రాలేదు సార్, అప్పటికీ కూడా మీరే ఇన్స్పిరేషన్ పైగా ఏ రంగంలో ఉన్న మీ లాగే నిజాయితీ గా ఉండాలి అని ఆశ పడ్డా కాకపోతే చిన్న ఇన్స్పెక్టర్ జాబ్ అమాయకత్వం ఉంది అని అందరూ ఆడుకున్నారు అది చూసి తట్టుకోలేక నా ఫ్రెండ్ వాడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ కేసు పూర్తి చేసి నాకూ క్రెడిట్ ఇచ్చాడు ఈ రోజు నేను తినే ప్రతి మెతుకు వాడు నాకూ పెట్టిన భిక్ష ఇప్పుడే వాడే లేడు నాకూ ఎందుకు ఈ జాబ్ మహా అయితే ఒక ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టుకుంటా మీరు ఇచ్చే జీతం కంటే డబల్ సంపాదించి నా కుటుంబాన్ని పోషించే శక్తి నాకూ ఉంది, తను నమ్మిన వాళ్ల కోసం న్యాయం కోసం ప్రాణం ఇచ్చే దమ్ము నా ఫ్రెండ్ కీ ఉంది కానీ మీకు ఏమీ మీ చుట్టూ మీకు బజానా చేయడానికి ఒక artificial ప్రపంచంలో బతుకుతున్నారు సార్ బయటికి వచ్చి చూడండి నేను రిజైన్ చేస్తున్నా ఏమైనా చేసుకోండి, కన్న కొడుకు చనిపోతే కసాయి వాడికి కూడా కళ్లలో నీళ్లు తిరుగుతాయి సార్ కానీ మీ లాంటి రాతి గుండె ఉన్న వ్యక్తి నీ ఇన్ని రోజులు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నందుకు నా మీద నాకూ కోపం వస్తుంది ఇప్పుడు ” అని చెప్పి తన భార్య చందన నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కృష్ణ.

కృష్ణ చెప్పినది విన్న రామచంద్ర అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి “సార్ కృష్ణ సార్ resignation లెటర్ వచ్చింది ఏమీ చేయాలి” అన్నాడు దానికి “వాడు ఆవేశం లో ఉన్నాడు disciplinary action కింద కొన్ని రోజులు సస్పెన్షన్ ఆర్డర్ లు ఇవ్వండి అలాగే చందు ఫోన్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా” అని అడిగాడు రామచంద్ర సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఇంకా ఏమీ వివరాలు రాలేదు అని చెప్పాడు, సైబర్ క్రైమ్ ఆఫీసు లో శేఖర్ ఫోన్ చెక్ చేస్తున్న ఒక అతను శేఖర్ పెట్టిన సెక్యూరిటీ సిస్టమ్ చాలా complicated గా ఉంది అని ఫోన్ పక్కన పడేశాడు అప్పుడు ఒక మెసేజ్ చందన కీ వెళ్లింది దాని తరువాత మొత్తం సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యింది, కాకపోతే చందన జేమ్స్ దగ్గరికి వెళ్లి శేఖర్ చనిపోయాడు అని చెప్పింది దాంతో జేమ్స్ స్కూల్ లో ఉన్న పిల్లలు అందరితో కలిసి శేఖర్ ఆత్మ శాంతి కోసం ప్రార్థన చేయించాడు అప్పుడు రేపు ఉదయం ఫ్లయిట్ లో ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లుతున్నాం ప్రోమో వీడియో పంపించమని అడిగాడు దాంతో చందన తన ఫోన్ మెయిల్ నుంచి థామస్ మెయిల్ కీ వీడియో పంపింది ఆ తర్వాత శేఖర్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అని చూసింది అందులో longitude, latitude లో ఏదో అడ్రస్ వచ్చింది దాని గూగుల్ మ్యాప్ లో చూసి వెళ్లింది అది మొన్న శేఖర్, కృష్ణ వెళ్లిన సిడి షాప్ అప్పుడు ఆ మెసేజ్ లో ఏదో కోడ్ పదం అని ఉంటే అది ఆ షాప్ అబ్బాయి తో చెప్పింది దానికి వాడు చుట్టూ చూసి ఒక సిడి తీసి ఇచ్చాడు అప్పుడే ఒక బుల్లెట్ వచ్చి వాడి తలకు తగిలింది దాంతో చందన అక్కడి నుంచి పారిపోతుంటే థామస్ బిల్డింగ్ పై నుంచి చందన నీ కాలుస్తూ ఉన్నాడు కాకపోతే చందన గుంపు లో తప్పించుకోని వెళ్లింది ఆ తర్వాత థామస్ వెళ్లి ఆ సిడి తీసుకోని విరగోటి వెళ్లిపోయాడు.

తరువాత చందన ఇంటికి వెళ్లి తనకి వచ్చిన మెసేజ్ నీ సరిగ్గా చూస్తే అది ఒక వెబ్ సైట్ అడ్రస్ అందులోకి వెళ్లి చూస్తే శేఖర్ చివరగా ఒక వీడియో పెట్టాడు “చందు నువ్వు షాప్ కీ వెళ్లకుండా ఈ వీడియో చూస్తే నీకు ఒక క్లూ రవి కిషోర్ బెడ్ కింద లెటర్ ఉంది అందులో నీ క్లూ ఉంది ఒక వేళ నువ్వు షాప్ వెళ్లి ఈ వీడియో చూస్తే ఈ మర్డర్ చేసినవాడి ఫోటో నీకు దొరుకుతుంది” అని ఆగిపోయింది ఆ వీడియో ఇప్పుడు షాప్ కీ వెళితే రిస్క్ అని హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ రవి కిషోర్ చనిపోయాడు అని అతని బాడి తీసుకోని వెళ్తున్నారు ఫుల్ హడావిడిగా ఉంది తను ఎలాగో లోపలికి వెళ్ళింది అక్కడ బెడ్ కింద ఒక లెటర్ ఉంది అందులో

” you won’t deserve this world brother rest in paradise” అని రాసి ఉంది దాంతో చందన ఈ డైలాగ్ ఎక్కడో విన్నాను అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు గుర్తుకు వచ్చింది అది థామస్ డైలాగ్ అని అంటే కిల్లర్ థామస్ అని తెలిసి షాక్ అయ్యింది.

చందన ఆ లెటర్ చదివి థామస్ ఏ కిల్లర్ అని తెలుసుకుంది కానీ వాడే కిల్లర్ అని ప్రూఫ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు అందుకే ఏమీ చేయాలో తెలియక ఆలోచిస్తూ హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంటే థామస్ బైక్ మీద వచ్చి గన్ తో మళ్లీ చందన పైన ఎటాక్ చేశాడు దాంతో చందన అక్కడి నుంచి పారిపోయింది అప్పుడు ఒక కార్ వచ్చి చందన నీ ఎక్కించుకోని వెళ్లింది కొంచెం ముందుకు వెళ్లగానే ఆ కార్ డ్రైవర్ బ్రేక్ వేస్తే థామస్ సడన్ బ్రేక్ వేసి జారీ పడ్డాడు ఆ తర్వాత ఆ కార్ వేగంగా బెంగళూరు హైవే ఎక్కింది థామస్ నుంచి తప్పించుకున్నా అని చందన ఊపిరి పీల్చుకున్ని ఆ కార్ డ్రైవర్ నీ చూసింది తను సౌమ్యా (చందన పని చేసే చానెల్ ఓనర్) తన బాస్ తనకి డైరెక్ట్ గా వచ్చి సహాయం చేయడం చందన నీ ఆశ్చర్యానికి గురి చేసింది, ఆ తర్వాత సౌమ్యా చందన నీ తీసుకోని ఒక గెస్ట్ హౌస్ కీ వెళ్లింది లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు ఉదయం మాట్లాడుదాం అని చెప్పి సౌమ్యా వెళ్లి పడుకుంది, ఇంత జరిగాక చందన కీ నిద్ర రాదు అని తెలిసి ముందుగానే తనకి ఇచ్చే injection నీ వాటర్ కలిపి ఉంచింది సౌమ్యా ఆ నీళ్లు తాగి చందన ప్రశాంతంగా నిద్రపోయింది.

రామచంద్ర కృష్ణ మాట్లాడింది విన్న తర్వాత శేఖర్ ఇన్వెస్టీగేషన్ చేస్తున్న కేసు మీద ఆలోచన పెట్టాడు ఒక ఆక్సిడేంట్ కేసు నీ, ఒక మామూలు హార్ట్ ఎటాక్ కేసు కోసం తన కొడుకు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని ఆలోచించి ఆ రెండు కేసుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తెప్పించి చూశాడు DK కేసు లో రిపోర్ట్ ప్రకారం అతని తల కీ విండో గ్లాస్ తగిలి మెడ తెగి చనిపోయాడు అని ఉంది, కాకపోతే ఆ రిపోర్ట్స్ తో పాటు ఫొటోలు చూశాడు కాకపోతే అక్కడ మెడ తెగిన మాట నిజం కానీ కొన్ని పంటి గాట్లు కూడా తెలుస్తున్నాయి, ఆ తర్వాత రవి కిషోర్ రిపోర్ట్ ప్రకారం సాయంత్రం ఊపిరి అందక, ఆక్సిజన్ సిలిండర్ కూడా అయిపోవడము తో చనిపోయాడు అని రాసి ఉంది కాకపోతే ఆ రోజు ఉదయమే ఆ రూమ్ లో కొత్త సిలిండర్ నింపి వెళ్లారు అన్న విషయం గుర్తుకు వచ్చింది, తరువాత శేఖర్ రిపోర్ట్ ప్రకారం బుల్లెట్స్ అని 6mm లోతులో దిగాయి అంత లోతులో దిగాయి అంటే అదీ కచ్చితంగా సనైపర్ గన్ నుంచే వచ్చి ఉండాలి అలాంటి గన్ నీ సిటీ లో ఎవరు అమ్ముతున్నారో కనుకోమని చెప్పాడు ఆ తర్వాత సిడి షాప్ కాంప్లెక్స్ లో జరిగిన కాల్పుల గురించి తెలుసుకొని వెళ్లాడు అక్కడ ఆ కుర్రాడికి తగిలిన బుల్లెట్ శేఖర్ బుల్లెట్ తో మ్యాచ్ అయ్యింది, దాంతో రామచంద్ర కీ అనుమానం వచ్చింది ఇది ఏమైన లైసెన్స్ గన్ అయి ఉంటుందా అని అలా ఆ బుల్లెట్స్ నెంబర్ నీ చూసి ఆ మాడల్ గన్ కనుక్కొని అది ఎవరి దగ్గర ఉందో తెలుసుకోమని చెప్పాడు.

ఇక్కడ చందన మరుసటి రోజు ఉదయం లేచే సరికి సౌమ్యా హాల్ లో కూర్చుని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంది అప్పుడే చందన రావడంతో వచ్చి కూర్చోమని చెప్పి సైగ చేసింది చందన కూర్చున్న తరువాత “నువ్వు పోయిన సంవత్సరం ఆ చిల్డ్రన్స్ ట్రాఫికింగ్ కేసు కవరేజ్ చేశావు కదా” అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించింది ఆ తర్వాత కాఫీ కప్పు కింద పెట్టి “చందన నువ్వు చేసిన దానికి మన చానెల్ చాలా టాప్ కీ వచ్చింది దానికి థాంక్స్ కాకపోతే నాకూ ఒక చిన్న పని చేసి పెడితే నీకు ప్రమోషన్ గ్యారంటీ ” అని చెప్పింది కానీ శేఖర్ చనిపోవడంతో తన మనసు దేని మీద ఏకాగ్రతగా లేదు అప్పుడు సౌమ్యా “నేను నిన్ను ఈ హెల్ప్ నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అని అడగడం లేదు నువ్వు నా ఫ్రెండ్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నా ” అని చెప్పి అర్జున్ ఫోటో చూపించి “వీడు శేఖర్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అర్జున్ వీడు పూటక ముందే వాళ్లుకు ఒక ఆక్సిడేంట్ అయ్యింది అందులో వీడి నాన్న చనిపోయాడు వీల అమ్మ వీడికి డెలివరీ ఇస్తూ చనిపోయింది కాకపోతే వీడికి అమెరికా citizenship ఉంది అందుకే అక్కడే ఉంచి చదివిస్తున్నాడు చందు ఇప్పుడు వీడు అక్కడ అనాధ లాగా పెరగడం ఇష్టం లేక శేఖర్ వీడిని దత్తత తీసుకొని ఇండియా తీసుకోని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇలా అయింది శేఖర్ నన్ను చివరిగా కలిసినప్పుడు adopting డాక్యుమెంట్ లో సంతకం పెట్టాడు నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు సంతకం పెడితే వాడిని ఇండియా తీసుకోని రావచ్చు అందుకే నిన్ను అడుగుతున్న నువ్వు ఈ సంతకం పెడితే శేఖర్ చివరి కోరిక తీర్చిన దానివి అవుతావు ” అని చెప్పింది దాంతో చందన ఆలోచనలో పడింది అప్పుడు సౌమ్యా “నువ్వు ఇప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు వాడిని నా చెల్లి అక్కడ చూసుకుంటుంది రేపు వాళ్లు ట్రిప్ కోసం లండన్ వెళ్తున్నారు నువ్వు వెళ్లడానికి కూడా ఏర్పాటు చేశా వాడితో వారం తిరిగి వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వు” అని చెప్పింది సౌమ్యా, దాంతో లండన్ వెళ్లి థామస్ నీ చంపోచ్చు అని ఆలోచించి లండన్ కీ వెళ్లడానికి ఒప్పుకుంది చందన.

శేఖర్ నీ చంపిన వాడి గురించి వివరాలు సేకరిస్తు ఉంటే రామచంద్ర కీ సిడి షాప్ లో ఒక నానో కెమెరా దొరికింది అందులో షాప్ కీ వచ్చి వెళ్లిన వాళ్ల అందరి ఫోటో లు అందులో చందన వచ్చినప్పుడు థామస్ చేసిన ఎటాక్ లో థామస్ సిడి విరగోటి వెళ్లడం అంతా ఫోటో format లో ఉన్నాయి థామస్ ఫోటో నీ ప్రింట్ తీసి దాని మొత్తం అని స్టేషన్ లకి పంపాడు ఆ తర్వాత థామస్ పట్టుకున్న గన్ మాడల్ నెంబర్ దొరికింది దాని క్రాస్ చెక్ చేస్తే అది హీరో రవి కిషోర్ లైసెన్స్ గన్ ఆయన అప్పుడప్పుడు ఫైరింగ్ రింగ్ కీ, లేదా వేట కీ వెళ్లడం అలవాటు ఇప్పుడు ఆ గన్ థామస్ చేతిలో చూసి ఎవరూ ఇచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ రవి కిషోర్ ఇంటికి వెళ్లి వనిత నీ ఎంక్వయిరీ చేశారు అప్పుడు ఆమె ఆ గన్ మిస్ అయ్యి రెండు నెలలు అయ్యింది అని కంప్లయింట్ ఇచ్చాము ఒక కంప్లయింట్ కాపీ చూపించింది కానీ రామచంద్ర నమ్మడానికి సిద్దంగా లేడు అందుకే థామస్ ఫోటో చూపించాడు, అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పి తనకు లండన్ లో షో ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది వనిత కార్ లో ఎయిర్ పోర్ట్ కీ వెళ్లుతు థామస్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పింది దాంతో థామస్ “మనల్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అమ్మ” అని చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం వనిత, చందన ఇద్దరు ఢిల్లీ లో లండన్ ఫ్లయిట్ లో పక్క పక్క సీట్ లో కూర్చున్నారు వనిత నీ చూసిన చందన చాలా సంబరపడింది తన ఇన్స్పిరేషన్ తోనే చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్న అని చెప్పింది, అప్పుడు వనిత కూడా సంతోషంగా తను ఒకరికి ఇన్స్పిరేషన్ అయ్యాను అని గర్వపడింది మాట లో మాట గా వనిత డ్రామా ఈవెంట్ కీ వెళ్ళుతాన్నా అని చెప్పింది దాంతో చందన థామస్ షో కీ తన దగ్గర పాస్ లేదు వనిత నీ trumph కార్డ్ లాగా వాడాలి అని ప్లాన్ చేసింది. ‘

లండన్ లో దిగాక చందన నీ రిసీవ్ చేసుకోడానికి శారదా, అర్జున్ ఇద్దరు కలిసి వచ్చారు చందన నీ చూడగానే అర్జున్ పరిగెత్తుతూ వచ్చి కౌగిలించుకున్ని “అమ్మ” అన్నాడు ఎందుకో తెలియదు వాడు అమ్మ అని పిలవగానే చందన కీ కళ్లలో నీళ్లు తిరిగాయి అప్పుడు శారదా, సౌమ్యా తో ఫోన్ లో “సిస్టర్ మొత్తానికి నాలుగు సంవత్సరాల తరువాత ఆ తల్లి కొడుకులను ఒకటి చేశాం శేఖర్ కూడా ఉంటే ఫ్యామిలీ ఫోటో కరెక్ట్ గా ఉండేది I am missing that idiot ఇంత అస్తి ఉన్న దాని కంటే అందం ఉన్న వాడు ఎందుకు మనలో ఒకరిని కూడా వాడు సెలెక్ట్ చేసుకోలేదు” అంటూ శేఖర్ నీ తలచుకొని బాధ పడింది దానికి సౌమ్యా ” That is called true love sister మనకు వాడి మీద ఉంటే వాడికి దాని మీద ఉంది కాబట్టి ఈ జన్మకి వదిలేదాం ” అని చెప్పింది అప్పుడు చందన అర్జున్ తో తన దగ్గరికి రావడం చూసి ఫోన్ కట్ చేసింది శారదా, “వీడు నను అమ్మ అంటున్నాడు ఏంటి” అని అడిగింది చందన, దానికి శారదా “చందు ఎప్పుడు ఫోన్ చేసిన నీ ఫోటో చూపించే వాడు అందుకే నిన్ను అమ్మ గా వాడిని నాన్న గా ఫిక్స్ అయ్యాడు ” అని చెప్పింది ఆ తర్వాత వనిత వచ్చి చందన నీ పలకరించీంది అప్పుడు అర్జున్ నీ చూసి ముద్దుగా ఉన్నాడు అని ఎత్తుకొని ఆడించింది తరువాత వాడు శారదా తో కలిసి ఐస్ క్రీమ్ కోసం వెళ్లాడు అప్పుడు వనిత చందన నీ తన భర్త గురించి అడిగింది అప్పుడు చందన తను రీసెంట్ గా చనిపోయాడు అని చెప్పింది అప్పుడే ఒక సాంటా క్లాస్ వేషం వేసుకుని ఒక అతను వచ్చి ఇద్దరిని హగ్ చేసుకొని బెలూన్ ఇచ్చి వెళ్లాడు అప్పుడు వనిత చందన తో “చూడు అమ్మ తల్లి అవ్వడం చాలా గొప్ప విషయం నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యి అని సాధించిన నాకూ అంటూ పిల్లలు లేరు అని బాధ భరించలేక పోయాను కానీ నాకూ కొడుకు లాంటి వాడు ఒకడు ఉన్నాడు వాడి కోసం ఇక్కడికి వచ్చా” అని చెప్పి వస్తున్న థామస్ వైపు చూపించింది.

వాడిని చూడగానే చందన రక్తం మరిగింది వాడిని అక్కడే చంపేయాలి అనంత కసి ఉన్న నవ్వుతు ఉంది థామస్ నీ చూడగానే “ఏంటి హీరో షో కీ బాగ ప్రిపేర్ అయ్యావ” అని అడిగింది చందన, అప్పుడు వనిత ఆశ్చర్యంగా “మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా” అని అడిగింది దాంతో చందన ఎలా తెలుసో చెప్పింది ఆ తర్వాత సాయంత్రం షో కీ రమ్మని పాస్ ఇచ్చి వెళ్లింది వనిత థామస్ కూడా నవ్వుతూ చందన కీ బాయ్ చెప్తూ వెళ్లాడు అప్పుడే శారదా పరిగెత్తుతూ వచ్చి అర్జున్ కనిపించడం లేదు అని చెప్పింది అప్పుడు చందన థామస్ వైపు చూస్తే వనిత అర్జున్ నీ తీసుకోని కార్ లో కూర్చుని నవ్వి కార్ పోనివ్వు అని సైగ చేసింది. (థామస్ ఎయిర్ పోర్ట్ కీ వచ్చి చాలా సేపు అయ్యింది అక్కడ ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉంటే అర్జున్ చందన నీ కౌగిలించుకోవడం చూసి వాడిని అడ్డుపెట్టుకోని చందన నీ దారి నుంచి తప్పించుకోవాలి అని వాళ్ల అమ్మ తో కలిసి చందన దగ్గరికి వచ్చి మాటలో పెట్టి అర్జున్ నీ కిడ్నాప్ చేశారు), థామస్ వేగంగా ట్రాఫిక్ లో కలిసి పోయాడు అప్పుడు శారదా కార్ నడుపుతుంటే చందన టెన్షన్ లో ఉంది అప్పుడు తన ఫోన్ కీ ఏదో మెసేజ్ వస్తే చూసింది అందులో అర్జున్ ఫోన్ లొకేషన్ చూపిస్తూ ఉంది దాంతో వాళ్లు ఆ లొకేషన్ బట్టి “రాయల్ ఆల్బర్ట్ హాల్” షో జరిగే లొకేషన్ కి చేరుకున్నారు.

ఇక్కడ ఇండియా లో రామచంద్ర తన కొడుకును చంపిన వాడి కోసం డిపార్టుమెంటు లో తనను మళ్లీ ఎవరూ వేలు ఎత్తి చూపకుండా ఉండాలి అని రాత్రి పగలు కష్టపడుతు ఉన్నాడు ఎటు చూసినా దారులు అని మూసుకొని వెళ్లుతున్నాయి అప్పుడు పోస్టు మార్టం రిపోర్ట్ మళ్లీ మళ్లీ చూసి కోపంతో ఫైల్ విసిరేసాడు “నా ముందు నిక్కర్ వేసుకొని తిరిగి పెరిగిన ఆ కుర్ర కుంక వాడి మాటలకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి రోజుకు ఎంతోమంది చస్తున్నారు అందులో వీడు ఒకడు అయితే మాత్రం వీడి కోసం నేను నా టైమ్ ఎందుకు పాడు చేసుకోవాలి” చిరాకుగా అరిచి సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ కోసం చూసి దొరక ఒక కానిస్టేబుల్ నీ అగ్గిపెట్ట అడిగాడు అతను కంగారుగా వస్తూ శేఖర్ ఫైల్ నీ కాలితో తన్నితే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయ్ అందులో ఒక ఫోటో రామచంద్ర కాలి దగ్గర పడింది అది చేతిలోకి తీసుకుని చూస్తే అది శేఖర్ వీపు ఫోటో అందులో శేఖర్ వీపు మీద “G” అని tattoo ఉంది అది చూసి రామచంద్ర షాక్ అయ్యి తన డ్రైవర్ తో హాస్పిటల్ కీ వెళ్లాలి అని చెప్పాడు.

అక్కడ చందన, శారదా నీ కార్ లోనే ఉండమని చెప్పి లోపలికి వెళ్లింది అక్కడ బ్యాక్ స్టేజీ లో అందరూ రిహార్సల్ చేస్తుంటే థామస్ వనిత నీ తీసుకోని పై ఫ్లోర్ కీ వెళ్లుతు కనిపించాడు కానీ డైరక్షన్ వేరే వైపు చూపిస్తుంటే వనిత వైపు చూసింది చందన తన చేతిలో బాగ్ లేదు అప్పుడు బాగ్ అర్జున్ ఉన్న రూమ్ లో ఉంది ఏమో అని అక్కడికి వెళ్లింది అనుకున్నటే అర్జున్ ఆ రూమ్ లో ఉన్నాడు అప్పుడు చందన వాళ్లు ఎక్కడికి వెళ్లారు అని అనుమానం తో వాళ్ళని ఫాలో అయ్యింది థామస్ వనిత నీ తీసుకోని హాల్ లో పై ఫ్లోర్ కీ వెళుతు “అమ్మ నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది” అని చెప్పి తీసుకోని వెళ్లాడు అక్కడ జేమ్స్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వనిత రాగానే తన గడ్డం తీసి కళ్లకు ఉన్న అద్దాలు తీసి తన చేత్తి కర్రతో వనిత వైపు అడుగులు వేస్తూ వచ్చాడు అతని చూసి షాక్ అయిన వనిత కళ్ల లో నీళు తిరిగాయి వెంటనే అతని గట్టిగా కౌగిలించుకున్ని “రాజ్” అని అరిచింది అప్పుడు దేవరాజ్ వనిత నీ తన గుండెల్లకు హత్తుకోని “అవును వనిత నేనే నీ రాజ్ నీ” అని అన్నాడు తన కళ్లను తనే నమ్మలేదు చందన 20 సంవత్సరాల క్రితం చనిపోయిన దేవరాజ్ ఇంకా ఎలా బ్రతికి ఉన్నాడు అని అప్పుడు అర్జున్ గురించి తెలుసుకోవడానికి శారదా చందన కీ ఫోన్ చేస్తే ఆ సౌండ్ కీ లోపల ఉన్న ముగ్గురు చందన వైపు చూశారు.

దాంతో చందన అర్జున్ నీ తీసుకోని అక్కడి నుంచి కిందకు వచ్చి శారదా నీ కార్ తీయమని చెప్పింది కాకపోతే థామస్ గన్ తో ఎటాక్ చేస్తే చందన అర్జున్ తో పరిగెత్తి పారిపోయింది అప్పుడు థామస్ ఒక బైక్ అతని కొట్టి బైక్ తో వాళ్ళని వెంబడించాడు, ఇండియా లో రామచంద్ర హాస్పిటల్ లో డాక్టర్ నీ కలిసి శేఖర్ బాడి కోసం మార్చరి కీ వెళ్లారు అక్కడ కోల్డ్ బాక్స్ లో ఉన్న శేఖర్ శవం తీసి దాని వెనకు తిప్పి చూశారు శేఖర్ వీపు పైన “G” అని tattoo చూసి “వీడు చందు కాదు” అన్నాడు రామచంద్ర, అక్కడ థామస్ వెంబడిస్తు ఉంటే ఒక పార్కింగ్ లోకి వెళ్లి లిఫ్ట్ ద్వారా పై ఫ్లోర్ కీ వెళ్లారు చందన, అర్జున్, దాంతో థామస్ బైక్ తో పైకి వెళ్లడం మొదలు పెట్టాడు, రామచంద్ర చెప్పింది విన్న డాక్టర్ “ఏంటి సార్ మొన్న మీరే ఇతను మీ కొడుకు అని చెప్పారు ఇప్పుడు కాదు అంటున్నారు” అని అడిగాడు దానికి రామచంద్ర “ఇప్పుడు అదే చెప్తున్నా వీడు నా కొడుకే కాకపోతే చనిపోయినది చందు కాదు వీడు చందు కాదు గుణ” అని అన్నాడు.

అక్కడ వాళ్లు పై ఫ్లోర్ కీ రాగానే థామస్ బండి బాగా రైస్ చేసి పెట్టాడు చందన లిఫ్ట్ నుంచి బయటకు రాగానే బైక్ తో ముందుకు దూసుకొని వచ్చాడు, అప్పుడే కింద ఫ్లోర్ నుంచి ఒక కార్ వేగంగా వచ్చి చందన అర్జున్ చుట్టూ జీరో కట్ కొట్టింది దాంతో థామస్ ఆ కార్ కీ తగిలి ఎగిరి పడ్డాడు, “అసలు ఈ గుణ ఎవరూ” అని డాక్టర్ అడిగాడు దానికి “నాకూ ఇద్దరు కొడుకులు కవలలు చంద్రశేఖర్, గుణశేఖర్” అని అన్నాడు రామచంద్ర, అప్పుడు చందన కీ ఒక పది అడుగుల దూరం లో పడిన థామస్ లేస్తుంటే కార్ లో నుంచి చంద్రశేఖర్ దిగాడు.