ఖర్కోటఖుడు – Part 10

“వెల్ మిస్టర్ జెంటిల్మెన్. ఆ హార్ధిక్ ఏం చేస్తున్నాడో తెలిసిందా?” అన్నాడు రిచర్డ్స్ మౌనాన్ని చేదిస్తూ.

” మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఇక్కడ లోకల్ కిల్లర్స్ ని హైర్ చేసుకున్నాడు. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మనకి ఇక్కడ సాయం చేస్తున్న ఛటర్జీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు.” అన్నాడు రిచర్డ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్.

“ఏంటి? ఛటర్జీ కనిపించడం లేదా? అతను లేకపోతే మనకి ఇక్కడ ఎవరు సాయం చేస్తారు? ఎక్కడున్నాడో కనుక్కోండి క్విక్” ఉరుముతూ అన్నాడు రిచర్డ్స్.

“యెస్ సర్” అంటూ జాన్ అక్కడ్నుంచి వెళ్తుంటే “హా జాన్.. ఛటర్జీ ఇక్కడ లోకల్ ఎంపీ ఎవరో తనకి బాగా తెలుసని చెప్పాడు కదా? అతని డీటెయిల్స్ ఎంక్వైరీ చెయ్. అలాగే మన నావల్ కమాండ్ ఆఫీసర్ టిమ్ ని కూడా ఒకసారి కాల్ చెయ్యమని చెప్పు.” అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు.

)))))**◆ 【√/@®€$# ♂♀】 ◆****(((((

హార్ధిక్ కోసం తన అనుచరులతో, వాహనాలతో ఎదురుచూస్తున్న హాథీకి హార్ధిక్ తో పాటుగా మరొక 40 మంది రావడం వాళ్ళ వెనక మోసుకువస్తున్న పెద్ద లగేజ్ చూస్తుంటే భయమేసింది.

హార్ధిక్ చెప్పినట్టు తాను తీసుకువచ్చిన 100 మంది కూలీలు హాథీ సైగ చెయ్యగానే పరుగుపరుగున వెళ్ళి అక్కడ నుంచి కూడా తీసుకొచ్చిన రెండు పెద్ద కంటైనర్ లారీలలోకి లోడ్ చేశారు.

అక్కడి నుంచి వాహనాలు హైవే దాటుకుంటూ హార్ధిక్ ప్యాలస్ ముందు ఆగాయి.

అందులోంచి ఒక్కొక్క వెపన్ తీసి సర్దుతుంటే హాథీ గుండెలు లబలబా కొట్టుకున్నాయి.

హాథీ వెంటనే హార్ధిక్ తో “సర్ ఏంటి ఇవన్నీ?” అన్నాడు.

“వెపన్స్ హాథీ.. కనిపించట్లేదా?”

“ఇవన్నీ ఎందుకు?”

“ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. పనికొస్తాయని తెచ్చాను”

“సర్ మన దగ్గర ఉన్న మందీ మార్బలం సరిపోదా?”

“హాథీ.. యుద్ధం అనేది చదరంగం లాంటిది. మన దగ్గర అన్నీ ఉండాలి”

“అయితే మాత్రం? ఇన్ని ఎందుకు సర్?”

“చెప్పాను కదా చదరంగం అని. మంత్రి అన్నీ చేస్తాడు అనుకుంటే గుర్రం చేసే పని చెయ్యలేడు కదా? భటుడు కూడా అటువైపు వెళ్తే మనకి నచ్చిన పావులా మారతాడు. అందుకే ఏదీ వదులుకోకూడదు. అన్నిటినీ సమర్ధవంతంగా వాడుకుంటేనే విజయం సాధిస్తాం.”

హాథీ మరింకేం మాట్లాడలేదు.

వచ్చిన సిబ్బంది మొత్తానికి రూంలు ఏర్పాటు చేసి హార్ధిక్ గదిలోకి వచ్చాడు హాథీ.

హార్ధిక్ అప్పుడే బీన్ బ్యాగ్ మీద పడుకుని రిలాక్స్ అవుతూ మందు కొడుతున్నాడు.

మర్యాదగా డోర్ కొట్టాడు హాథీ.

తాగుతున్న హార్ధిక్ డోర్ వంక చూస్తూ “హా హాథీ.. లోపలికి రా” అన్నాడు. హాథీ లోపలికి వచ్చాక “చెప్పు” అన్నాడు.

“అదే సర్ ఆ కాల్ గర్ల్ ని మన వాళ్ళతో ఎందుకు కిడ్నాప్ చేయించారు?”

“ఓహ్ అదా? ఇంతకీ ఆ విషయమే మర్చిపోయాను. వెళ్ళి మల్హోత్రాని, ఆ అమ్మాయిని తీసుకురా పో.. ” అంటూ హాథీని పంపేసి మళ్ళీ మత్తులో జోగడం మొదలెట్టాడు హార్ధిక్.

హాథీ వెంటనే వాళ్ళ గదిలోకి పరుగులు పెట్టాడు. నెక్స్ట్ హార్ధిక్ ఏం చేస్తాడని తనకి అస్సలు అర్థం కావడం లేదు. నవ్వుతూ నరకానికి పంపించేస్తున్నాడు. ఒకప్పుడు మన్మధుడు అనుకునేలా ఉండే హార్ధిక్ ఇప్పుడు రుద్రతాండవం చేస్తున్న వీరభద్రుడిలా కనిపిస్తున్నాడు.

గంగాదాస్ మనుషుల్ని పూజని తీసుకురమ్మని చెప్పి, పరుగుపరుగున మల్హోత్రా రూమ్ డోర్ కొట్టాడు హాథీ.

డోర్ తీసి ఏమిటన్నట్టు చూసాడు మల్హోత్రా హాథీ వంక.

“సర్ రమ్మంటున్నారు” అన్నాడు హాథీ పరుగు వల్ల వచ్చిన ఆయాసంతో రొప్పుతూ.

“సరే వస్తున్నా పద” అంటూ డోర్ లాక్ చేసి హాథీని వెంబడించాడు మల్హోత్రా.

హాథీ, మల్హోత్రా అక్కడికి చేరుకునేసరికి పూజా గదిలో నిలబడి ఉంది.

)))))**◆ 【√/@®€$# ♂♀】 ◆****(((((

జమైకన్ సిగార్ కాలుస్తున్న రిచర్డ్స్ ఫోన్ రింగవుతుంది. కళ్ళు తెరిచి స్క్రీన్ వంక చూసేసరికి అమెరికన్ నావల్ చీఫ్ టిమ్ కాల్ చేస్తున్నాడు.

“హెలో టిమ్..”

“గుడ్ మార్నింగ్ సర్.” విష్ చేసాడు టిమ్.

“నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను.”

“ఓకే.. కాల్ చెయ్యమన్నారు అంట?”

“హా.. నాకు నేవీ సీల్స్, డెల్టా ఫోర్స్ నుంచి ఒక పదిమంది షార్ప్ అండ్ ఎక్సపెరియన్స్డ్ కమాండోస్ కావాలి. ఎరేంజ్ చెయ్. వాళ్లకు కావలిసిన వెపన్స్ కూడా. ఎక్కడికి, ఎలా అనేది నీకు మళ్ళీ కాల్ చేస్తా” అంటూ కాల్ కట్ చేసాడు రిచర్డ్స్.

రిచర్డ్స్ మనసులో ఏవేవో ఆలోచిస్తున్నాడు. తన ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఎలాగైనా ఫలంగా మార్చుకోవాలి.