ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు

హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న రాజేష్ ఆంధ్రా యూనివర్సిటిలో పని ఉండి వైజాగ్ వచ్చాడు. వైజాగ్ ఎప్పుడు వచ్చినా తన క్లోజ్ ఫ్రెండ్ మదన్ దగ్గర ఉండడం అలవాటు..పొద్దున్న యూనివర్సిటిలో పని చూసుకున్నారు ఇద్దరు కలిసి..రాత్రి ఎప్పటిలాగే నాలుగు బీర్లు కొనుక్కుని, మద్దిలపాలెం నుంచి సింహాచలం వెళ్ళడానికి కొత్తగా వేసిన రోడ్డులోకి వెళ్లారు..సాయంత్రం 10 తర్వాత ఆ రోడ్డు నిర్మానుష్యంగా అయిపోతుంది.మందు కొట్టడానికి మంచి spot..అప్పుడప్పుడు ఎవడైనా constable patrolling కి వస్తే ఒక వంద చేతిలో పెడితే సరిపోతుంది..అటు ఇటు కొండలు, మధ్యలో నల్లతాచు లాగా తారు రోడ్డు..చూడడానికి చాలా బావుంటుంది..రోడ్డు పక్క pavement మీద కూర్చుని చల్లటిగాలిలో chilled beer తాగుతుంటే భలే ఉంటుంది..ఇద్దరు మాటలు చెప్పుకుంటూ నాలుగు బీర్లు పూర్తి చేసేసరికి 12 అయ్యింది..room కెళ్ళి alpha hotel నుంచి తెచ్చుకున్న dum biryani పార్సిల్ తినేసి పడుకున్నారు..

మధ్య రాత్రిలో మదన్ లేచి రాజేష్ మొబైల్ తీసుకున్నాడు..contacts ఓపెన్ చేసి మొత్తం list అంతా జల్లెడ పట్టి మూడు numbers save చేసుకున్నాడు..రాధ,ప్రవల్లిక,సంగీత..తరువాత మళ్ళి మొబైల్ తీసిన చోట పెట్టేసి పడుకున్నాడు..

next రోజు రాజేష్ తిరిగి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయాడు..

DAY-1

రాజేష్ వెళ్ళిపోయిన తర్వాత మదన్ మొబైల్ తీసి sms balance చెక్ చేసుకున్నాడు..ఇంకా 7500 msgs ఉన్నాయ్..’Hi’ అని msg type చేసి రాత్రి save చేసుకున్న మూడు numbers కి పంపాడు..రాధ నెంబర్ కి msg deliver కాలేదు..ప్రవల్లిక number కి msg deliver అయ్యింది కానీ reply రాలేదు..ఒక 10 minutes అయిన తర్వాత సంగీత number నుంచి who is this?? అని reply వచ్చింది..

మదన్: అదేంటి కొత్తగా??

సంగీత : what?

మదన్: who is this అంటావేంటి? నా number delete చేసేసావా?

సంగీత: సారీ…నాకు మీరెవరో గుర్తు రావడం లేదు..

మదన్ : నేను రా మదన్, వైజాగ్ నుంచి..

సంగీత: సారీ మీరెవరనుకుని ఎవరికి msg చేస్తున్నారో…my name is సంగీత..

మదన్: రేయ్..కామెడి చెయ్యకు..సరేగాని నేను ఆఫీసు లో ఉన్నా..రేపు chat చేద్దాం bye…

సంగీత వెంటనే మదన్ నెంబర్ కి కాల్ చేసింది…అది switch off అని వచ్చింది..

DAY-2

మదన్: Good morning

సంగీత : Hello I am not your friend ok..dont msg me again..

మదన్ సంగీత number కి call చేసాడు..

“హలో”

ఓ I am sorry అండి మా ఫ్రెండ్ నెంబర్ అనుకున్నా..

“ Its ok”

నిజంగా సారీ అండి.but number ఎలా change అయ్యిందో అర్ధం కావట్లేదు..any way trouble ఇచ్చాను..సారీ.

“పర్వాలేదు bye..”

DAY-3

మదన్: రాత్రంతా తను లేడనే విరహ వేదనతో కుమిలిపోతున్న పుడమిని సూర్యుడు తన వేల కిరణాల చేతులతో ఆత్రంగా హత్తుకుంటాడు..ఆ కౌగిలికి పులకించిపోయిన పుడమి చెక్కిళ్ళ వెంట జారిన ఆనంద భాష్పాలు పైరు అంచుల మీది నీటి బిందువులై ప్రకృతికి అందాన్ని తెస్తాయి..గుడ్ మార్నింగ్..

ఒక అరగంట తర్వాత…

మదన్: అయ్యో సారీ అండి..మీ number message groups లో నుంచి delete చేయలేదు..అందుకే ఇందాక పంపిన msg మీకు కూడా వచ్చేసింది…