అమ్మ ఒడికి దారేది?

దేవా ది బిలినియర్…వేలకోట్ల ఆస్తి ఉన్నా వెలితి , అమ్మలేని వెలితి.పద పదహారు సంవత్సరాలుగా అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో తెలియక అల్లాడిపోతున్నాడు దేవా. నాన్నకు జబ్బుచేసి మంచానపడ్డాడు.ఈ వయసులో బార్య కావాలనిపించి కొడుకు దేవాను పిలిచి …మీ అమ్మకు ఏవోవో ఆలోచనలు అవన్నీ తీర్చాలంటే నావల్ల కాదు అందుకే దూరంగా వుంటున్నాం’ ఇంతకీ ఇప్పుడు అమ్మ ఎక్కడుంది నాన్నా? హైదరాబాద్లో వుందని విన్నా అంతకు మించి నాకేం తెలియదురా… నాన్నా నేను అమ్మను ఎలాగైనా ఇంటికి తీసుకువస్తా నన్ను నమ్మండి. ఆ ఆశతోనే బతుకుతానురా… అమ్మకోసం హైదరాబాద్ బయలుదేరాడు దేవా. అమ్మకు సేవా దృక్పదం ఎక్కువని తెలిసిన దేవా ఆ వైపుగా తను అమ్మకోసం వెతకటం ప్రారంబించాడు. ఒకరోజు దేవా రోడ్డుపై వుండగా ఒక అంధ బృందం రోడ్ దాటుతుండగా వారికి హెల్ప్ చేశాడు. అది గమనించిన శారద అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. దేవా ఎక్కడెక్కడో తిరిగినా అమ్మ ఆచూకీ తెలియలేదు. చివరకు శారదా అనాధశరణాలయం చేరి తన తల్లిగురించి అడిగాడు. అక్కడున్నవారు చెప్పినట్టు ఆ ఆశ్రమం హెడ్ శారదగారిని కలిసి;;; నమస్తే మేడం …. నమస్తే కూర్చొండి ఏం కావాలి? మా అమ్మగారిని వెతుక్కుంటూ వచ్చాను మేడం మా అమ్మ పేరు శారదాదేవి సేవాభావంతో సర్వస్వం వదిలేసింది. ఇప్పుడు మా నాన్న చివరిరోజుల్లో వున్నారు.మీ కేమైనా తెలిస్తే కాస్త నాకు చెప్పండి మేడం. అలాగా నాకు తెలిస్తే తప్పకుండా

మీ నాన్నగారి పేరేంటి బాబూ? జగపతి మేడం. అలాగా ? అంటే నువు నా కొడుకువన్నమాట అనుకుంది మనసులో శారద. ఏం ఆయన మీకు తెలుసా మేడం? తెలియకేం బాబూ వేలకోట్ల ఆస్తులున్నా అన్నార్తులకు పైసా విదిలించని వాడు. ప్రేమ జాలి దయ లేని ఒక పాషాణం.ఆవేశంగా చెబుతోంది శారద.

మేడం అన్న దేవా పిలుపుకు తేరుకొని శారద సారీ బాబూ….ఏదేదో మాట్లాడాను. పరవాలేదాంటి మీరు నిజమే చెప్పారు.కాని ఆయన మారిపోయారు నిజంగా మారిపోయారరు ఎంతలా అంటే తన బార్య కోరిక ప్రకారం తన ఆస్తిలో సగబాగం అనాధలకు రాసిచ్చేటంత. నేను ఆయన్నంత తొందరగా నమ్మను బాబూ … నిజమే ఆంటి కాని తన జీవిత చివరి దశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో తీసుకున్న నిర్నయం తప్పని నేననుకోను. ఆయన గురించి వదిలెయ్యండి.. మీ గురించి చెప్పు బాబూ…… నా గురించి చెప్పటానికే ముంటుంది ఆంటీ…. ఎందుకులేదు ఉదయం మిమ్మల్ని చూశాను రోడ్ దాటించటం అదీ చూస్తే మీరు మీ నాన్నలా కాదనిపిస్తుంది.మీకంతా మీ అమ్మ పోలిక అనిపిస్తుంది. నిజమే ఆంటీ మా నాన్నకూడ ఎప్పుడూ అంటుంటారు. ఇంతలో ఒక లేడీ తలుపు తెరిచి మేడం ఈ మద్యాహ్నం వరకు సరుకులు సరిపోతాయి సాయంత్రానికి ఏమీ లేవు. అలాగా నువు వెళ్లు నేను వస్తా. ఏంటి మేడం ఈ శరణాలయం అంత దయనీయంగా వుందా? ఏం చేస్తాం బాబు అందరిలా మేము విరాళాల కోసం కాకుండా ఉన్నంతలో నెట్టుకొస్తున్నాం. ప్రచారం కూడా చేసుకోము అందుకే కాస్త ఇబ్బంది పడుతున్నాం…..మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా వుంది ఆంటీ. బాధెందుకు బాబూ అంతా పైవాడి ఆట ఆయన ఎలా ఆడమంటే అలా అంతే…. సరె ఆంటీ నేను బయలుదేరుతా ఆంటీ కాస్త మా అమ్మ ఆచూకి తెలిస్తే నాకు కాల్ చేయండని విజిటింగ్ కార్డు ఇచ్చి వెల్లాడు దేవా.

మేడం ఎవరో మన అకౌంటులో పాతికలక్షలు డిపాజిట్ చేశారు, అవునా? ఎవరు? తెలియటం లేదు మేడం. సరె నువు వెళ్లి రెండులక్షలు డ్రా చేసుకురా. అలాగే మేడం. శారద ఆలోచనంతా ఆ దాత ఎవరని వెదుకుతోంది ఇంతలో ఫోను రింగ్ అయ్యింది. హలో ఎవరు? నేను మీ అభిమానిని. ఓహో మీ అభిమానం విలువ పాతిక లక్షలా? పాతిక చాలా తక్కువ .. ఇంతకీ మీ పేరు చెప్పలేదు.చెప్పానుగా అభిమాని అని. చాలాబాగ మాట్లాడుతున్నారే. మీరనుమతిస్తే ఇంకా బాగా మాట్లాడుతాను.అలా అయితే నాపర్సనల్ నంబరుకు కాల్ చేయాలి.. ఇలాఆఫీస్ నంబరు కాదు. మీరు నంబరు ఇవ్వలేదు కదా? అడగకుండా ఎలా ఇవ్వాలి.రాసుకోండి 9 – – – 4 6 26 69. నంబరు చాలా బాగుంది. త్యాంక్స్.

దేవానంద్ గారు రండి ఎలా వున్నారు? నాట్ గుడ్ మేడం. ఏమైంది? మా అమ్మ గురించి ఏమైనా తెలిసిందా మేడం. ఎలా వెతకాలండీ..కనీసం ఒక ఫోటో కూడా ఇవ్వలేదు మీరు. ఆ అదృష్టము నాకే లేదు మేడం మీకు ఫోటో నేను ఎలా ఇవ్వాలి. అర్థం కాలేదు బాబు. మా అమ్మ మీద కోపంతో మా నాన్న ఏనాడో తన గుర్తులన్నీ బూడిద చేశారండి. కన్నతల్లి ఎలావుంటుందో కూడా తెలియని దురదృష్టవంతున్నండి.

బాధపడకు బాబూ …ఇలా చూడు నేను మీ అమ్మలాంటి దాన్ని అనుకో. అప్పు డపుడు ఇలా వస్తూవుండు.