ఉదయం ఆరింటికి అలారం మోగింది… సంజన దాదాపు ఆరాత్రి నిద్రే పోలేదు… వివేక్ కూడా అంతే…. వాళ్ళ మనసుల్లో వేల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎన్నాళ్లుగానో భయపడుతున్నది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చేసరికి సంజనలో మరింత భయం పెరిగింది.
“ఇంట్లో ఎవరూ లేకుండా… ఒక పరాయి మగాడు రాత్రంతా తనతో ఉంటే…!!? పక్కవాల్లు ఏమనుకుంటారు” అనుకుంది సంజన.. వాళ్ళు ఉండేది పెద్ద City, ఎవరి గోల వారిదే అన్నట్టు ఉండే సొసైటీ అయినా…. సంజన ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకుంది… తన వైపు నుంచి గానీ, వివేక్ వైపు నుంచి గానీ బంధువుల సపోర్ట్ లేకపోవడంతో పక్కవాల్లతో ఎక్కువ సన్నిహితంగా మెలుగుతూ ఉండేది… పిల్లల పెంపకం విషయంలో, ఇతర విషయాల్లో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండేది… అపార్ట్మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు ఉండడం వల్ల కూడా ఆమె చాలా మందికి తెలుసు… ఇప్పుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఎవరో ఉంటే వెంటనే ఎందుకు అని తనని డైరెక్ట్ గానే అడుగుతారు. ఆలోచించిన కొద్దీ వివేక్ ఇంట్లోనే ఉంటే నయమనిపిస్తుంది… ఎవరైనా అడిగితే వివేక్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పవచ్చు అనుకుంది… అయితే వివేక్ ఉంటే ఆనంద్ ఏమంటాడో అనే సందేహం కూడా కలిగిందామెకి… ఒకవేళ ఆనంద్ పట్టించుకోకపోయినా వివేక్ ఉండగా ఆనంద్ తో ఉండడం అంటే సంజనకు ఏదోలా ఉంది… ఎంతసేపు ఆలోచించినా సరైన పరిష్కారం ఏంటో ఆమెకు తోచలేదు….
ఇది కాకుండా ఆమెకు ఇంకో దిగులు కూడా పట్టుకుంది… ” ఉంపుడుగత్తె గా ఉండడం అంటే అర్థం ఏమిటి?”.. అప్పుడు ఆనంద్ ఏది చెప్పినా తలూపినందుకు తనని తాను తిట్టుకుంది సంజన… “అంటే వివేక్ నూ, పిల్లల్నీ వదిలేయాలా…” ఆ ఆలోచన రాగానే ఆమె వెన్నులో సన్నగా వణుకు పుట్టింది… ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె అందుకు ఒప్పుకోదు… ఆలోచించినకొద్దీ ఆమెలో కన్ఫ్యూజన్ పెరగసాగింది…
“వీటన్నింటికీ సరైన పరిష్కారం దొరకాలంటే ఈరోజు నేను జాగ్రత్తగా వ్యవహరించాలి…ఆనంద్ ను అతని ఉద్దేశ్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి…. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను…” మనసులో అనుకుంది సంజన… అలా అనుకున్నాక బెడ్ మీదనుంచి లేచింది…
వివేక్ కూడా బాధ పడుతున్నాడు… అతని బాధ మరో రకం… ‘తన భార్యతో అనుబంధం ఇంతటితో ముగిసిందా… ఆమె తనను విడిచి వెళ్ళి పోతుందా… ‘ అనేది అతని బాధల్లో మొదటిది… సంజనను ఇంట్లో ఆనంద్ తో ఒంటరిగా వదిలేయడం కూడా అతనికి ఇష్టం లేదు… అతను సంజనను సరిగ్గా ట్రీట్ చేస్తాడా… అని దిగులు పట్టుకుంది వివేక్ కి… కానీ తాను ఏమీ చేసే స్థితిలో లేడు… లక్ష ప్రశ్నలతోనే బెడ్ మీద నుంచి లేచాడు వివేక్…. అలారం మోగడంతో భారమైన కళ్ళతో పైకి లేచిన వాళ్లు… దినచర్య లోకి దిగారు… ముందుగా లేచిన సంజన వాష్ రూమ్ కి వెళ్ళింది
ఆమె బయటికి వచ్చాక వివేక్ తన దినచర్యను ప్రారంభించాడు… వాళ్లు ఎక్కువగా ఏమీ మాట్లాడుకోలేదు… వివేక్ పిల్లల్ని లేపి వాళ్ళకు స్నానం అదీ చేయించాడు.. వాళ్ళతో కాసేపు సరదాగా గడిపాడు… సంజన లైట్ గా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసింది… పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ తినిపించి, లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది… తరువాత బజార్ నుండి తేవలసిన లిస్ట్ ఒకటి తయారు చేసి వివేక్ ఇచ్చి తీసుకు రమ్మని చెప్పింది… లిస్టు తీసుకుని వివేక్ బయటకు వెళ్ళాక ఆమె స్నానాల గది లో దూరింది… కొద్దిసేపు పూర్తి బాడీకి వ్యాక్సింగ్ చేసుకుంది… తల స్నానం చేసుకుని వచ్చి ముఖానికి బేసిక్ ప్యాక్ వేసుకుంది…
వివేక్ షాపింగ్ నుంచి తిరిగి వచ్చాడు… వెళ్ళేటప్పుడు ఏ అతడు లిస్టులో ఉన్న వస్తువుల్ని పరిశీలనగా చూశాడు… కొన్ని ప్రత్యేకమైన సబ్బులు, పర్ఫ్యూమ్లు, రూమ్ ఫ్రేషనర్ లు … కాస్త ఎక్కువగానే మల్లెపూలు లిస్టులో ఉన్నాయి… అవి కాకుండా రెగ్యులర్ గా ఇంట్లోకి వాడుకునే కొన్ని సామాన్లు ఉన్నాయి… ప్రత్యేక వస్తువులన్నీ ఆనంద్ కోసమే అని అతనికి అర్థమైంది… కారులో వెళ్తూ లిస్టు చూసినప్పుడు అతని కడుపు మండిపోయింది… అయినప్పటికీ అతను లిస్టులో ఉన్న ప్రతి వస్తువు కొనుక్కుని వచ్చాడు…
1:00 అవుతుండగా అతను ఇంటికి తిరిగి వచ్చాడు… తలుపు తీసిన సంజనను చూసి అతను స్టన్ అయిపోయాడు… లూజ్ హెయిర్… తేటగా ఉన్న ముఖం… గుప్పు మంటున్న ఆమె ఒంటి సువాసన…చూసి … ఆమె తల స్నానం చేసిందని… ఒంటికి వ్యాక్సింగ్ చేసుకుందని అర్థం అయింది వివేక్ కి… దాంతో అతనికి కడుపుమంట మరింత పెరిగింది… సంజన ఏమీ మాట్లాడకుండా అతను తెచ్చిన వస్తువులను తీసుకుని కిచెన్ లోకి వెళ్ళింది… వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసి… ఎక్కడ వస్తువుల్ని అక్కడ సర్దేసింది… డైనింగ్ టేబుల్ మీద లంచ్ ఏర్పాట్లు చేసి వివేక్ ని, పిల్లల్ని భోజనానికి పిలిచింది… తినేటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏమీ మాట్లాడుకోలేదు… చివర్లో సంజన పిల్లలతో చెప్పింది…
“పిల్లలూ మీరు ఈ రోజు రమ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు… అక్కడ ఈ రోజు మీరు చరణ్, దివ్య లతో ఆడుకోండి… రాత్రికి కూడా అక్కడే ఉండాలి సరేనా…” నవ్వుతూ చెప్పింది… పిల్లలు ఇద్దరూ హుషారుగా కేరింతలు కొట్టారు… గబగబా తినేసి అక్కడ్నుంచి వాళ్ళ వస్తువులు ప్యాక్ చేసుకోడానికి వెళ్లారు… “వివేక్… వీళ్ళని మధ్యాహ్నం మూడు గంటలకు తీసుకెళ్ళి రమ వాళ్ళింట్లో దింపిరా…” చెప్పింది సంజన… ” అలాగే సంజనా… ” ముభావంగా చెప్పాడు వివేక్… “ఇంకో విషయం… ” ప్లేట్ లోకి చూస్తూ తటపటాయిస్తూ అంది సంజన … ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆమెకు… ” చెప్పు సంజనా…” అన్నాడు వివేక్… ” నువు… నువు బయటకు ఎక్కడికీ వెళ్లకు… రాత్రికి ఇక్కడే ఉండు ” అంది అలాగే తల దించుకుని కిందికి చూస్తూ… వివేక్ చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు… అతనికి సంజనను ఒంటరిగా ఆ ఇంట్లో వదిలి వెళ్ళడం ఇష్టం లేదు… ” నువ్వీ రాత్రి మన గెస్ట్ బెడ్ రూం లో ఉండు… ఒకవేళ… ” తపటాయించింది సంజన…